MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • India space shield: చైనా కిల్ మెష్ కు SBS-3 స్పేస్ షీల్డ్ తో భారత్‌ కౌంటర్.. అసలు ఏంటిది?

India space shield: చైనా కిల్ మెష్ కు SBS-3 స్పేస్ షీల్డ్ తో భారత్‌ కౌంటర్.. అసలు ఏంటిది?

India space shield: 1,000కి పైగా మిలిటరీ శాటిలైట్‌లు కలిగిన చైనాతో భవిష్యత్తులో సమస్యలు రావచ్చనే హెచ్చరికల మధ్య భారత్‌ SBS-3తో వ్యూహాత్మక ప్రతిస్పందన చర్యలు చేపట్టింది. ఎందుకు ఇప్పుడు అంతరిక్ష రక్షణ వ్యవస్థ కీలకంగా మారింది?

3 Min read
Mahesh Rajamoni
Published : Jul 03 2025, 10:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అంతరిక్షంతో యుద్ధ తంత్రం మారిందా?
Image Credit : Gemini

అంతరిక్షంతో యుద్ధ తంత్రం మారిందా?

అంతరిక్షం, ఒకప్పుడు శాస్త్రీయ అన్వేషణలు, ప్రయోగాలకు మాత్రమే పరిమితమైనదిగా ఉండేది. కానీ, ఇప్పుడు ఆధునిక యుద్ధంలో అంతిమ క్షేత్రంగా మారింది. ఈ మాటలు కేవలం డ్రామా కోసం చెప్పినవి కావు. చైనా అంతరిక్ష సైనికీకరణలో సాధిస్తున్న అద్భుతమైన పురోగతికి భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద రక్షణ సవాలును ఇవి స్పష్టం చేస్తున్నాయి.

"అంతరిక్షం అనేది అంతిమ వ్యూహాత్మక స్థలం. దానిని రక్షించుకోకపోతే, మిగతా బలాలు అన్ని నిర్వీర్యం అవుతాయి" అని ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ చెప్పిన మాటలు కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు.. ఇది భారత రక్షణ వ్యవస్థ ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సవాలుకు సూచనగా కూడా చూడవచ్చు.

26
ఆకాశంలో కూడా చైనా గ్రేట్ వాల్ !
Image Credit : AI-generated image (Representative photo)

ఆకాశంలో కూడా చైనా గ్రేట్ వాల్ !

చైనా గత పదేళ్లలో అంతరిక్షంలో కూడా గ్రేట్ వాల్ ను నిర్మించింది. అంటే ఈ దశాబ్ద కాలంలో భారీ స్థాయిలో అంతరిక్షంలో మిలిటరీ శక్తిని నిర్మించుకుంది. అదేలా అనుకుంటున్నారా? 2010లో కేవలం 36 శాటిలైట్‌లతో ప్రారంభమైన చైనా ప్రయాణం, ఇప్పుడు 1,000కి పైగా శాటిలైట్‌లకు చేరింది. వీటిలో 500కి పైగా శాటిలైట్‌లు ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, రీకనిసెన్స్ (ISR), ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలతో కూడి ఉన్నాయి.

చైనా యావోగన్‌, జియెస్ఎస్‌ (TJS), గాఓఫెన్‌ వంటి శాటిలైట్‌ల ద్వారా హై-రిసల్యూషన్ కెమెరాలు, సింథటిక్ అపర్చర్ రాడార్ (SAR), ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలతో అంతరిక్షం నుంచి అద్భుతమైన నిఘా సామర్థ్యం సాధించింది.

ఇది ఇక్కడితో ఆగలేదు. చైనా తన మిలిటరీని పునర్నిర్మించి PLA ఏరోస్పేస్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఇది ‘సాఫ్ట్ కిల్’ (సైబర్ యుద్ధం)తో పాటు ‘హార్డ్ కిల్’ (అంతరిక్ష క్షిపణులు, కో-ఆర్బిటల్ ఉపగ్రహాలు) పద్ధతులతో కూడిన ఒక సమగ్ర ‘కిల్ మెష్‌’ వ్యవస్థను రూపొందించింది. ఈ వ్యవస్థ ఉపగ్రహాలనుండి భూమి, నౌకా దళం, వైమానిక దళానికి నేరుగా సమాచారాన్ని చేర్చగలదు.

అంటే, చైనా ఇప్పుడు అంతరిక్షం నుండి భూమిపై జరిగే ప్రతి కదలికను పర్యవేక్షించడమే కాకుండా, శత్రు ఉపగ్రహాలను, ఇతర వ్యవస్థలను ధ్వంసం చేయగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Related Articles

Related image1
PM Modi: పీఎం మోడీ ప్రత్యేక బహుమతులు.. ఘనా నేతలకు భారతీయ కళాఖండాలు
Related image2
China kill web: చైనా కిల్ వెబ్ పై అమెరికా ఆందోళన.. ప్రపంచ దేశాలకు ముప్పు.. ఏంటిది?
36
ఆపరేషన్ సింధూర్‌తో భారత్‌కు స్పష్టమైన హెచ్చరిక
Image Credit : Nasa.Gov

ఆపరేషన్ సింధూర్‌తో భారత్‌కు స్పష్టమైన హెచ్చరిక

2025 మేలో భారత్‌ పాకిస్తాన్‌పై ‘ఆపరేషన్ సింధూర్’ ప్రారంభించింది. ఈ సైనిక చర్యలో ఒక స్పష్టమైన లోపం బయటపడింది. అదే ఉపగ్రహాల ద్వారా తక్షణ సమాచారాన్ని సేకరించడంలో జాప్యం జరిగింది. దీనివల్ల నిఖార్సైన ఇంటెలిజెన్స్‌లో గ్యాప్ ఏర్పడింది.

ఇంకా తీవ్రమైన విషయం ఏంటంటే, ఆపరేషన్ అనంతరం పాకిస్తాన్ రక్షణ మంత్రి వెల్లడించిన ప్రకారం, చైనా ఆ సమయంలో పాక్‌కు ఉపగ్రహ సమాచారాన్ని అందించిందట. ఇది చైనా-పాక్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిరూపించగలిగింది. ఈ సంఘటన, అంతరిక్ష నిఘా వ్యవస్థ ఆవశ్యకతను భారతదేశానికి మరింత స్పష్టంగా తెలియజేసింది.

46
భారతదేశ 'స్పేస్ షీల్డ్': SBS-3 తో అంతరిక్ష కవచం
Image Credit : freepik

భారతదేశ 'స్పేస్ షీల్డ్': SBS-3 తో అంతరిక్ష కవచం

చైనా అంతరిక్ష ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం గట్టి సమాధానమే ఇస్తోంది. అదే స్పేస్-బేస్డ్ సర్వైలెన్స్ ఫేజ్-3 (SBS-3) ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్‌ కింద భారత్ 2029 నాటికి 52 రక్షణ శాటిలైట్‌లను ప్రయోగించనుంది. మొదటి శాటిలైట్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి నింగిలోకి పంపే ప్రణాళిక ఉంది.

ఈ శాటిలైట్‌లలో LEO (లో ఎర్త్ ఆర్బిట్‌), GEO (జియో స్టేషనరీ ఆర్బిట్‌) శాటిలైట్‌లు ఉంటాయి. ఈ ఉపగ్రహాలు ఏఐ శక్తితో పగలు-రాత్రి తేడా లేకుండా, అన్ని వాతావరణ పరిస్థితులలో నిఘాను అందిస్తాయి. వీటి ప్రత్యేకతలు గమనిస్తే..

• SAR ద్వారా రాత్రి పగలు, వర్షం, పొగమంచు వంటి ప్రతికూల వాతావరణంలోనూ స్పష్టమైన రియల్ టైమ్ చిత్రాలను అందిస్తాయి.

• థర్మల్ ఇమేజింగ్ ద్వారా మానవ కదలికలను గుర్తిస్తాయి. మరీ ముఖ్యంగా సైనిక చర్యలను వెంటనే గుర్తించే సామర్థ్యం ఉంటుంది.

• శాటిలైట్‌ల మధ్య స్వతంత్రంగా సమాచార మార్పిడి కూడా ఉంటుంది. అంటే ఒక శాటిలైట్ సందేహాస్పద కదలికను గమనిస్తే, మరో శాటిలైట్‌కి ఆ ప్రాంతాన్ని ఫోకస్ చేయమని సూచనలు చేస్తుంది.

దీని ద్వారా భారత దళాలకు రియల్ టైమ్ గూఢచార సమాచారం, భారీ మొత్తంలో డేటాను డౌన్‌లోడ్ చేసి, ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేకుండా, తక్షణమే చర్యలు తీసుకునే అవకాశం లభిస్తుంది. ఇది నిర్ణయం తీసుకోవడానికి పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

56
వ్యూహాత్మక పెట్టుబడులు, భారీ బడ్జెట్
Image Credit : Getty

వ్యూహాత్మక పెట్టుబడులు, భారీ బడ్జెట్

SBS-3 కార్యక్రమం కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇది భారతదేశ విస్తృత వ్యూహాత్మక రక్షణ పుష్‌లో భాగంగా ఉంది. అందుకే SBS-3 ప్రోగ్రామ్‌కు 2023లో కేంద్రం ఆమోదం తెలిపింది. దీని కోసం సుమారు రూ.27,000 కోట్లు కేటాయించారు. ఇది భారత రక్షణ రంగం పెద్ద ఎత్తున అంతరిక్షాన్ని ఉపయోగించాలన్న దిశలో ముందడుగుగా చెప్పవచ్చు.

2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత్ రక్షణ బడ్జెట్ రూ.6.8 లక్షల కోట్లను దాటి రికార్డు స్థాయికి చేరింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇది రూ.7 లక్షల కోట్లను దాటి మరింత పెరిగే అవకాశం ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

66
2047 నాటికి రక్షణ ఖర్చులు ఐదింతలు పెరిగే ఛాన్స్
Image Credit : our own

2047 నాటికి రక్షణ ఖర్చులు ఐదింతలు పెరిగే ఛాన్స్

2047 నాటికి రక్షణ ఖర్చులు ఐదింతలు పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పెరుగుదలలో ఎక్కువగా అంతరిక్ష ఆధారిత నిఘా వ్యవస్థలపై పెట్టుబడుల రూపంలో ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ కొత్త ఉపగ్రహ వ్యవస్థ భారత సరిహద్దులతో పాటు, హిందూ మహాసముద్ర ప్రాంతంపై కూడా నిఘా ఉంచడానికి లక్ష్యంగా పెట్టుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మొత్తంగా చైనా అంతరిక్షాన్ని మరింతగా ఉపయోగించుకుంటూ సైనిక వ్యవస్థను మరింత బలంగా మార్చుకునే పనులను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే భారత్ SBS-3తో సమర్థవంతమైన, తన స్వతంత్ర అంతరిక్ష రక్షణ వ్యవస్థను నిర్మించుకుంటోంది. భూమిపై కాకుండా, భవిష్యత్తులో యుద్ధాలు ఆకాశంలో జరగనున్న నేపథ్యంలో ఇది ఒక వ్యూహాత్మక చర్యగా భావించవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
చైనా
సాయుధ దళాలు
రక్షణ (Rakshana)
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved