Asianet News TeluguAsianet News Telugu

మున్సిఫల్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్: సాగర్‌లో మీటింగ్

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం శనివారం నాడు ప్రారంభమైంది. రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలు, మున్సిఫల్ ఎన్నికల్లో  అవలంభించాల్సిన వ్యూహంతో పాటు వలసలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
 

congress leaders meeting for planning municipal elections
Author
Nagarjuna Sagar, First Published Jun 29, 2019, 2:30 PM IST

నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం శనివారం నాడు ప్రారంభమైంది. రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలు, మున్సిఫల్ ఎన్నికల్లో  అవలంభించాల్సిన వ్యూహంతో పాటు వలసలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అనుసరింాచల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే వారంలో   మహాబూబ్‌నగర్ లో విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశం తర్వాత  నిజామాబాద్,  వరంగల్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేయనున్నారు. 

మున్సిఫల్ ఎన్నికల్లో  మెరుగైన ఫలితాలను సాధించాలని  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  భావిస్తోంది.ఈ మేరకు  ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.   ఇవాళ జరిగిన సమావేశంలో  కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ కుంతియా పాల్గొన్నారు.  

ఇవాళ సమావేశంలో మున్సిఫల్ ఎన్నికలతో పాటు కాలేశ్వరం ప్రాజెక్టుపై నిపుణుల అభిప్రాయాలను తీసుకొంటారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ  కార్యకర్తలపై పోలీసుల అక్రమ కేసులపై కూడ చర్చించనున్నారు.ఇదిలా ఉంటే ఈ సమావేశానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ,  పార్టీ నేత విజయ శాంతి హాజరుకాలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios