టెకీల కోసమే ప్రత్యేక దేశాన్ని సృష్టిస్తున్నావా..! ఏం ప్లానేసావు గురూ..!
ఏమిటీ..! కేవలం టెకీల కోసమే ఓ దేశాన్ని ఏర్పాటుచేస్తున్నారా..! అవును.. మీరు వింటున్నది నిజమే. భారతీయ సంతతి వ్యాపారవేత్త ఒకరు సరికొత్తగా ఆలోచించడమే కాదు దాన్ని నిజం చేస్తున్నారు. ఈ దేశం ఎక్కడ ఏర్పాటుచేస్తున్నారో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
నువ్వు మామూలోడివి కాదు గురూ... దేశాన్నే సృష్టిస్తున్నావా!
బాగా డబ్బులుండే వ్యాపారవేత్తలు కొత్తగా కంపెనీలు పెట్టడం చూస్తుంటాం... ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం చూస్తుంటాం. కానీ ఈ భారత సంతతి అమెరికన్ బిజినెస్ మ్యాన్ చాలా స్పెషల్... ఆయన ఏకంగా ఓ కొత్త దేశాన్నే సృష్టించడానికి సిద్దమయ్యారు. అదికూడా కేవలం టెక్నీషియన్లు, క్రియేటర్లు, స్టార్టప్ వ్యవస్థాపకుల కోసమే. ఇలా టెక్నాలజీని అందిపుచ్చుకునే దేశాన్నే సృష్టించాలని చూస్తున్నారు భారతీయ సంతతి వ్యాపారవేత్త బాలాజీ శ్రీనివాసన్.
సరికొత్తగా ఆలోచించడమే కాదు... దాన్ని ఆచరణలో పెడుతున్నాడు శ్రీనివాసన్. తన కలల దేశానికి 'నెట్ వర్క్ స్టేట్' అని ముందే పేరు ఖరారు చేశారు. ఇప్పుడు ఏకంగా సిగపూర్ దగ్గర్లో ఓ ద్వీపాన్ని కొనుగోలు చేసి తన ప్రాజెక్టును అమలుచేసేందుకు సిద్దమయ్యారు.
ఊహను నిజం చేస్తున్న శ్రీనివాసన్
కాయిన్‌బేస్ మాజీ సిటివో, సిలికాన్ వ్యాలీలో చాలా కంపెనీల సహ వ్యవస్థాపకులు శ్రీనివాసన్ ఆన్‌లైన్ కమ్యూనిటీలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన దేశాలుగా ఎదుగుతాయని ఊహించారు. ఇది ఒకప్పుడు భవిష్యత్ గురించి ఆలోచించే ప్రయోగంలా అనిపించినా ఇప్పుడు నిజమైన ప్రజలతో నిజమైన ద్వీపంలో ఆవిష్కృతం అవుతోంది. ఈ ప్రణాళిక చాలా ఆసక్తికరంగా ఉంది.
'ఈ ద్వీపం నెట్‌వర్క్ స్కూల్ కి నిలయం. ఇది వ్యాపార నైపుణ్యాలు, కొత్త టెక్నాలజీలు, వ్యక్తిగత మార్పుల గురించి నేర్పించే మూడు నెలల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. పెద్ద ఆశయాలు, కొత్త ఆలోచనలు ఉన్నవారిని ఇక్కడికి ఎంపిక చేస్తారు. జిమ్ సెషన్లతో మొదలై, AI వర్క్‌షాప్‌లు, బ్లాక్‌చైన్, స్టార్టప్ ఇన్నోవేషన్ల గురించి నేర్చుకుంటారు' అని శ్రీనివాసన్ తెలిపారు.
"మనకి ఒక ద్వీపం దొరికింది. సింగపూర్ దగ్గర ఒక అందమైన ద్వీపం దొరికింది. అక్కడ నెట్‌వర్క్ స్కూల్ కడుతున్నాం" అని శ్రీనివాసన్ X (ట్విట్టర్)లో రాసుకున్నారు.
