- Home
- Automobile
- MG M9 EV : 548 కి.మీ మైలేజ్, మసాజర్ సీట్లు, సూపర్ లుక్.. లక్ష రూపాయలుంటే ఈ కారు మీ ఇంటిముందే
MG M9 EV : 548 కి.మీ మైలేజ్, మసాజర్ సీట్లు, సూపర్ లుక్.. లక్ష రూపాయలుంటే ఈ కారు మీ ఇంటిముందే
లెవల్ 2 ADAS వంటి అధునాతన ఫీచర్లతో, 548 కి.మీ. రేంజ్ కలిగిన MG M9 EV భారతదేశంలో లాంచ్ అయ్యింది. 2025 ఆగస్టు 10 నుండి డెలివరీకి సిద్దమయ్యింది. ఈ లగ్జరీ MPVని కేవలం లక్ష రూపాయలకు బుక్ చేసుకోవచ్చు.

MG M9 EV మైలేజ్, పనితీరు
MG M9 EV 90kWh బ్యాటరీ ఉంది… ఇది ఒకే ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. ఈ మోటార్ 241bhp శక్తిని, 350Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ MPV 548 కి.మీ (MIDC సైకిల్ ప్రకారం) ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. కియా కార్నివల్, టయోటా వెల్ఫైర్ వంటి లగ్జరీ MPVలతో ఈ కారు పోటీ పడుతుంది.
MG M9 EV లగ్జరీ ఫీచర్లు
లగ్జరీని కోరుకునే వినియోగదారులకు ఈ ఎంజీ ఎం9 ఎంతగానో ఆకట్టుకుంటుంది. లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం) వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్లు, 6-వే అడ్జస్టబుల్ సెకండ్ రో సీట్లు (హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్‌తో), బాస్ మోడ్, వెల్కమ్ సీట్ ఫంక్షన్ (డ్రైవర్, ప్రయాణీకులకు) వంటివి ఇందులో ఉన్నాయి.
MG M9 EV డ్రైవ్ మోడ్‌లు
EPB ఆటో హోల్డ్‌తో 7 ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్, 7 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉన్నాయి. 13 స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, ఇకో, నార్మల్, స్పోర్ట్ వంటి డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి.
MG M9 EV సూపర్ లగ్జరీ
ప్రీమియం, సూపర్ లగ్జరీ ఫీచర్లతో నిండిన ఈ ఎలక్ట్రిక్ కారు దూర ప్రయాణాలకు అనువైనది. ఇలాంటి MPV కోసం చూస్తున్నట్లయితే, MG M9 EV ఒక మంచి ఎంపిక.
MG M9 EV డెలివరీలు ఎప్పుడు?
ఈ లగ్జరీ MPV డెలివరీలు 2025 ఆగస్టు 10 నుండి ప్రారంభమవుతుంది MG సెలెక్ట్ అనే ప్రత్యేక డీలర్‌షిప్ ద్వారా ఇది అందుబాటులో ఉంటుంది. MG M9 EV కేవలం ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు, భారతదేశంలో లగ్జరీ ఎలక్ట్రిక్ మొబిలిటీకి కొత్త రూపం ఇవ్వడానికి వచ్చింది.
MG M9 EV బుకింగ్
ధర కొంచెం ఎక్కువే… కానీ అందులో ఉన్న సాంకేతికత, ఫీచర్లు ఈ సెగ్మెంట్‌లో ప్రీమియం ఎంపికగా మారుస్తాయి. MG M9ని కేవలం ఒక లక్ష రూపాయలకు బుక్ చేసుకోవచ్చు.