పరువు హత్య: దళిత యువతిని ప్రేమించాడని తమ్ముడి హత్య

Published : Jun 29, 2019, 04:24 PM IST
పరువు హత్య: దళిత యువతిని ప్రేమించాడని తమ్ముడి హత్య

సారాంశం

తమిళనాడు రాష్ట్రంలో పరువు హత్య చోటు చేసుకొంది. దళిత యువతిని ప్రేమించిందనే అక్కసుతో  సోదరుడినే  అన్న నరికి చంపాడు. ఈ ఘటన కోయంబత్తూరుకు సమీపంలోని మెట్టుపాలయంలో చోటు చేసుకొంది.

చెన్నై:  తమిళనాడు రాష్ట్రంలో పరువు హత్య చోటు చేసుకొంది. దళిత యువతిని ప్రేమించిందనే అక్కసుతో  సోదరుడినే  అన్న నరికి చంపాడు. ఈ ఘటన కోయంబత్తూరుకు సమీపంలోని మెట్టుపాలయంలో చోటు చేసుకొంది.

వినోద్‌కుమార్ అనే 22 ఏళ్ల యువకుడి సోదరుడు కనకరాజు వర్షిత అనే దళిత యువతితో కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు.   ఈ విషయం వినోద్ కుమార్ కు తెలిసింది. దళిత యువతితో ప్రేమను వినోద్ కుమార్ వ్యతిరేకించాడు. ఈ విషయమై తన సోదరుడు కనకరాజుతో పాటు  ప్రియురాలు వర్షితను కూడ ఆయన తీవ్రంగా హెచ్చరించాడు.

అయితే ఈ విషయాన్ని వినోద్ కుమార్ తన తండ్రి మూర్తికి చెప్పాడు. అయితే మూర్తికి కానీ, యువతి తల్లిదండ్రులకు కానీ ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు. దీంతో  వేరే ఇంట్లో  ఉండాలని పెద్దలు సూచించారు. దీంతో కనకరాజు,  వర్షిత వేరే ఇంట్లో  నివాసం ఉంటున్నారు.

ఈ విషయాన్ని వినోద్ కుమార్  గుర్తించాడు. వినోద్ కుమార్ తన సోదరుడు కనకరాజుతో పాటు ప్రియురాలు వర్షితపై దాడి చేశాడు.  దీంతో  కనకరాజు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. దళిత యువతి వర్షిత తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !