ఇండియాలో 800, 900 రూపాయల నాణేలున్నాయా? ఇవి ఎక్కడ దొరుకుతాయో తెలుసా?
మీరు ఎప్పుడైనా 800, 900,1000 నాణేలను చూశారా? అసలు ఇలాంటి నాణేలు ఉన్నాయా అనేగా మీ డౌట్. ఉన్నాయి… ఎక్కడ దొరుకుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

ఈ అరుదైన నాణేలను చూశారా?
Commemorative Coins : మీరు రూపాయి, రెండు రూపాయలు, ఐదు, పది రూపాయి నాణేలను చూసివుంటారు... మరీ అయితే 5, 10, 25, 50 పైసలు నాణేలను కూడా చూసివుంటారు. కానీ 800, 900, 1000 రూపాయల నాణేలను చూసారా? అయితే ఇక్కడ చూద్దాం. అంతేకాదు ఈ నాణేల ఎందుకు తయారుచేశారు? వాడుకలో ఎందుకు లేవో తెలుసుకుందాం.
800, 900, 1000 రూపాయల నాణేలు నిజంగానే ఉన్నాయా?
ఆశ్చర్యంగా ఉన్నా రూ.800, రూ.900, రూ.1000 నాణేలు ఉన్నాయి. కానీ ఇవి సాధారణంగా చెలామణి చేయలేని నాణేలు. ఎవరైనా ప్రముఖులు, ఏదైనా ప్రత్యేక సందర్భానికి గుర్తుగా ఇలాంటి అరుదైన కాయిన్స్ ను ఆర్బిఐ తయారుచేస్తుంది. వీటిని కమోరేటివ్ కాయిన్స్ అని అంటారు.
సాధారణంగా కమోరేటివ్ కాయిన్స్ సాధారణంగా వాడుకలో ఉండే కాయిన్స్ మాదిరిగా కాకుండా ప్రత్యేకంగా ఉంటాయి.. కొన్నిసార్లు వెండి, బంగారంతో కూడా ఇలాంటి నాణేలను తయారుచేస్తారు. వీటిని ప్రత్యేకంగా నాణేలను సేకరించేవారు ఆన్ లైన్ లో కొంటుంటారు. ఇలా ప్రత్యేక సందర్భాల్లో జారీ చేసినవే 800,900,1000 రూపాయిల కాయిన్స్.
800, 900 రూపాయల నాణేలు :
జైన తీర్థంకరులు పార్శ్వనాథుని 2900వ జయంతి సందర్భంగా రూ.900 నాణేన్ని విడుదల చేశారు. అలాగే 2800వ నిర్వాణ వార్షికోత్సవం సందర్భంగా ఈ రూ.800 నాణేన్ని విడుదల చేశారు. ఇక రూ.800 గోల్డ్ ప్లేటెడ్ నాణేన్ని అయోధ్య రామమందిరానికి గుర్తుగా విడుదల చేశారు.
రూ.1000 నాణెం
భారతదేశంలోని చారిత్రాత్మక బృహదీశ్వర ఆలయం సహస్రాబ్ది ఉత్సవాలు 2010 సంవత్సరంలో జరిగాయి. ఇందుకు గుర్తుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ 1000 రూపాయల నాణేన్ని విడుదల చేశారు. ఇది చెలామణి కోసం కాకుండా సేకరణ కోసం తయారుచేసింది.
రూ.75, రూ.125 నాణేలు :
ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల 125 జయంతి సందర్భంగా రూ.125 నాణెం, రామకృష్ణ మిషన్ 125 సంవత్సరాల స్మారకంగా 75 రూపాయల నాణెం విడుదలచేశారు.
ఈ నాణేలను ఎక్కడ దొరుకుతాయో తెలుసా?
ప్రత్యేకంగా తయారుచేసిన ఈ కమోరేటివ్ కాయిన్స్ చెలామణిలో ఉండవు. కేవలం నాణేలను సేకరించేవారు భార ప్రభుత్వ మింట్ వెబ్ సైట్ ద్వారా వీటిని కొనుగోలు చేస్తుంటారు. మీరుకూడా ఇలాంటి ప్రత్యేకమైన నాణేలను సేకరించాలని భావిస్తుంటే https://www.indiagovtmint.in/en/ సందర్శించండి.