గుంటూరు:  మంగళగిరిలోని హాయ్ లాండ్ లో బీజేపీ కీలక నేతలు రహస్యంగా సమావేశమయ్యారు. పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ నేతలు మురళీధర్ రావు, జీవీఎల్ నరసింహారావు, మాజీకేంద్రమంత్రి పురంధీశ్వరిలు హాజరయ్యారు. 

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ పై చర్చించారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలపై సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో వివిధ పార్టీలకు చెందిన సుమారు 75 మంది కీలక నేతలు బీజేపీలో చేరనున్నారని వారి చేరికపై కూడా సమావేశంలో చర్చించారు. 

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలోపేతం కోసం ప్రత్యేక దృష్టిసారించాలని సమావేశం అభిప్రాయపడింది. పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో వాడీవేడీగా చర్చజరిగింది. జూలై 6 నుంచి ఆగష్టు 11 వరకు జరిగే సభ్యత్వ నమోదుపై చర్చించారు.