MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • భూమిపై ఓ సంవత్సరం అక్కడ కోటి కోట్ల సంవత్సరాలు... మనిషి అక్కడికి వెళ్లగతిగితే అమరజీవే..! మోక్షం అంటే ఇదేనా?

భూమిపై ఓ సంవత్సరం అక్కడ కోటి కోట్ల సంవత్సరాలు... మనిషి అక్కడికి వెళ్లగతిగితే అమరజీవే..! మోక్షం అంటే ఇదేనా?

సమయం అన్నిచోట్లా ఒకేలా వుండదు. భూమిపై ఒకలా, ఇతర గ్రహాలపై మరోలా ఉంటుంది... అందుకే స్పెస్ టైమ్ కాన్సెప్ట్ వచ్చింది. ఇక కొన్నిచోట్ల సమయం ఆగిపోతుందట... అంటే భూమిపై ఓ సంవత్సరం అక్కడ కోటానుకోట్ల సంవత్సరాలు. అక్కడికి వెళ్లగలిగితే మనిషి అమరజీవే..!

3 Min read
Amarnath Vasireddy
Published : Jul 22 2025, 11:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
టైమ్ ఫ్రీజ్ అయిపోవాలా?
Image Credit : Gemini AI

టైమ్ ఫ్రీజ్ అయిపోవాలా?

కాలమిలా... ఆగి పోవాలా ?

కల నిజమై పోవాలా ?

వందేళ్లు !

అదేంటో .. పుట్టినప్పుడే మనిషికి కౌంట్ డౌన్ మొదలై పోతుంది !

వయసు ..

ముందుగా... పెరుగుతుంది .

అటుపై ... మీద పడుతుంది .

కాలం ఆగిపోవడం .. అదేనండి టైం ఫ్రీజ్ అయిపోవడం.. సాధ్యమా ?

సమయం సంకోచం / వ్యాకోచం చెందుతుంది .. అంటే మీరు నమ్ముతారా ?

సైన్స్ లోతుల్లోకి వెళ్లి పాఠాలు చెబితే చాలా మందికి అర్థం కాకపోవచ్చు .

అందుకే అందరికీ అర్థం అయ్యేలా సరళతరం చేసి చెబుతాను .

27
భూమిపై 50 ఏళ్లు... నెప్ట్యూన్ పై ఆరు నెలలే
Image Credit : NASA

భూమిపై 50 ఏళ్లు... నెప్ట్యూన్ పై ఆరు నెలలే

ఒక వ్యక్తికి 50 ఏళ్ళు .

సమయ వ్యాకోచ పరంగా చూస్తే ఆ వ్యక్తి వయస్సు..

కుజుడుపై .. 26.5 ఏళ్ళు

వరుణుడిపై - కేవలం ఆరు నెలలు

బృహస్పతి పై 4 .2 ఏళ్ళు

శనిగ్రహం పై - 1 .7 ఏళ్ళు .

వినడానికి చిత్రంగా ఉంది కదా !

అవునండీ .. సమయం అనేది విశ్వములో అన్ని చోట్లా ఒకే విధంగా ఉండదు .

అందుకే SPACETIME అనే కాన్సెప్ట్ వచ్చింది.

Related Articles

Related image1
Space: విశ్వం నుండి వింత సంకేతాలు! భూమిని కాంటాక్ట్ అవ్వాలని చూస్తున్నదెవరు? ఆశ్చర్యంలో శాస్త్రవేత్తలు
Related image2
Space: ఇక‌పై వీకెండ్‌కి వేరే గ్ర‌హం వెళ్లి రావొచ్చు.. సినిమా కాదు నిజంగా నిజం..
37
ఏమిటీ బ్లాక్ హోల్?
Image Credit : NASA

ఏమిటీ బ్లాక్ హోల్?

విశ్వములో కృష్ణ బిలాలు ఉంటాయి.

వాటి సాంద్రత అనంతం .

వాటి గురుత్వాకర్షణ శక్తి కూడా అనంతం .

కృష్ణ బిలాల గుండె భాగాన్ని ఏకత్వం అంటారు.

అక్కడ గురుత్వాకర్షణ ఎంతగా ఉంటుందంటే ఏ వస్తువయినా అక్కడికి వెళితే తిరిగి రాలేదు.

చివరికి కాంతి కూడా అక్కడి నుంచి బయటకు రాలేదు .

ఇక్కడ భౌతిక శాస్త్ర సూత్రాలు వర్తించవు .

దూరం , కాలం అనేవి ఇక్కడ వర్తించవు .

47
బ్లాక్ హోల్ లో కాలం ఆగిపోతుందా?
Image Credit : NASA

బ్లాక్ హోల్ లో కాలం ఆగిపోతుందా?

ఉదాహరణకు పైన చెప్పిన ఉదాహరణలో వ్యక్తికి యాభై ఏళ్ళు ..

ఎక్కడ ?

భూమి పైన కదా ?

అదే కృష్ణ బిలం గుండెలో అయితే ?

కృష్ణ బిలంలో ఎంత సమయం గడిస్తే భూమిపై యాభై ఏళ్ళు ?

లక్ష సంవత్సరాలా?

కాదు అంత కన్నా ఎక్కువ .

పోనీ కోటి సంవత్సరాలా?

కాదు అంత కన్నా ఎక్కువ !

మరి ఎన్ని సంవత్సారాలు?

ఆహే.. మనిషి బుద్ధి పోనిచ్చుకొన్నావు కాదు .

