తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:51 PM (IST) Jul 21
India vs England: భారత్ తో నాలుగో టెస్టు కోసం ఇంగ్లాండ్ జట్టును ప్రకటించింది. షోయబ్ బషీర్ స్థానంలో లియామ్ డాసన్ జట్టులోకి వచ్చారు. ఇక భారత జట్టు తరఫున అన్షుల్ కాంబోజ్ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది.
11:09 PM (IST) Jul 21
IND vs ENG: భారత్ vs ఇంగ్లాండ్ నాలుగో టెస్టుకు ముందు మహమ్మద్ సిరాజ్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. మాంచెస్టర్ లో జరిగే టెస్టులో గెలిచి భారత్ సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది.
10:47 PM (IST) Jul 21
Jagdeep Dhankhar: రైతు కుటుంబంలో జన్మించి న్యాయవాద వృత్తి, ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ.. అటునుంచి ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. తాజాగా ఆయన ఆరోగ్య సమస్యలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు.
09:48 PM (IST) Jul 21
Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆరోగ్య సమస్యలతో రాజీనామా చేశారు. రాష్ట్రపతికు లిఖితంగా రాజీనామా సమర్పించారు.
09:40 PM (IST) Jul 21
టాటా టియాగో EV సమర్థవంతమైన బ్యాటరీ, అందమైన డిజైన్‌తో పెట్రోల్ కార్లకు స్మార్ట్ ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఇది భారీ ఆఫర్లతో లభిస్తోంది… అవేంంటో ఇక్కడ చూద్దాం.
09:12 PM (IST) Jul 21
Top 5 Wicket Takers In T20I: బ్యాటర్ల ఆధిపత్యం కనిపించే టీ20 క్రికెట్ లో పలువురు బౌలర్లు సైతం అద్భుతంగా రాణిస్తున్నారు. టీ20 (T20I) లో అత్యధిక వికెట్లు పడగొట్టిన టాప్ 5 బౌలర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
08:53 PM (IST) Jul 21
మీ ఇంటిని అమ్మాలనుకుంటున్నారా? అయితే ఈ చిన్న చిన్న చాట్కాలు పాటించడం ద్వారా మంచి ధరను పొందవచ్చు... తద్వారా మంచి లాభాలను సాధించవచ్చు. ఆ టిప్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
07:52 PM (IST) Jul 21
IND vs ENG: భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య నాల్గో టెస్టు మ్యాచ్ మాంచెస్టర్ లో జరగనుంది. టీమిండియాకు కీలకమైన ఈ మ్యాచ్ కు యంగ్ ప్లేయర్లు నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్ లు దూరం అయ్యారు.
07:07 PM (IST) Jul 21
రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. రూ.601కే ఏడాది పాటు అన్‌లిమిటెడ్ 5G డేటాతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. రీఛార్జ్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
06:27 PM (IST) Jul 21
మరో పదిరోజుల్లో జులై నెల ముగియనుంది… ఆ తర్వాత ఆగస్ట్ లోకి అడుగుపెడతాం. ఇలా వచ్చే నెలలో తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు వరుస సెలవులు వస్తున్నాయి… ఈసెలవుల లిస్ట్ చూసి విద్యార్థులు ఎగిరిగంతేయడం ఖాయం.
05:53 PM (IST) Jul 21
Free Bus Travel: ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో ఎక్కడికైనా ‘జీరో ఫేర్ టికెట్’తో ప్రయాణించవచ్చిన పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు.
05:14 PM (IST) Jul 21
Koneru Humpy: తెలుగు తేజం, గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీ ఫిడే మహిళల వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి ప్రవేశించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. చైనా ఆటగాళ్లపై అద్భుత విజయాలు సాధించారు.
04:50 PM (IST) Jul 21
డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దానిని సరిగ్గా మ్యానేజ్ చేయడం కూడా అంతే ముఖ్యమని తెలిసిందే. ఎలాంటి రిస్క్ లేకుండా వడ్డీ లభించే ఎన్నో పథకాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
04:35 PM (IST) Jul 21
కమ్యూనిస్ట్ పార్టీ దిగ్గజ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ సోమవారం మధ్యాహ్నం త్రివేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. 101 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు.
03:21 PM (IST) Jul 21
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే వ్యాపారాలు చేయాలని ప్రతీ ఒక్కరూ ఆశపడుతుంటారు. అయితే ఇందుకోసం సరైన ప్లానింగ్ ఉండాలి. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా నిమ్మగడ్డి సాగు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు..
03:07 PM (IST) Jul 21
దేశంలోని వివిధ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. హ్యాపీగా తెలుగులోనే పరీక్షరాసి మంచి సాలరీతో తెలుగు రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు పొందవచ్చు. ఖాళీలెన్నో తెలుసా?
02:16 PM (IST) Jul 21
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. దీంతో దాదాపు అన్ని టాప్ ఆటో మొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఒక బెస్ట్ ఎలక్ట్రిక్ కారు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
12:52 PM (IST) Jul 21
ఏఐ ప్రపంచాన్ని మార్చేస్తోంది. అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. పనిని సులభతరం చేస్తోంది. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే మరోవైపు చాలా ప్రమాదం పొంచి ఉంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలే దీనికి సాక్ష్యం.
12:45 PM (IST) Jul 21
చాలామంది రైలు ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా ఫీల్ అవుతుంటారు. కానీ కొన్ని రైళ్లలో ప్రయాణం మాత్రం నరకంగా ఉంటుంది. అలాంటి చెత్త రైళ్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
11:48 AM (IST) Jul 21
జీవితంలో కోటి రూపాయలు సంపాదించాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే ఆదాయం ఉన్నా సరైన ఆర్థిక ప్రణాళికలు లేని కారణంగా అది సాధ్యం కాకపోతుండొచ్చు. మరి 15 ఏళ్లలో కోటి ఎలా సంపాదించాలన్న ప్రశ్నకు చాట్‌జీపీటీ ఎలాంటి సమాధానం ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం.
10:47 AM (IST) Jul 21
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంట్రీతో సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ కంపనీలు ఉన్నతస్థాయి ఉద్యోగులను కూడా సాగనంపుతున్నాయి… లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో ఇంజనీరింగ్ విద్యార్థులు, సాప్ట్వేర్ ఉద్యోగులు జాగ్రత్తపడాలి.
10:36 AM (IST) Jul 21
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడేం చేస్తారో ఎవరూ ఊహించరు. ఒకసారి ఎంతో సీరియస్‌గా మట్లాడుతారు. అప్పుడే ఫన్నీగా స్పందిస్తుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ట్రంప్ తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో వివాదాస్పదంగా మారింది.
09:53 AM (IST) Jul 21
శని,ఆదివారాలు సెలవు దినాలు అనేది ఐటీ రంగం వచ్చాక సర్వసాధారణంగా మారిపోయింది. అయితే స్వాతంత్రానికి ముందు నుంచే రెండో శనివారం సెలవుగా అమలవుతోంది. అయితే ఈ సంప్రదాయం ఎలా వచ్చింది.? దీని వెనకాల ఉన్న అసలు చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
08:58 AM (IST) Jul 21
ఇవాళ (సోమవారం) తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయో తెలుసా?