- Home
- Business
- Car battery care tips: వర్షాకాలంలో కారు బ్యాటరీ పాడవకుండా ఉండాలంటే బెస్ట్ టిప్స్ ఇవే.. లాంగ్ టూర్‌కి వెళ్లే ముందు ఇవి తప్పకుండా పాటించండి
Car battery care tips: వర్షాకాలంలో కారు బ్యాటరీ పాడవకుండా ఉండాలంటే బెస్ట్ టిప్స్ ఇవే.. లాంగ్ టూర్‌కి వెళ్లే ముందు ఇవి తప్పకుండా పాటించండి
వర్షాకాలంలో చాలా మంది కారు ఓనర్లు ఎదుర్కొనే సమస్య ఏంటంటే.. బ్యాటరీ డౌన్ అయిపోవడం.. ఇది ఎప్పుడైనా జరుగుతుంది. అందుకే ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ముందుగానే సిద్ధంగా ఉండటం ముఖ్యం. మీరు జర్నీలో ఉండగా ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

బ్యాటరీ సమస్య రాకుండా ఉండాలంటే..
వర్షాకాలంలో వాహన యజమానులు తరచుగా ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో కార్ బ్యాటరీ సమస్య ఒకటి. వాతావరణం తడిగా ఉండటంతో బ్యాటరీ పనితీరు దెబ్బతిని, స్టార్టింగ్ సమస్యలు రావడం సహజం. చాలా మంది కారు బయటకు తీయకుండా రోజుల తరబడి అలా వదిలేయడం వల్ల బ్యాటరీ సమస్య వస్తుందని భావిస్తారు. ఇందులో వాస్తవం ఉన్నప్పటికీ వర్షాకాలంలో వచ్చే బ్యాటరీ ప్రాబ్లమ్స్ కి అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. బ్యాటరీని సురక్షితంగా ఉంచేందుకు నిపుణులు సూచించిన కొన్ని కీలకమైన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. బ్యాటరీ కనెక్షన్లు సరిచూసుకోవాలి
వర్షాల్లో తేమ ఎక్కువగా ఉండటం వల్ల టెర్మినల్స్‌కు తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. ప్రతి రెండు రోజులకోసారి కనెక్షన్లను పరిశీలించి, తుప్పును క్లీనింగ్ చేయడం అవసరం. సాధారణంగా బేకింగ్ సోడా, నీటి మిశ్రమంతో తుడిచి, తర్వాత డ్రైగా తుడిచేయడం మంచిది.
2. ఇన్సులేషన్ కవర్ వాడండి
బ్యాటరీ మీద నీరు పడకుండా ఉండేందుకు స్పెషల్ ఇన్సులేటివ్ కవర్స్ ఉపయోగించడం మంచిది. ఇవి నీటి ప్రవేశాన్ని నిరోధించడమే కాకుండా ఉష్ణోగ్రతల్లో మార్పులను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
3. వాహనం నిలిపే ప్రదేశం ముఖ్యం
వర్షాకాలంలో వాహనం ఎక్కడపడితే అక్కడ పార్క్ చేయకూడదు. నీరు చేరే ప్రదేశాల్లో లేదా ఓపెన్ పబ్లిక్ పార్కింగ్‌లలో వాహనం ఉంచడం వల్ల బ్యాటరీ వాతావరణ ప్రభావానికి లోనవుతుంది. కవర్ చేసిన గ్యారేజీ లేదా షెడ్డుల్లో పార్క్ చేయడం మంచిది.
4. రెగ్యులర్‌గా స్టార్ట్ చేయాలి
వాహనాన్ని రోజుకోసారి స్టార్ట్ చేయడం మంచిది. దీనివల్ల బ్యాటరీ ఛార్జింగ్ కొనసాగుతుంది. ఎప్పుడైనా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఒక్కసారిగా డిశ్చార్జ్ కాకుండా ఉంటుంది. దీని వల్ల డెడ్ బ్యాటరీ సమస్య వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
5. బ్యాటరీ కండీషన్ చెక్ చేయించుకోవాలి
వర్షాకాలం ప్రారంభానికి ముందు లేదా మధ్యలో బ్యాటరీ టెస్టింగ్ చేయించడం మంచిది. వోల్టేజ్ లెవెల్స్, ఛార్జింగ్ సామర్థ్యం, కనెక్షన్ల స్థితిని సర్టిఫైడ్ మెకానిక్ ద్వారా టెస్ట్ చేయించాలి. దీని వల్ల లాంగ్ టూర్ వెళ్లినప్పుడు మధ్యలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
6. ఇతర మెకానికల్ పార్టులను చెక్ చేసుకోవాలి
వర్షాకాలంలో బ్యాటరీకి సంబంధించిన ఇతర భాగాలైన ఆల్టర్నేటర్, ఫ్యూజ్ బాక్స్ లాంటి భాగాల పనితీరు కూడా ముఖ్యమే. వీటిలో ఏవైనా సమస్యలు ఉంటే బ్యాటరీపై ఒత్తిడి పడుతుంది. అందువల్ల వర్షాకాలం ప్రారంభంలోనే వెహికల్ మొత్తం ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది. లేకపోతే పార్ట్స్ పాడైపోయే అవకాశం ఉంటుంది.
7. తడిచిన బ్యాటరీని వెంటనే శుభ్రం చేయాలి
వర్షంలో డైరెక్ట్ గా నీరు బ్యాటరీ మీద పడితే వెంటనే ఆ భాగాన్ని తుడిచి, పూర్తిగా ఆరిపోయేలా చూసుకోవాలి. తడిగా ఉన్నప్పుడు కారు స్టార్ట్ చేయడం ప్రమాదకరం. లేకపోతే కారు బ్యాటరీ నుంచి మంటలు వచ్చి ఇంజిన్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.