ఒకటి రెండు అనే లెక్కలు అక్కడ వర్తించవు .

కోటి.. పదికోట్లు .. కోటి కోట్లు .. ఆలా లెక్కలు వెయ్యొద్దు .

కాలం అక్కడ ఆగిపోయింది.

అక్కడ కోటి కోట్ల సంవత్సరాలు అయినా భూమి పై యాభై సంవత్సరాలకంటే బాగా తక్కువ

57
మనిషి బ్లాక్ హోల్ లోకి వెళ్లగలడా?
Image Credit : NASA

మనిషి బ్లాక్ హోల్ లోకి వెళ్లగలడా?

అక్కడికి వెళ్ళిపోతే కాలం ఆగిపోయినట్టే ..

మనిషి అమర జీవి అయిపోయినట్టే .

ఎగిరి పొతే ఎంత బాగుంటుంది !!

అమ్మా! .. ఆశ... దోస .. అప్పడం .. మసాలా వడ !

మనిషి అక్కడికి వెళ్ళ లేడు.

ఎందుకు ?

భూమికి అతి దగ్గర లో ఉన్న కృష్ణ బిలం 1560 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది .

పదార్థం కాంతి కంటే వేగంగా పయనించలేదు .

పోనీ కాంతి వేగం తో పయయించినా అక్కడికి చేరుకోవడానికి 1560 సంవత్సరాలు పడుతుంది .

మనిషి జీవిత కాలం వందేళ్లు .

కాబట్టి.. మనిషి అక్కడికి వెళ్లడం సాధ్యం కాదు .

67
ఇక్కడికి వెళ్లడమే అన్నిమతాలు చెప్పే మోక్షమా?
Image Credit : Gemini

ఇక్కడికి వెళ్లడమే అన్నిమతాలు చెప్పే మోక్షమా?

మనకు తెలిసిన సైన్స్ సూత్రాలు కృష్ణ బిలాలకు ముఖ్యంగా వాటి గుండె అనబడే ఏకత్వానికి వర్తించవు అనుకొన్నాము కదా .

కాబట్టి కాసేపు .. సైన్స్ ను పక్కన బెట్టి మతంలోకి పోదాము.

"ఆత్మ నాశనం లేనిది .

నిప్పు కాల్చలేదు .

నీరు తడపలేదు .

అది శాశ్వతం .

పుట్టినవాడు మరణించక తప్పదు .

మరణించినవాడు పుట్టక తప్పదు .

మోక్షం .. అంటే ఆత్మ పరమాత్మ లో ఏకం కావడం .

ఆలా ఏకమయితే అప్పుడు అది అంతం లేని లోకంలోకి పయనం .

సమయం దూరం అనేది అక్కడ వర్తించదు "

ఇది కదా మనం విన్నది .

కాస్త అటు ఇటుగా ఇస్లాం , క్రైస్తవం లో కూడా ఇదే భావన .. స్వర్గం నరకం .. భగవంతునితో ఏకం కావడం .. ఉంది.

కృష్ణ బిలం గుండె ఏకత్వం అంటే... మతాల్లో పేర్కొన్న మోక్ష సాధన అనుకోవచ్చా ?

జన్మ పునర్జన్మ అనే వాటినుంచి విముక్తి పొందిన ఆత్మ కృష్ణ బిలం లోకి పోవడమా?

సైన్స్ ప్రకారం మతాల్లో చెప్పినవి కేవలం ఊహాజనితమయిన అంశాలు .

వాటిని నిరూపించలేము .

కాబట్టి సైంటిఫిక్ అంశం అయిన కృష్ణ బిలాల ఏకత్వాన్ని... మోక్షం స్వర్గం అనే వాటితో పోల్చలేము ,

అది సరే .. "ఇప్పుడున్న సైన్స్ సూత్రాలతో కృష్ణ బిలాల ను అర్థం చేసుకోలేము .. అక్కడ spacetime లాంటి సూత్రాలు వర్తించవు" అన్నారు కదా ?

అవును .

మరెలా?

వాటిని అర్థం చేసుకోవడానికి కొత్త సైన్స్ సూత్రాలు తేవాలి .

77
తెలిసింది గోరంత... తెలియాల్సింది కొండంత
Image Credit : Gemini

తెలిసింది గోరంత... తెలియాల్సింది కొండంత

 "ఏంటో ప్రపంచం . అర్థమయినట్టే ఉంటుంది . తెలుసుకొనే కొద్దీ తికమక ఎక్కువవుతుంది అనుకొంటున్నారా ?"

తెలిసింది గోరంత !

తెలియాల్సింది కొండంత !

కొండ అంటే ఎంత వుంటుంది ?

భూమి పై ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్ .

దాని ఎత్తు- 8848 మీటర్లు .

అదే కుజుడి పై 25 వేల మీటర్లు .

వరుణుడి పై 4 వేల మీటర్లు .

బృహస్పతిపై 10 వేల మీటర్లు .

శని పై 8 వేల మీటర్లు .

మరి ఎవరెస్ట్ కృష్ణ బిలం గుండె అదే ఏకత్వం లో ఉంటే ?

అబ్బా .. ఎన్ని సార్లు చెప్పాలి ?

అక్కడ లెక్కలు .. తొక్కలు వర్తించవు .

అక్కడ ఒక సెంటీమీటర్ ఎత్తు కాదు .. అంత కన్నా బాగా తక్కువ . ఎంత తక్కువ అనేది నేటి సైన్స్ సూత్రాల ప్రకారం చెప్పలేము .

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved