తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:49 PM (IST) Jul 03
Shubman Gill: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ కొట్టాడు. 269 పరుగులతో లెజెండరీ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ రికార్డులను బద్దలు కొట్టాడు.
10:50 PM (IST) Jul 03
India space shield: 1,000కి పైగా మిలిటరీ శాటిలైట్‌లు కలిగిన చైనాతో భవిష్యత్తులో సమస్యలు రావచ్చనే హెచ్చరికల మధ్య భారత్ SBS-3తో వ్యూహాత్మక ప్రతిస్పందన చర్యలు చేపట్టింది. ఎందుకు ఇప్పుడు అంతరిక్షం రక్షణ వ్యవస్థ కీలకంగా మారింది?
10:35 PM (IST) Jul 03
KCR Health Update: తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అస్వస్థతతో యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన మధ్య యశోదా ఆస్పత్రి కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
09:29 PM (IST) Jul 03
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనాారోగ్యంతో యశోద హాస్పిటల్లో చేరారు. ఆయన పరిస్థితిపై ప్రస్తుత సీఎం రేవంత్ ఆరా తీశారు. ఇంతకూ కేసీఆర్ కు ఏమయ్యిందంటే..
08:27 PM (IST) Jul 03
Shubman Gill double century:ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో దుమ్మురేపే బ్యాటింగ్ తో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్ లో కెప్టెన్ గా తన మొదటి డబుల్ సెంచరీతో రికార్డుల మోత మోగించాడు.
08:18 PM (IST) Jul 03
ఏమిటీ..! కేవలం టెకీల కోసమే ఓ దేశాన్ని ఏర్పాటుచేస్తున్నారా..! అవును.. మీరు వింటున్నది నిజమే. భారతీయ సంతతి వ్యాపారవేత్త ఒకరు సరికొత్తగా ఆలోచించడమే కాదు దాన్ని నిజం చేస్తున్నారు. ఈ దేశం ఎక్కడ ఏర్పాటుచేస్తున్నారో తెలుసా?
07:49 PM (IST) Jul 03
Shubman Gill double century: ఎడ్జ్‌బాస్టన్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన తొలి టెస్ట్ డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసియన్ కెప్టెన్‌గా నిలిచాడు.
07:02 PM (IST) Jul 03
PM Narendra Modi Ghana Visit: ప్రధాని నరేంద్ర మోడీ ఘనా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు, వారి భార్య, ఉపాధ్యక్షుడు, స్పీకర్‌కు భారతీయ కళాఖండాలు బహుమతిగా అందించారు.
05:46 PM (IST) Jul 03
సాలరీ స్లిప్ లేకుండా భారతదేశంలో పర్సనల్ లోన్ ఎలా పొందాలి, ప్రత్యామ్నాయ పత్రాలు ఏమిటి? రుణం మంజూరు చేసేటప్పుడు బ్యాంకులు ఏమి చూస్తాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
05:41 PM (IST) Jul 03
PM Modi addresses Ghana’s Parliament: ప్రధాని మోడీ ఘనా పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ గ్లోబల్ సౌత్‌కు స్వరం ఇవ్వకుండా ప్రపంచ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. అభివృద్ధి అందరికీ కావాలి.. ఒక్కరికి మాత్రమే కాదని ప్రపంచానికి పిలుపునిచ్చారు.
05:39 PM (IST) Jul 03
హైదరబాద్ లోని ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెెలుసుకొండి.
05:29 PM (IST) Jul 03
ప్రస్తుతం ప్రతీ ఒక్కరిలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది. సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయాలని ఆలోచిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వ సంస్థలు మంచి పథకాలను అందిస్తున్నాయి. అలాంటి ఒక పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
05:10 PM (IST) Jul 03
మీరు కారుకి ట్యాంక్ ఫుల్ చేయిస్తుంటారా? అయితే మీరు తప్పకుండా ఆటో కట్ గురించి తెలుసుకోవాలి. లేకపోతే ఇంధనం లీక్ అయి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా కారు విడిభాగాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. ఆటోకట్ గురించి మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం.
04:50 PM (IST) Jul 03
ICC rankings: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ టెస్టుల్లో కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ మొదటిసారిగా టాప్ 10లోకి వచ్చాడు.
