ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:34 PM (IST) Jul 22
లెవల్ 2 ADAS వంటి అధునాతన ఫీచర్లతో, 548 కి.మీ. రేంజ్ కలిగిన MG M9 EV భారతదేశంలో లాంచ్ అయ్యింది. 2025 ఆగస్టు 10 నుండి డెలివరీకి సిద్దమయ్యింది. ఈ లగ్జరీ MPVని కేవలం లక్ష రూపాయలకు బుక్ చేసుకోవచ్చు.
10:59 PM (IST) Jul 22
ఇంగ్లాండ్ ఉమెన్స్ టీంపై ఇప్పటికే టీ20 సీరిస్ లో ఆదిపత్యం ప్రదర్శించి విజేతగా నిలిచింది టీమిండియా. ఇప్పుడు వన్డే సీరిస్ పై కూడా కన్నేసింది… నిర్ణయాత్రక చివరి మ్యాచ్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సెంచరీతో అదరగొట్టారు.
10:01 PM (IST) Jul 22
విశాఖపట్నంలో అయోధ్య ఆలయమేంటి? అప్పుడే డౌట్ రావాలిగా ఏదో గడబిడ ఉందని. చివరికి ఇప్పుడు బైటపడింది భక్తి ముసుగులో జరుగుతున్న మోసం. ఇంతకూ ఈ మోసం ఎలా జరుగుతోందంటే..
08:33 PM (IST) Jul 22
మీరు ఎప్పుడైనా 800, 900,1000 నాణేలను చూశారా? అసలు ఇలాంటి నాణేలు ఉన్నాయా అనేగా మీ డౌట్. ఉన్నాయి… ఎక్కడ దొరుకుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
06:47 PM (IST) Jul 22
వాహనదారులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం హైవేలపై ఎక్కువగా తిరిగేవారి ప్రయాణ ఖర్చులను భారీగాా తగ్గించే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రూ.100 ఖర్చు అవుతుంటే కేంద్రం నిర్ణయంతో రూ.15 కు ఆ ఖర్చు తగ్గనుంది. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా?
04:37 PM (IST) Jul 22
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగింటి ఆడబిడ్డలకు జీవితాంతం ఆర్థికసాయం అందించనున్నట్లు హామీ ఇచ్చింది. ఇంకొక్క పథకం అమలయితే ఇక మహిళలకు బ్రతికున్నన్ని రోజులు డబ్బులే డబ్బులు. ఇంతకూ ఈ పథకం ఏంటో తెలుసా?
02:33 PM (IST) Jul 22
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ హఠాత్తుగా రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కాగా తొలిసారి రాజీనామాపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
01:53 PM (IST) Jul 22
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా మందు బాబులు మాత్రం ఆ అలవాటును మానుకోరు. పైగా కాస్లీ మద్యం తాగుతున్నాం మాకేంటి అన్న భావనలో ఉంటారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం తెలిస్తే దడుసుకోవాల్సిందే.
12:36 PM (IST) Jul 22
Personal Loan: ప్రతీ ఒక్కరి జీవితంలో ఎప్పుడోకప్పుడు అప్పు తీసుకోవాల్సి వస్తుంది. వ్యక్తిగత, కుటుంబం కోసం రుణాలు తీసుకుంటుంటారు. ఈ సమయంలో వెంటనే గుర్తుకువచ్చేది పర్సనల్ లోన్. ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండా సింపుల్‌గా పర్సనల్ లోన్ పొందండిలా.
12:31 PM (IST) Jul 22
బంగారం ధరలు తగ్గుతున్నాయని అంతా సంతోషించారు. కానీ అంతలోనే మరోసారి షాక్ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత మరోసారి లక్ష మార్క్ దాటి బంగారం ప్రియులను హడలెత్చింది. తాజాగా మంగళవారం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి.
11:50 AM (IST) Jul 22
సమయం అన్నిచోట్లా ఒకేలా వుండదు. భూమిపై ఒకలా, ఇతర గ్రహాలపై మరోలా ఉంటుంది... అందుకే స్పెస్ టైమ్ కాన్సెప్ట్ వచ్చింది. ఇక కొన్నిచోట్ల సమయం ఆగిపోతుందట... అంటే భూమిపై ఓ సంవత్సరం అక్కడ కోటానుకోట్ల సంవత్సరాలు. అక్కడికి వెళ్లగలిగితే మనిషి అమరజీవే..!
11:37 AM (IST) Jul 22
మారుతోన్న టెక్నాలజీతో పాటు నేరాలు కూడా పెరుగుతున్నాయి. రకరకాల మార్గాల్లో సైబర్ నేరస్థులు కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ భారీ దోపిడి వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
10:26 AM (IST) Jul 22
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ కలకలం రేపుతోంది. గత హయాంలో మద్యం విధానంలో అవకతకలు జరిగాయంటూ కూటమి ప్రభుత్వం విచారణ మొదలు పెట్టింది ఇందులో భాగంగానే వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
09:42 AM (IST) Jul 22
ఇటీవల తెలంగాణలో వరుస సెలవులు వస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వం ప్రకటించిన సెలవులతో పాటు వర్షాల కారణంగా గత వారం స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. కాగా బుధవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి.
08:11 AM (IST) Jul 22
తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రవాసాంధ్రుల కోసం టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.
07:04 AM (IST) Jul 22
మొన్నటి వరకు ముఖం చాటేసిన వరణుడు ఇప్పుడు దంచికొడుతున్నాడు. అటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా వచ్చే 5 రోజులు వర్షాలు ఇలాగే కొనసాగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.