సంగారెడ్డి: దేశంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతేనని చెప్పుకొచ్చారు బీజేపీ జాతీయనేత మురళీ ధర్ రావు. కాంగ్రెస్ పార్టీ బ్యాటరీ లేని పార్టీ అంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చార్జింగ్ కూడా అయిపోయిందని ఎద్దేవా చేశారు. 

దేశంలో కార్యకర్తలు మాత్రమే నడిపించే ఏకైక పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. దేశంలో ఏ పార్టీకి లేనంతగా 11 కోట్ల సభ్యత్వం బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని ఆపడం ఎవరి తరం కాదన్నారు. టీఆర్ఎస్ ను వ్యతిరేకించే వారికి బీజేపీ మద్దతు ఉంటుందని తెలిపారు. తెలంగాణలో అత్యధికంగా బీజేపీ సభ్యత్వ నమయోదు చేయాలని కార్యకర్తలకు సూచించారు మురళీధర్ రావు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ నుంచి బీజేపీలోకి భారీ వలసలు: జంప్ చేసేందుకు 75 మంది కీలక నేతలు రెడీ