స్టెర్లింగ్ కుంభకోణం: రూ. 14 వేల కోట్ల కుచ్చుటోపి

By narsimha lodeFirst Published Jun 29, 2019, 4:59 PM IST
Highlights

పంజాబ్ నేషనల్ బ్యాంకు కంటే  పెద్ద కుంభకోణం చోటు చేసుకొందని  ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్  స్పష్టం చేసింది.  గుజరాత్ కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ ప్రమోటర్లు సందేసరా సోదరులు పలు బ్యాంకులకు రూ. 14 వేల కోట్లకు కుచ్చుటోపి పెట్టారని ఈడీ స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కంటే  పెద్ద కుంభకోణం చోటు చేసుకొందని  ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్  స్పష్టం చేసింది.  గుజరాత్ కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ ప్రమోటర్లు సందేసరా సోదరులు పలు బ్యాంకులకు రూ. 14 వేల కోట్లకు కుచ్చుటోపి పెట్టారని ఈడీ స్పష్టం చేసింది.

స్టెర్లింగ్ కంపెనీ, ఈ కంపెనీ ప్రమోటర్లు నితిన్ సందేసరా, చేతన్ సందేసరా, దీప్తి సందేసరా రూ. 5,393 కోట్ల బ్యాంకు రుణాల మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.  దీంతో 2017లో వీరిపై ఈడీ, సీబీఐ కేసులు నమోదయ్యాయి. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయని ఈడీ తెలిపింది.

భారత్‌లోని బ్యాంకుల నుండే కాకుండా విదేశాల నుండి భారతీయ బ్యాంకుల బ్రాంచీల నుండి కూడ సందేసరా గ్రూప్ దాదాపు రూ. 9వేల కోట్ల రుణాలు తీసుకొన్నారని ఈడీ స్పష్టం చేసింది.  తప్పుడు పత్రాలతో ఈ రుణాలను పొందినట్టుగా ఈడీ తేల్చింది.స్టెర్లింగ్‌ బయోటెక్‌ కేసులో ఇటీవల ఈడీ రూ. 9,778 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిం

click me!