Personal Loan: నిమిషాల్లో పర్సనల్ లోన్.. డాక్యుమెంట్స్ లేకుండా, ఇంట్లో కూర్చొనే..
Personal Loan: ప్రతీ ఒక్కరి జీవితంలో ఎప్పుడోకప్పుడు అప్పు తీసుకోవాల్సి వస్తుంది. వ్యక్తిగత, కుటుంబం కోసం రుణాలు తీసుకుంటుంటారు. ఈ సమయంలో వెంటనే గుర్తుకువచ్చేది పర్సనల్ లోన్. ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండా సింపుల్‌గా పర్సనల్ లోన్ పొందండిలా.
నిమిషాల్లో పర్సనల్ లోన్
వ్యాపారవేత్తలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, అలాగే తక్కువ ఆదాయం గలవారు పలు సందర్భాల్లో తక్షణ ఆర్థిక అవసరాల కోసం పర్సనల్ లోన్లు కోరుతూ బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ సంస్థలను ఆశ్రయిస్తారు. కానీ, వీటికి సంబంధించిన డాక్యుమెంట్ల ప్రక్రియ క్లిష్టంగా ఉండటం, లోన్ మంజూరులో జాప్యం లేదా తిరస్కరణ సమస్యలుగా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ సమస్యకు పరిష్కారంగా డాక్యుమెంట్లను తగ్గించిన లేదా పూర్తిగా మినహాయించిన లోన్ స్కీములు అందుబాటులోకి వచ్చాయి. ఆ మార్గాలేంటీ?
డాక్యుమెంట్ల అవసరం లేదు
ప్రస్తుత డిజిటల్ యుగంలో పర్సనల్ లోన్ కోసం పేపర్‌వర్క్ చేయాల్సిన రోజులు పోయాయి. ఇప్పుడు అనేక ఫిన్‌టెక్ కంపెనీలు, ఆన్‌లైన్ లోన్ ప్లాట్‌ఫారాలు పలు సేవలు అందిస్తున్నాయి, ఇవి డాక్యుమెంట్లు లేకుండానే లేదా తక్కువ డాక్యుమెంట్లతో లోన్ అందిస్తున్నాయి. మీరు దగ్గరగా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉండే చాలు నిమిషాల్లోనే లోన్ పొందవచ్చు. CIBIL స్కోర్, బ్యాంక్ లావాదేవీలు, ఆదాయ ధృవీకరణ పత్రాలు లేకుండానే లోన్లు ఆమోదిస్తున్నారు. కొన్ని ప్లాట్‌ఫారాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా యూజర్ క్రెడిట్ ప్రొఫైల్‌ను అంచనా వేసి, తక్షణమే లోన్ అమౌంట్‌ను అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు.
పర్సనల్ లోన్‌ను వేగంగా ఇచ్చే యాప్‌లు ఇవే..
లెజీ పే (Lazy Pay), క్రెడిట్ బీ ( Kredit Bee), నిరా (Nira), మనీ టాప్ (Money Tap) వంటి ఫిన్‌టెక్ యాప్‌లు తక్కువ డాక్యుమెంట్లతోనే లేదా డాక్యుమెంట్లు లేకుండానే ₹10,000 నుంచి ₹ 2 లక్షల వరకు లోన్లు అందిస్తున్నాయి. ఈ యాప్‌లు మీ ఖర్చులు, మొబైల్ వాడకం, UPI లావాదేవీలు, క్రెడిట్ హిస్టరీ ఆధారంగా అర్హతను అంచనా వేసి తక్షణ లోన్‌ను మంజూరు చేస్తాయి. ఇది ముఖ్యంగా తక్షణ ఆర్థిక అవసరాల కోసం తక్కువ మొత్తంలో లోన్ కోరేవారికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
వడ్డీ రేట్లు అధికం
కొన్ని ప్రైవేట్ లోన్ సంస్థలు లేదా NBFCలు తక్కువ డాక్యుమెంట్లతో పర్సనల్ లోన్లు అందిస్తున్నాయి. గుర్తింపు కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ ఉంటే చాలు. అయితే వీటి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, లోన్ తీసుకునే ముందు షరతులు పూర్తిగా చదివి, జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి.
కానీ జాగ్రత్త తప్పనిసరి!
ఇప్పుడు డాక్యుమెంట్ల లేకుండానే లోన్ పొందడం సులభమే. కానీ, వడ్డీ రేట్లు, ఛార్జీలు గురించి ముందుగానే తెలుసుకోవాలి. సకాలంలో చెల్లింపుతో CIBIL స్కోర్ కాపాడుకోవడం, నమ్మదగిన సంస్థల నుంచే లోన్ తీసుకోవడం చాలా ముఖ్యం. డిజిటల్ టెక్నాలజీ సహాయంతో, మౌలిక డాక్యుమెంట్లతోనే పర్సనల్ లోన్ అందుబాటులోకి వచ్చింది. అయితే వివేకంతో నిర్ణయం తీసుకోవడం, బాధ్యతగా ఫైనాన్స్‌ను నిర్వహించడం తప్పనిసరి.