04:41 PM (IST) Jul 03
ఒకప్పుడు పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితమైన క్యాబ్ సేవలు ప్రస్తుతం చిన్న సిటీలకు కూడా విస్తరించాయి. దేశంలో వేలాది మంది ఈ సేవలను ఉపయోగించుకుంటున్నారు. అదే విధంగా ఎంతో మందికి ఈ రంగం ఉపాధిని కల్పిస్తోంది.
03:41 PM (IST) Jul 03
వ్యాపారం చేయడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. అయితే అన్ని వ్యాపారాలకు డబ్బుతో మాత్రమే పని ఉండదు. కొన్ని తెలివితేటలు కూడా ఉండాలి. తెలివితో లక్షలు సంపాదించే అలాంటి ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.
03:04 PM (IST) Jul 03
మైక్రోసాఫ్ట్, ఇంటెల్, గూగుల్, అమెజాన్ వంటి ప్రముఖ టెక్ కంపెనీలు 2025లో వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఆర్థిక సవాళ్లు, ఏఐ వినియోగం, వ్యాపార ప్రాధాన్యతలలో మార్పులు వంటి అంశాలు ఉద్యోగ కోతలకు దారితీస్తున్నాయి.
02:48 PM (IST) Jul 03
ఇండియన్ ఆర్మీ రూపొందించిన అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్ తేజస్ ఎమ్‌కే1ఏ. ఈ జెట్‌ను భారత దేశం స్వయంగా తయారు చేసింది. ఈ నేపథ్యంలో ఈ జెట్ తయారీకి సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో డీఆర్డీఓ క్లారిటీ ఇచ్చింది.
12:37 PM (IST) Jul 03
టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మస్కిటో డ్రోన్‌ను రూపొందించింది. ఇంతకీ ఏంటీ డ్రోన్.? వీటి ఉపయోగం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం.
12:34 PM (IST) Jul 03
వర్షాకాలంలో చాలా మంది కారు ఓనర్లు ఎదుర్కొనే సమస్య ఏంటంటే.. బ్యాటరీ డౌన్ అయిపోవడం.. ఇది ఎప్పుడైనా జరుగుతుంది. అందుకే ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ముందుగానే సిద్ధంగా ఉండటం ముఖ్యం. మీరు జర్నీలో ఉండగా ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
12:24 PM (IST) Jul 03
తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ రాజకీయ వారసత్వం కోసం ఇటు కేటీఆర్, అటు కవిత ప్రయత్నిస్తున్నారు. మరి ఎవరికి ఆయన వారసత్వం దక్కుతుంది? భవిష్యత్ లో తెలంంగాణ సీఎం కాబోయేది ఎవరు?
11:39 AM (IST) Jul 03
ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరుగుతోంది. దేశంలో దాదాపు అన్ని ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టీవీఎస్ కంపెనీ ఐక్యూబ్ సిరీస్‌లో భాగంగా కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది.
11:10 AM (IST) Jul 03
మారుతోన్న జీవనశైలి, పెరుగుతోన్న ఒత్తిడి, తీసుకునే ఆహారంలో మార్పులు.. కారణం ఏదైనా ఇటీవల గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని ఓ జిల్లాలో జరుగుతోన్న మరణాలు యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది.
10:27 AM (IST) Jul 03
తెలంగాణకు చెందిన సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ 2023 సంవత్సరానికి ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 12మందిని ఈ పురస్కారాల కోసం ఎంపికచేేసింది.
10:21 AM (IST) Jul 03
ప్రపంచంలో అత్యంత చిన్న దేశం ఏంటన్న ప్రశ్నలకు ఠక్కున చెప్పే సమాధానం వాటికన్ సిటీ. అయితే దీనికంటే చిన్న దేశం మరోటి ఉందని మీకు తెలుసా.? ఈ దేశ జనాభా కేవలం ముగ్గురు అంటే ముగ్గురే. ఇంతకీ ఏంటా దేశం.? ఎక్కడ ఉంది.? ఇప్పుడు తెలుసుకుందాం.
10:07 AM (IST) Jul 03
వోడాఫోన్-ఐడియా సూపర్ ఫ్యామిలీ ప్లాన్ తీసుకొచ్చింది. ఇది కుటుంబ సభ్యులందరికీ కావాల్సినంత డేటాను అందిస్తుంది. అంతేకాకుండా నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ తో పాటు 19 ఓటీటీలను ఉచితంగా యాక్సిస్ చేయొచ్చు. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడున్నాయి.
08:59 AM (IST) Jul 03
తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పరివాహక ప్రాంతాలకు వరద ప్రమాదం పొంచివుంది.