నందమూరి బాలకృష్ణ తిరిగి సినిమాల్లో బిజీ కాబోతున్నారు. ఎన్నికల సందర్భంగా కొంత గ్యాప్ ఇచ్చారు. ఇటీవల బాలయ్య, కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత బాలయ్యతో సినిమా చేయాలని బోయపాటి ప్రయత్నిస్తున్నాడు. కానీ బాలకృష్ణ ఆలోచన మాత్రం భిన్నంగా ఉందట. 

ప్రస్తుతం బాలయ్య రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలపై ఆసక్తి చూపడం లేదట. కొత్తదనం కోసం ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తే ఎలా ఉంటుంది..అందులో నందమూరి హీరోలంతా కలసి నటిస్తే ఎలా ఉంటుంది అని తన ఆలోచనని బాలయ్య సన్నిహితులతో వ్యక్తపరిచినట్లు ఫిలిం నగర్ టాక్. అంటే ఇది నందమూరి వారి మనం అన్నమాట. 

అక్కినేని హీరోలంతా కలసి మనం చిత్రంలో నటించారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. అదే తరహాలో జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో కలసి తాను నటించేవిధంగా ఓ చిత్రాన్ని ప్లాన్ చేయాలని బాలయ్య భావిస్తున్నాడు. ఈ లోచనని రచయితలకు చెబితే వారు మంచి కథ అందించడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ మొదలు కావాలంటే కాస్త టైం పడుతుంది. ఈ ఆలోచనని బాలకృష పూర్తి స్థాయిలో ఎప్పుడు అమలులో పెడతాడో వేచి చూడాలి.