నాగార్జునసాగర్:  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ  విస్తృత స్థాయి సమావేశంలో  సంగారెడ్డి ఎమ్మెల్యే పార్టీ నాయకత్వం తీరుపై మైక్ విసిరేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మున్సిఫల్ ఎన్నికలకు ఇంచార్జీల నియామకంలో పార్టీ నిర్ణయంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయమై పార్టీ సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో  కోపంతో  జగ్గారెడ్డి కోపంతో  మైక్‌ విసిరేశారు.


తెలంగాణ రాష్ట్రంలో రెండు మాసాల్లో  మున్సిఫల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. మున్సిఫల్  ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో  పాటు పలు అంశాలపై  చర్చించేందుకు నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో  మున్సిఫల్ ఎన్నికలకు ఇంచార్జీలను నియమించాలని  పార్టీ నాయకత్వం భావించింది. ఇదే విషయాన్ని పార్టీ సీనియర్లు సమావేశంలో ప్రస్తావించారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసిన  నేతలు, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను ఇంచరాజ్ీలుగా కొనసాగించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రతిపాదించారు.

అయితే ఈ ప్రతిపాదనను ఇద్దరు సీనియర్ నేతలు వ్యతిరేకించారు. అయితే  ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఏ రకమైన ఇబ్బందులు పడాల్సి వస్తోంది.. క్యాడర్‌ను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.

అయితే జగ్గారెడ్డి ప్రతిపాదనను ఓ నేత సమర్ధిస్తూనే ఇంచార్జీలను నియమించాలనేది పార్టీ నిర్ణయంగా  తేల్చి చెప్పారు. దీంతో  అగ్రహంతో జగ్గారెడ్డి తన చేతిలో ఉన్న మైక్‌ను వేదికపైకి విసిరికొట్టాడు. ఈ తరుణంలో మిగిలిన నేతలు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.