కొత్త తరహా దేశం!
శ్రీనివాసన్ చాలా కాలంగా ఎల్లలు లేని దేశాన్ని కట్టాలని అనుకుంటున్నారు. టెక్నీషియన్ల కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా దేశాన్ని నిర్మించాలని ఆయన ఆలోచన.
భారతదేశంలో ఇంతకు ముందు చాలా మంది ప్రైవేట్ ద్వీపాలను కొన్నారు, కానీ చివరిగా ఈ ఘనత సాధించింది నిత్యానంద స్వామి మాత్రమే. ఇప్పుడు శ్రీనివాసన్ 2022లో రాసిన 'ది నెట్‌వర్క్ స్టేట్' అనే పుస్తకంలోని ఆలోచనను నిజం చేయాలని చూస్తున్నారు. ఆయన ప్రకారం ముందుగా ఆన్‌లైన్‌లో ఉనికిలో ఉండి, తర్వాత భౌతిక ప్రదేశాన్ని సంపాదించుకుని, చివరికి ప్రపంచ గుర్తింపు కోసం చర్చలు జరపడం దీని ఉద్దేశ్యం.
శ్రీనివాసన్ నెట్ వర్క్ స్కూల్ ఎలా ఉదంటే...
ఇందులో ఇప్పటికే పాల్గొన్న కంటెంట్ క్రియేటర్ నిక్ పీటర్సన్…ఈ ద్వీపం వర్చువల్ టూర్ వీడియోను షేర్ చేస్తూ దాన్ని " కొత్త కంపెనీల వ్యవస్థాపకుల స్వర్గధామం" అని అభివర్ణించారు. "నేను నెట్‌వర్క్ స్కూల్ అనే ఈ నిజ జీవిత ప్రయోగంలో నివసిస్తున్నాను, ఇక్కడ మేము కొత్త దేశాన్ని ఎలా సృష్టిస్తామో పరీక్షిస్తున్నాము" అని ఆయన అన్నారు.
ఆరోగ్యం, సంపదపై దృష్టి సారించిన "విన్-హెల్ప్-విన్" సమాజాలను పెంపొందించడానికి ఈ స్కూల్‌ను రూపొందించినట్లు శ్రీనివాసన్ చెబుతున్నారు. డిజిటల్ యుగంలో సరికొత్తగా ఆలోచిస్తూ ఆయన విస్తృత లక్ష్యంలో ముందుకు వెళుతున్నారు.
ఎవరీ బాలాజీ శ్రీనివాసన్?
న్యూయార్క్‌లో తమిళ సంతతికి చెందిన వైద్యుల కుటుంబంలో జన్మించిన బాలాజి శ్రీనివాసన్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్, కెమికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీలు పొందారు. గత రెండు దశాబ్దాలుగా కౌన్సిల్, ఎర్న్.కామ్, టెలిపోర్ట్ వంటి చాలా ప్రముఖ టెక్నాలజీ కంపెనీలను సహవ్యవస్థాపకులుగా ఉన్నారు. బిట్‌కాయిన్, ఎథెరియం, ఓపెన్‌సీ, ఆల్కెమీలలో తొలినాళ్లలో పెట్టుబడులు పెట్టారు.
44 ఏళ్ల శ్రీనివాసన్ సిలికాన్ వ్యాలీలో అత్యంత ప్రగతిశీల ఆలోచనలు కలిగినవారిలో ఒకరు. 2024లో ఆయన ఈ ఆగ్నేయాసియా ద్వీపంలో మొదటి నెట్‌వర్క్ స్కూల్‌ను ప్రారంభించారు. దుబాయ్, టోక్యో, మయామిలలో భవిష్యత్తులో క్యాంపస్‌లను ప్రారంభించాలని ప్రణాళికలు ఉన్నాయి.