- Home
- Business
- Vi Max Family Plan: 19 ఓటీటీలు, కావాల్సినంత డేటాతో వోడాఫోన్ ఐడియా మాక్స్ ఫ్యామిలీ ప్లాన్: కుటుంబ సభ్యులంతా ఈ ప్లాన్ ఉపయోగించుకోవచ్చు
Vi Max Family Plan: 19 ఓటీటీలు, కావాల్సినంత డేటాతో వోడాఫోన్ ఐడియా మాక్స్ ఫ్యామిలీ ప్లాన్: కుటుంబ సభ్యులంతా ఈ ప్లాన్ ఉపయోగించుకోవచ్చు
వోడాఫోన్-ఐడియా సూపర్ ఫ్యామిలీ ప్లాన్ తీసుకొచ్చింది. ఇది కుటుంబ సభ్యులందరికీ కావాల్సినంత డేటాను అందిస్తుంది. అంతేకాకుండా నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ తో పాటు 19 ఓటీటీలను ఉచితంగా యాక్సిస్ చేయొచ్చు. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడున్నాయి.

ఫ్యామిలీకి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ అంతా ఒక్క ప్లాన్ లోనే..
వోడాఫోన్ ఐడియా (Vi) తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం కొత్త 'Vi Max ఫ్యామిలీ ప్లాన్' ను విడుదల చేసింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది. ఈ కొత్త ప్లాన్ Vi పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు అధిక విలువను అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ప్రాథమిక వినియోగదారునికి నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 18 OTT ప్లాట్‌ఫారమ్‌లు, SMS, డేటా ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ఒక్క ప్లాన్ తీసుకుంటే మీకు, మీ కుటుంబానికి కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది.
ఎలాంటి ఓటీటీ సేవలు లభిస్తాయంటే..
ఈ ఫ్యామిలీ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీంతో పాటు సన్ NXT, విఐ మూవీస్, టీవీ, డిస్నీ+ హాట్‌స్టార్, యాప్ స్టోర్ బెనిఫిట్స్ వంటి ఇతర డిజిటల్ కంటెంట్ సర్వీసులు కూడా లభిస్తాయి. ఇన్ని ఓటీటీలు ఉండటం వల్ల వివిధ రకాల వినోద కార్యక్రమాలను చూడవచ్చు. ఇందులో స్క్విడ్ గేమ్, వెడ్నెస్‌డే, స్ట్రేంజర్ థింగ్స్, లపాటా లేడీస్, పుష్ప 2, జవాన్, చావా, సికందర్ వంటి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మూవీస్ ని చూడొచ్చు. అంతేకాకుండా ది కపిల్ శర్మ షో, టెస్ట్, జ్యువెల్ థీఫ్, ది రాయల్స్, ఖాకీ: ది బెంగాల్ చాప్టర్, బ్లాక్ వారెంట్, హీరా మండి, రాణా నాయుడు వంటి అనేక వెబ్ సిరీస్ ను కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు.
Vi Max ఫ్యామిలీ ప్లాన్ ధర రూ. 871
కేవలం రూ.871 ధరకు V మ్యాక్స్ ఫ్యామిలీ ప్లాన్ పొందొచ్చు. ఇందులో ప్రైమరీ, సెకండరీ అనే రెండు కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి. ఈ ప్లాన్ కింద V- దేశీయ టెలికాం పరిశ్రమలో అత్యధిక డేటా కోటాను అందిస్తుంది. నెలవారీ 120 డేటా ను ఇద్దరు సభ్యులు పంచుకోవడానికి వీలుంది. ప్రాథమిక సభ్యునికి 70 GB, ద్వితీయ సభ్యునికి 40GB లభిస్తుంది. తర్వాత అదనంగా 10GB డేటాను ఇద్దరూ షేర్ చేసుకోవచ్చు.
దీంతోపాటు Vi అపరిమిత రాత్రి డేటా ను కూడా అందిస్తోంది. అంటే అర్ధరాత్రి 12 నుండి ఉదయం 6 వరకు అన్ లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చ. అంతేకాకుండా 400GB వరకు డేటా రోల్‌ఓవర్ చేసుకొనే అవకాశం ఉంది. అంటే ఒక్కో సభ్యుడు 200GB వరకు తర్వాత నెలకు డేటా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.
Vi Max Family Plan ఎలా పొందాలి?
వినియోగదారులు ఈ ఫ్యామిలీ ప్లాన్‌ను Vi అధికారిక వెబ్‌సైట్‌లోనూ, Vi యాప్ ద్వారా కూడా తీసుకోవచ్చు. దీనిలో తమ కుటుంబ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా ఎంపిక చేసుకునే అవకాశముంది. ఈ ప్లాన్ లో లభించే నెట్‌ఫ్లిక్స్ మొబైల్ యాక్సెస్ మాత్రమే అనుమతిస్తుంది. అన్ని నెట్‌వర్క్‌లకు ఉచితంగా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఫ్యామిలీ ప్లాన్ లో కొత్త సౌకర్యం ఏంటంటే.. మీరు ఉపయోగించని డేటాను తదుపరి నెలకు తరలించే డేటా రోల్ ఓవర్ అవకాశం కూడా ఉంది.
ముఖ్య నగరాల్లో అన్ లిమిటెడ్ 5G డేటా
ఈ ప్లాన్ ద్వారా Vi పోటీ టెలికాం సంస్థలైన Airtel, Jio లతో పోటీ పట్టు సాధించాలనుకుంటోంది. ప్రత్యేకించి నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రీమియం ఓటీటీ సేవలను ఉచితంగా అందించడం ద్వారా వినియోగదారుల దృష్టిని ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, పాట్నా, చండీగఢ్ బెంగళూరు వంటి నగరాల్లోని వినియోగదారులకు అపరిమిత 5G డేటాను Vi అందిస్తోంది. ఆగస్టు 2025 నాటికి దేశ వ్యాప్తంగా 17 ప్రాధాన్యతా సర్కిల్‌లలో 5Gని విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తోంది.