- Home
- Business
- Car Safety Tips: మీ కారుకు ఎప్పుడూ ట్యాంక్ ఫుల్ చేయిస్తుంటారా? మరి ఆటో కట్ గురించి తెలుసా? నిర్లక్ష్యం చేస్తే కారే దెబ్బతింటుంది
Car Safety Tips: మీ కారుకు ఎప్పుడూ ట్యాంక్ ఫుల్ చేయిస్తుంటారా? మరి ఆటో కట్ గురించి తెలుసా? నిర్లక్ష్యం చేస్తే కారే దెబ్బతింటుంది
మీరు కారుకి ట్యాంక్ ఫుల్ చేయిస్తుంటారా? అయితే మీరు తప్పకుండా ఆటో కట్ గురించి తెలుసుకోవాలి. లేకపోతే ఇంధనం లీక్ అయి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా కారు విడిభాగాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. ఆటోకట్ గురించి మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఇంధనం ఆదా చేయడం అవసరం
కారులో ఊరికి వెళ్తే ట్యాంక్ ఫుల్ చేయడం చాలా మందికి అలవాటు. అయితే అలా చేయడం వల్ల ఇంధనం లీక్ అయి పెద్ద ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. దారిలో పెట్రోల్ దొరకకపోతే ఇబ్బంది పడతామన్న కారణంగా చాలా మంది ట్యాంక్ ఫుల్ చేయిస్తుంటారు. కానీ చాలా ఆటోమొబైల్ కంపెనీలు, కార్ల తయారీ కంపెనీలు ట్యాంక్ ఫుల్ చేయమని చెప్పవని చాలా మందికి తెలియవు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కొంత రిస్క్ ఉంటుంది.
ఆటో కట్ అంటే ఏమిటి?
మీరు ఫ్యూయల్ నింపేటప్పుడు ఆ నాజిల్‌లోని సెన్సార్ ఒక దశలో “ఆటో కట్” అవుతుంది. అంటే ట్యాంక్‌లో తగినంత ఇంధనం వెళ్లిపోయింది. ఇంక నింపాల్సిన అవసరం లేదు అని అది శబ్దం చేస్తుంది. దాన్ని మనం పట్టించుకోకుండా ఇంకా ఇంధనాన్ని నింపుతాం. అంటే మరింత నిండుగా, మరో రెండు, మూడు లీటర్లు బలవంతంగా నింపిస్తాం. ఇదే పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది.
ఆటో కట్ ఎందుకు ముఖ్యం?
ఆటో కట్ శబ్దం వచ్చిన వెంటనే ఫ్యూయల్ నింపడం ఆపేయాలి. ఎందుకంటే లోపల గాలికి స్థలం ఉండాలి. వెహికల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ట్యాంకులో ఉన్న ఇంధనం వేడికి వ్యాకోచిస్తుంది. ఆ సమయంలో ట్యాంకులో అది కొంచెం ఎక్కువ ప్లేస్ తీసుకుంటుంది. అప్పుడు స్థలం లేకపోతే ఇంధనం ఒత్తిడి పెరిగి ట్యాంకు నుంచి ఆయిల్ లీకయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్నే స్పిల్లేజ్ అంటారు.
పెట్రోల్ లీకైతే ఎలాంటి సమస్యలు వస్తాయి?
- కారు వెనుక లేదా పక్కన పెట్రోల్/డీజిల్ లీక్ అవుతుంది.
- కారు పెయింట్ మీద పడితే అది తుప్పు పడుతుంది. లేదా రంగు దెబ్బతినడం, ప్లాస్టిక్ భాగాలు పాడవడం వంటి సమస్యలు వస్తాయి.
- ఫ్యూయల్ బయటకు లీక్ కావడం వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. చిన్న మంటే పెద్ద ప్రమాదంగా మారుతుంది.
- కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఫ్యూయల్ లీక్ వల్ల జరిగే ప్రమాదాలకు, సమస్యలకు వారంటీ ఇవ్వవు.
ఫ్యూయల్ నింపుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
నాజిల్ ఆటోమేటిక్ కట్ అయిన వెంటనే ఫ్యూయల్ నింపడం ఆపేయండి. నింపిన తర్వాత ఇంధనం మరకలు లేకుండా వస్త్రంతో శుభ్రంగా తుడవండి. ఆటోకట్ నిబంధనను రెంట్ కార్ కంపెనీలు పక్కాగా ఫాలో అవుతాయి. ఎందుకంటే వాటికి కారు పరిస్థితి, భద్రత, భీమా నిబంధనలు అన్నీ ముఖ్యమే. అదేవిధంగా మీ కారును కూడా ఎక్కువ కాలం ఉంచుకోవాలంటే మీరూ కూడా ఎప్పుడూ ట్యాంక్ 90% వరకు నింపండి. నాజిల్ ఆటోమేటిక్ కట్ అయిన వెంటనే ఆపేయండి. ఇంధనం వేడికి వ్యాకోచించినప్పుడు ఆ ఖాళీ స్థలం భద్రతను కల్పిస్తుంది. ఈ కొన్ని నిమిషాల జాగ్రత్త మీ కారును, మీ ప్రాణాలను కాపాడుతుంది.