ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుక్రవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా... వీరి భేటీలో..ఆంధ్రా, తెలంగాణ అధికారులపై ఆకసక్తికర సంభాషణ జరిగింది. ఈ సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇంతకీ మ్యాటరేంటంటే... ఇరు రాష్ట్రాల నదీ జలాలకు సంబంధించి.. జగన్, కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. అయితే... ఆయా సమస్యలపై చర్చించేందుకు మళ్లీ ఎప్పుడు భేటీ అవుతారని కేసీఆర్‌ తమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని అడిగారు. ‘‘వీళ్లు (ఏపీ అధికారులు) ఇక్కడి నుంచి వెళితే మళ్లీ దొరకరు. ఈ సమావేశం ముగిసిన వెంటనే భేటీ అవుతాం. రాత్రి పొద్దుపోయేవరకు, అవసరమైతే మరునాడు కూడా కూర్చుంటాం. అప్పటివరకు వీళ్లను అమరావతికి వెళ్లనిచ్చేది లేదు’’ అని ఎస్కే జోషి సరదాగా అన్నారు. 

‘ఓర్నీ.. ఆంధ్రోళ్లను అరెస్ట్‌ చేస్తరా? ఏంది!’’ అని కేసీఆర్‌ నవ్వుతూ ప్రశ్నించగా... ‘అరెస్ట్‌ చేయటమే!’ అని జోషీ అన్నారు. దీంతో అందరూ ఒక్కసారిగా నవ్వారు. మంచి కోసం అరెస్టు చేసినా ఫర్వాలేదు అని జగన్‌ కూడా నవ్వుతూ అన్నారు.ఘొ