ఒకప్పుడు సినిమాలు, క్రీడలు వేరువేరు ప్రపంచాలు. కానీ ఇప్పుడు ఆ రెండింటికి విడదీయరాని సంబంధం ఏర్పడింది. క్రికెటర్లు, సినీ తారలు యాడ్స్ లో కలిసి పనిచేయడం, పార్టీలు, వివిధ కార్యక్రమాల్లో కలుస్తుండటంతో క్రికెటర్లకు, సినీ తారలకు మధ్య ప్రేమ చిగురిస్తోంది. ఇందుకు పెద్ద ఉదాహరణ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంట. తాజాగా మరో బాలీవుడ్ భామ, యువ క్రికెటర్ మధ్య ప్రేమాయణం కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారిద్దరు కలిసున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది. 

యువ క్రికెటర్ కెఎల్ రాహుల్ తో బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి ప్రేమించుకున్నట్లు అటు క్రికెట్ వర్గాల్లో, ఇటు సీని వర్గాల్లోను గుసగుసలు వినబడుతున్నాయి. అయితే గతంలో నిధి అగర్వాల్, సోనాల్ చౌహాన్, ఆకాంక్ష రంజన్ లతో రాహుల్ ప్రేమాయణం సాగిస్తున్న ప్రచారం జరిగింది. అప్పుడు కూడా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.  తాజాగా అతియా శెట్టి తో రాహుల్ కలిసున్న ఫోటోలు భయటకు రావడంతో వారి మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

రాహుల్ ప్రేమస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న బాలీవుడ్ భామ ఆతియా ప్రముఖ నటుడు సునీల్ శెట్టి కూతురు. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు ఆమెకు పెద్ద హిట్లు లేకపోవడంతో హీరోయిన్ గా నిలదొక్కుకోడానికి ప్రయత్నిస్తున్నారు. 

అయితే అతియా స్నేహితురాలు, మోడల్ ఆకాంక్ష రంజన్ ఇన్స్టాగ్రామ్ లో రాహుల్ తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో కెఎల్ రాహుల్, ఆతియా, ఆకాంక్షలు సరదాగా నవ్వుకుంటూ కనిపించారు. దీంతో ఈ పోటో వైరల్ గా మారడం...అభిమానులు రాహుల్, ఆతియాలను ప్రేమ పక్షులుగా పేర్కొంటూ కామెంట్లు చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

...n i’m so good with that 💛

A post shared by 🦋Kanch (@akansharanjankapoor) on Apr 25, 2019 at 7:01am PDT