MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • PM Modi: పీఎం మోడీ ప్రత్యేక బహుమతులు.. ఘనా నేతలకు భారతీయ కళాఖండాలు

PM Modi: పీఎం మోడీ ప్రత్యేక బహుమతులు.. ఘనా నేతలకు భారతీయ కళాఖండాలు

PM Narendra Modi Ghana Visit: ప్రధాని నరేంద్ర మోడీ ఘనా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు, వారి భార్య, ఉపాధ్యక్షుడు, స్పీకర్‌కు భారతీయ కళాఖండాలు బహుమతిగా అందించారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 03 2025, 07:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఘనా పర్యటనలో  ప్రధాని మోడీ
Image Credit : Getty

ఘనా పర్యటనలో ప్రధాని మోడీ

PM Narendra Modi Ghana Visit: భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా మొదటగా ఘనా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఘనా అధ్యక్షుడు, ఆయన భార్య, ఉపాధ్యక్షుడు, స్పీకర్‌ లకు భారత సంప్రదాయ కళలకు ప్రతీకలైన విలక్షణమైన బహుమతులు అందజేశారు. ఈ బహుమతులు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని నిపుణుల చేత తయారైన ప్రత్యేక కళాఖండాలు కావడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఘనా అధ్యక్షుడికి గిఫ్ట్ గా బిద్రి కళాఖండంతో తయారైన ఫూల్ వాస్
Image Credit : Asianet News

ఘనా అధ్యక్షుడికి గిఫ్ట్ గా బిద్రి కళాఖండంతో తయారైన ఫూల్ వాస్

ప్రధాని మోడీ ఘనా అధ్యక్షుడు జాన్ మహామాకు బిద్రి కళాఖండంతో అలంకరించిన ఫూల్ వాస్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ కళాఖండం కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందినదిగా పేర్కొన్నారు. బిద్రి వర్క్ అనేది జింక్-కాపర్ మిశ్రమం పై వెండి తో ప్రత్యేక డిజైన్ చేయడంతో బిద్రి కళాఖండాలను తయారు చేస్తారు. దీని నల్లని మెరుగు, చక్కటి వెండి డిజైన్లు దీనిని ప్రత్యేకతగా ఉంచుతాయి.

ఈ వాసును శతాబ్దాలుగా వాడుతున్న పద్ధతుల ద్వారా చేతి పనితో తయారు చేశారు. బహుమతిగా ఇచ్చిన వాసుపై సంపదను సూచించే పుష్ప ఆకృతులు చెక్కారు. ఇది భారతీయ లోహ కళల సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది.

35
ఘనా అధ్యక్షుడి భార్యకు గిఫ్ట్ గా కటక్ కు చెందిన వెండి ఫిలిగ్రీ పర్సు
Image Credit : Asianet News

ఘనా అధ్యక్షుడి భార్యకు గిఫ్ట్ గా కటక్ కు చెందిన వెండి ఫిలిగ్రీ పర్సు

ఘనా అధ్యక్షుడి భార్య లార్డిన మహామకు ప్రధాని మోడీ ఒక అద్భుతమైన వెండి ఫిలిగ్రీ పనితో తయారైన హస్తకళారూపమైన పర్సు అందించారు. ఇది ఒడిశా రాష్ట్రంలోని కటక్ నగరానికి చెందిన ప్రముఖ ‘తారకాషీ’ కళారూపం. ఈ కళా రూపం 500 సంవత్సరాల పైగా చరిత్ర కలిగి ఉంది. దీనిలో సూక్ష్మమైన వెండి తీగలతో పుష్పాలు, వక్కలు వంటి డిజైన్‌లు వేయడం ఉంటుంది.

ఈ పర్సును నైపుణ్యం గల కళాకారులు పూర్తిగా చేతితో తయారు చేశారు. సంప్రదాయంగా ఆభరణాల తయారీలో ఉపయోగించే కటక్ ఫిలిగ్రీకి ఇప్పటి ఆధునిక వస్తువులైన అందమైన పర్సులు కూడా పోటీనివ్వలేవని చెప్పొచ్చు. ఇది భారతీయ సంప్రదాయాన్ని ఆధునికతతో మిళితం చేసిన ఒక అద్భుతమైన కళకు ఉదాహరణ.

45
ఘనా ఉపాధ్యక్షుడికి గిఫ్ట్ గా కాశ్మీరీ పశ్మీనా షాల్
Image Credit : Asianet News

ఘనా ఉపాధ్యక్షుడికి గిఫ్ట్ గా కాశ్మీరీ పశ్మీనా షాల్

ఘనా ఉపాధ్యక్షులు జేన్ నానా ఒపోకు-అగ్యేమాంగ్ కు ప్రధాని మోడీ కాశ్మీరీ పశ్మీనా షాల్‌ను బహుమతిగా అందించారు. ఈ షాల్ లద్దాఖ్ ప్రాంతంలోని చాంగ్‌థాంగ్ లో నివసించే చంగ్థంగి జాతికి చెందిన మేకల నుండి వచ్చే మృదువైన అండర్‌కోట్‌తో తయారు చేశారు.

ఈ షాల్‌లు అసాధారణమైన మృదుత్వం, వేడిని నిలుపుకోవడం, తేలికపాటుతనం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందాయి. ఇవి కాశ్మీరి కళాకారులు తయారు చేశారు. ఈ షాల్‌లు ప్రామాణికమైన గొప్ప భారతీయ చేతి పనికి గుర్తింపుగా ఉన్నాయి.

55
ఘనా స్పీకర్‌కు గిఫ్ట్ గా పౌరాణిక లఘు అంబారీ
Image Credit : Asianet News

ఘనా స్పీకర్‌కు గిఫ్ట్ గా పౌరాణిక లఘు అంబారీ

ఘనా స్పీకర్‌కు ప్రధానమంత్రి మోడీ లఘు హస్తి అంబారీ బహుమతిగా ఇచ్చారు. దీనిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కళాకారులు తయారు చేశారు. ఈ అంబారీ చిన్న మోడల్ రూపంలో ఉండి, రాచరిక సంప్రదాయానికి గుర్తుగా నిలుస్తుంది.

ఇది పాలిష్ చేసిన సింథటిక్ దంతంతో తయారు చేశారు. ఇది సహజ దంతానికి నైతికంగా, పర్యావరణ పరంగా ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఈ కళాఖండం భారతీయ రాజకీయం, సంప్రదాయాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

ఈ బహుమతుల ద్వారా ప్రధాని మోడీ భారతీయ కళల వైశిష్ట్యాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి చూపించారు. ప్రతి బహుమతిలోను భారత సంప్రదాయ నైపుణ్యం, సాంకేతికత, సాంస్కృతిక విలువలు ప్రతిబింబించాయి. ఈ కానుకలు ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త మలుపు తేనున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
నరేంద్ర మోదీ
ఏషియానెట్ న్యూస్
రాజకీయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
PM Modi: ప్రపంచ శాంతి, అభివృద్ధికి గ్లోబల్ సౌత్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.. ఘనా పార్లమెంట్‌లో ప్రధాని మోడీ
Recommended image2
Ind vs Eng: ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్ట్ సెంచరీలు కొట్టిన భారత ప్లేయర్లు ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved