Gold Price: ఇలా అయితే ఎలా "బంగారం".. మళ్లీ లక్ష మార్క్ దాటేసిన గోల్డ్ ప్రైజ్
బంగారం ధరలు తగ్గుతున్నాయని అంతా సంతోషించారు. కానీ అంతలోనే మరోసారి షాక్ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత మరోసారి లక్ష మార్క్ దాటి బంగారం ప్రియులను హడలెత్చింది. తాజాగా మంగళవారం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి.

ఒక్కరోజే రూ. 1140 జంప్
మంగళవారం ఒక్క రోజే తులం బంగారం ధర రూ. 1140 పెరిగింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,290 వద్దకొనసాగుతోంది. కాగా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 92,850 వద్ద కొనసాగుతోంది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో తులం బంగారం ధర లక్ష రూపాయాలు దాటేసింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి.?
* దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 101440 వద్ద కొనసాగుతోంది. కాగా 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 93,000గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 101290కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,850 వద్ద కొనసాగుతోంది.
* చెన్నైలో మంగళవారం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 101290కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,850గా ఉంది.
* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 101290, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,850 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే.?
* హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 101290కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,850గా ఉంది.
* విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 101290కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,850 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 101290కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,850గా ఉంది.
బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి.?
ఈ ధరల పెరుగుదల వెనుక అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వం వాణిజ్య సరఫరాలపై విధించబోయే తాజా టారిఫ్‌లపై ఆగస్టు 1 నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందున, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులవైపు మొగ్గుచూపుతున్నారు. ఈ సందర్భంలో బంగారం ‘సేఫ్ హెవెన్’ గా నిలవడంతో డిమాండ్ పెరిగింది.
డాలర్ బలహీనత
అమెరికా డాలర్ విలువ ఇటీవల బలహీనపడుతోంది. డాలర్ విలువ పడిపోతే ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే బంగారం కొనుగోలు తక్కువ ఖర్చుతో సాధ్యమవుతుంది. దీంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ట్రెజరీ బాండ్లపై లాభం తగ్గడం
అమెరికా ట్రెజరీ బాండ్లపై లాభాల శాతం (Yield) గత కొన్ని రోజులుగా తగ్గుతుండటంతో పెట్టుబడిదారులు తక్కువ వడ్డీ రాబడి కలిగే ఆస్తుల నుంచి వెనక్కి తగ్గి, బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. ఇది కూడా బంగారానికి డిమాండ్ పెంచే ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పొచ్చు.
ఇలాంటి అస్థిర వాతావరణంలో పెట్టుబడిదారులు ఎక్కువగా బంగారం వైపు దృష్టి సారిస్తున్నారు. అమెరికా-చైనా మధ్య వాణిజ్య సమస్యలు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ మార్గాల్లో అప్రమత్తత అన్ని కలిసి బంగారం ధర పెరగడానికి కారణమవుతుందని అంటున్నారు.