తెలంగాణకు చెందిన సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ 2023 సంవత్సరానికి ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 12మందిని ఈ పురస్కారాల కోసం ఎంపికచేేసింది. 

ఏసియా నెట్ న్యూస్ తెలుగు మాజీ సంపాదకులు కాసుల ప్రతాప్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ప్రతాప్ రెడ్డిని తెలంగాణలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేసింది. వివిధ రంగాలకు చెందినవారిని ఈ పురస్కారానికి ఎంపిక చేయగా పత్రికారంగంలో ప్రతాప్ రెడ్డికి ఈ గౌరవం దక్కింది.

12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు :

వివిధ రంగాలకు చెందిన 12 మందిని తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు 2023 కి ఎంపిక చేశారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు వీరి పేర్లను ప్రకటించారు. రంగాల వారిగా ఎవరిని ఈ పురస్కారాలకు ఎంపికయ్యారో తెలుసుకుందాం.

1. కాసుల ప్రతాప్ రెడ్డి (పత్రికా రంగం)

2. ఎలనాగ (కవిత)

3. ప్రభల జానకి (విమర్శ)

4. ఆర్.లక్ష్మిరెడ్డి (చిత్రలేఖనం)

5. సంపత్ రెడ్డి (శిల్పం)

6. పేరిణి రమేష్ లాల్ (నృత్యం)

7. హరిప్రియ (సంగీతం)

8. గుమ్మడి గోపాలకృష్ణ (నాటకం)

9.కడకంచి పాపయ్య (జానపదం)

10. ధూళిపాళ మహాదేవమణి (అవధానం)

11. కె. మలయవాసిని (ఉత్తమ రచయిత్రి)

12. శాంతి నారాయణ (నవలలు)

ఈ ప్రతిభా పురస్కారాలకు ఎంపికైనవారికి రూ.20,116 నగదు కూడా అందనుంది. వీరందరికి త్వరలోనే హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి ఈ పురస్కారాలను అందజేయనుంది తెలుగు యూనివర్సిటీ. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చినవారిని ప్రోత్సహించడానికే ఈ అవార్డులను అందిస్తోంది తెలుగు వర్సిటీ.