MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • దోమల జీవితకాలం ఎంతో తెలుసా..? అతితక్కువ కాలం బతికే 5 జీవులివే

దోమల జీవితకాలం ఎంతో తెలుసా..? అతితక్కువ కాలం బతికే 5 జీవులివే

అత్యధిక కాలం జీవించే జంతువు ఏది అనగానే టక్కున తాబేలు పేరు గుర్తుకువస్తుంది... మరి అతి తక్కువకాలం జీవించే జంతువులు అంటే..? చెప్పలేం. అయితే కేవలం కొన్నిగంటలు, రోజులు మాత్రమే బతికే జీవులు కూడా ఈ లోకంలో ఉన్నాయి.. వాటిగురించి ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 10 2026, 08:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పుట్టిన కొన్ని గంటలకే చనిపోయే జీవి...
Image Credit : X

పుట్టిన కొన్ని గంటలకే చనిపోయే జీవి...

ప్రకృతిలో ప్రతి జీవికి దానికంటూ ఓ పాత్ర ఉంటుంది. కొన్ని జీవులు తమ పని పూర్తి చేసుకుని ఈ లోకం నుంచి త్వరగా వెళ్లిపోతాయి. వీటిలో కొన్నింటి ఆయుష్షు కేవలం ఒక రోజైతే, మరికొన్ని వారం రోజులు మాత్రమే బతుకుతాయి. అలా పుట్టిన వెంటనే మరణించే 5 జీవుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కేవలం పుట్టిన గంటల్లోనే మరణించే జీవి ఏది..?
Image Credit : X

కేవలం పుట్టిన గంటల్లోనే మరణించే జీవి ఏది..?

ఈ లోకంలో అతి తక్కువకాలం బతికే జీవి మేఫ్లై (Mayfly). ఈ విషయంలో దీనికి 'వరల్డ్ రికార్డ్' ఉంది. ఈ మేఫ్లైలు కేవలం 24 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం మాత్రమే బతుకుతాయి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం.. ఆడ మేఫ్లైలు కేవలం ఐదారు గంటలు జీవిస్తుంది… మగవి మాత్రం సుమారు 1-2 రోజులు బతుకుతాయి. 

ఈ మేప్లై జీవుల ఏకైక లక్ష్యం సంతానోత్పత్తి. ఆశ్చర్యంగా వీటికి తినడానికి నోరు కూడా ఉండదు.. ఎందుకంటే తినేంత సమయం కూడా ఉండదు. ఇవి ఓ రకమైన రెక్కల కీటకాలు.. నీటి వనరుల వద్ద కనిపిస్తుంటాయి.

36
అతిచిన్న జీవిత ప్రయాణం
Image Credit : X

అతిచిన్న జీవిత ప్రయాణం

నీటిలో నివసించే గ్యాస్ట్రోట్రిక్ (Gastrotrich) జీవిది చాలా చిన్న జీవన ప్రయాణం. ఇది కంటికి కూడా సరిగా కనిపించని జీవి… దీని సైజు లాగే ఆయుష్షు కూడా చాలా చిన్నది. కేవలం మూడు నుంచి నాలుగు రోజుల్లో దీని జీవితం ముగుస్తుంది. ఈ కొద్ది సమయంలోనే ఇవి పెరిగి, పిల్లలకు జన్మనిచ్చి, చనిపోతాయి.

46
ఆహారం లేకుండానే జీవించే లూనా మాత్ (Luna Moth)
Image Credit : X

ఆహారం లేకుండానే జీవించే లూనా మాత్ (Luna Moth)

చాలా అందంగా కనిపించే ఈ సీతాకోకచిలుక జీవితకాలం కేవలం 7 రోజులు మాత్రమే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవి ఏమీ తినవు, తాగవు. ఎందుకంటే వీటికి కూడా నోరు ఉండదు… తమకున్న కొద్దిపాటి శక్తిని కేవలం తమ జతను వెతుక్కోవడానికి, సంతానోత్పత్తికి  ఉపయోగిస్తాయి.

56
డ్రాగన్‌ఫ్లై (Dragonfly)
Image Credit : X

డ్రాగన్‌ఫ్లై (Dragonfly)

ప్రపంచంలో సుమారు 5,000 కంటే ఎక్కువ జాతుల డ్రాగన్‌ఫ్లైలు ఉన్నాయి. వీటి గరిష్ట ఆయుష్షు కేవలం 4 నెలలు. కానీ వీటి జీవితంలో ఎక్కువ భాగం లార్వా దశలోనే గడిచిపోతుంది. రెక్కలు వచ్చాక ఇవి చాలా తక్కువ రోజులు మాత్రమే బతుకుతాయి.

66
చిన్న జీవితం, పెద్ద ప్రమాదం... దోమ (Mosquito)
Image Credit : X

చిన్న జీవితం, పెద్ద ప్రమాదం... దోమ (Mosquito)

మనుషులకు, ఇతర జంతువులకు వ్యాధులను వ్యాపింపజేసే దోమలు కూడా అల్పాయుష్షు జీవులే. మగ దోమలు కేవలం ఒక వారం మాత్రమే బతుకుతాయి. కానీ ఆడ దోమలు మగవాటి కంటే కొన్నిరోజులు ఎక్కువ కాలం జీవిస్తాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
Recommended image2
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్
Recommended image3
BRICS: బ్రిక్స్ సదస్సులో మోదీ వరుస భేటీలు.. దేశ భ‌విష్య‌త్తును మార్చే ఒప్పందాలు
Related Stories
Recommended image1
mosquito Free Country : ఏంటి మామా..! ప్రపంచంలో దోమలు లేని దేశముందా..! మ్యూజియంలో పెట్టి చూపిస్తారా..!!
Recommended image2
పిల్లలను దోమలు కుట్టకూడదంటే ఏం చేయాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved