School Holidays : ఇదీ ఆగస్ట్ సెలవుల లిస్ట్ ... చూశాక విద్యార్థులు ఎగిరిగంతేయడం మస్ట్
మరో పదిరోజుల్లో జులై నెల ముగియనుంది… ఆ తర్వాత ఆగస్ట్ లోకి అడుగుపెడతాం. ఇలా వచ్చే నెలలో తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు వరుస సెలవులు వస్తున్నాయి… ఈ సెలవుల లిస్ట్ చూసి విద్యార్థులు ఎగిరిగంతేయడం ఖాయం.

తెలుగు విద్యార్థులకు సెలవులే సెలవులు
Holidays : వేసవి సెలవులు పూర్తయి నెల రోజులకు పైనే అవుతోంది... కానీ చాలామంది విద్యార్థులు ఆ హాలిడేస్ ను మర్చిపోలేకపోతున్నారు. దాదాపు రెండునెలల పాటు సెలవును ఎంజాయ్ చేసి ఇప్పుడు విరామం లేకుండా స్కూల్ కి వెళ్లాల్సి వస్తుండటం విద్యార్థులను కాస్త బాధిస్తూ ఉండవచ్చు. మధ్యమధ్యలో ఏవైనా సెలవులు వస్తే వారికి కాస్తయినా ఊరట లభించేది... కానీ జూన్ లో స్కూల్లు మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు అధికారికంగా ఒకేఒక్క సెలవు (బోనాలు సందర్భంగా జులై 21, సోమవారం) మాత్రమే వచ్చింది.
అయితే విద్యార్థుల సెలవుల దాహాన్ని వచ్చే ఆగస్ట్ తీర్చేలా కనిపిస్తోంది. ఈ నెలలో వరుస సెలవులు వస్తున్నాయి. పండగలు, ప్రత్యేక రోజులు, సండేలు మొత్తం కలుపుకుని పదిపదకొండు రోజుల సెలవులు వస్తున్నాయి. ఇలా విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఆగస్ట్ లో వరుస సెలవులు వస్తున్నాయి. ఆగస్ట్ నెలలో ఏరోజు ఎందుకు సెలవు ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
వరలక్ష్మి వ్రతం
ఆగస్ట్ 8న వరలక్ష్మి వ్రతం ఉంది. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ముందురోజు తెలుగు ఆడపడుచులు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. మరికొద్దిరోజుల్లో శ్రావణమాసం ప్రారంభం అవుతుంది... ఆగస్ట్ 9న పౌర్ణమి వస్తోంది... కాబట్టి ఆగస్ట్ 8 (శుక్రవారం) వరలక్ష్మి వ్రతాలు జరగనున్నాయి.
వివాహమైన మహిళలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని నిష్టతో జరిపి అమ్మవారిని ఆరాధిస్తారు. ఇలా హిందువులు భక్తిశ్రద్దలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. కాబట్టి ఈరోజు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆప్షనల్ హాలిడే ప్రకటించాయి.
ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు వరలక్ష్మి వ్రతం రోజు వేతనంతో కూడిన సెలవు తీసుకోవచ్చు. అలాగే హిందూ ధార్మిక సంస్థలు, ట్రస్టుల ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు కూడా ఈరోజులు సెలవు ఉండే అవకాశాలున్నాయి. కొన్ని విద్యాసంస్థల్లో ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొత్తంగా వరలక్ష్మి వ్రతం రోజు ఉద్యోగులకే కాదు కొందరు విద్యార్థులకు కూడా సెలవు రానుంది.
రాఖీ పౌర్ణమి/ రెండో శనివారం సెలవు
వరలక్ష్మి వ్రతం తర్వాతిరోజే రాఖీ పౌర్ణమి. సోదర సోదరీమణుల మధ్య అనుబంధం, ఆత్మీయతల పండగ రాఖీ... ఆరోజు తమ అన్నాతమ్ముళ్లకు ఆడపడుచులు రాఖీ కడతారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ఈ పండగరోజు కూడా ఆప్షనల్ హాలిడే ఇచ్చాయి.
అయితే ఆగస్ట్ 9 రాఖీ పండగే కాదు రెండో శనివారం కూడా. దీంతో పండక్కి ఇచ్చిన ఆప్షనల్ హాలిడేతో పనిలేకుండానే తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు వస్తుంది. ఈ సెలవురోజు తోబుట్టువులు రాఖీ వేడుకలు ఆనందంగా జరుపుకోవచ్చు.
ఆగస్ట్ 8,9,10 సెలవులు
ఆగస్ట్ 8,9 (శుక్ర, శనివారం) సెలవులకు జులై 10 ఆదివారం సెలవు కలిసివస్తోంది. దీంతో వరుసగా మూడురోజుల సెలవులు కలిసివచ్చి వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారనుంది. ఈ లాంగ్ వీకెండ్ లో పండగలను బాగా ఎంజాయ్ చేయవచ్చు… పండగ జరుపుకోనివారు హాయిగా మంచి టూర్ ప్లాన్ చేసుకోవచ్చు.
ఆగస్ట్ 15,16,17 సెలవులు
స్వాతంత్య్ర దినోత్సవ సెలవు :
ఆగస్ట్ 15... భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినరోజు. కాబట్టి ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా జెండా ఆవిష్కరణ, ప్రత్యేక కార్యక్రమాల అనంతరం సెలవే. ఈసారి స్వాతంత్య్ర దినోత్సవం శుక్రవారం వస్తోంది.
శ్రీకృష్ణాష్టమి :
ఆగస్ట్ 16.. హిందువుల ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడి జన్మదినం. ఈరోజు దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. కాబట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ఈరోజు అధికారిక సెలవు ప్రకటించాయి.
ఆదివారం సెలవు :
ఆగస్ట్ 15, 16 వరుసగా శుక్ర, శనివారాలు సెలవులు వస్తున్నాయి.. ఇక ఆగస్ట్ 17 ఎలాగూ ఆదివారం సాధారణ సెలవే. ఇలా వరుసగా మూడురోజులు సెలవులు వస్తున్నాయి.
ఆగస్ట్ 23, 24 సెలవులు
నాలుగో శనివారం సెలవు :
బ్యాంకు ఉద్యోగులకు మాత్రమే ఈ సెలవు వర్తిస్తుంది. ప్రతి నెలలో రెండు, నాలుగో శనివారాలు దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు. కాబట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని బ్యాంకు ఉద్యోగులకు ఆగస్ట్ 23న మరో సెలవు వస్తోంది.
ఆదివారం సెలవు :
ఆగస్ట్ 24 ఆదివారం సాధారణ సెలవు. ఇలా ఆగస్ట్ 23, 24 వరుసగా శని, ఆదివారం సెలవు వస్తోంది. ఆగస్ట్ నెలలోని ప్రతి వీకెండ్ వరుస సెలవులు వస్తున్నాయి.
ఆగస్ట్ 27, 31 సెలవులు
వినాయక చవితి :
ఆగస్ట్ 27న వినాయక చవితి. ఈరోజు వాడవాడలా వినాయక విగ్రహాలు వెలుస్తాయి. ప్రతి ఇంట్లో బొజ్జ గణపయ్య పూజలందుకుంటారు. యువకులు తమ కాలనీల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టించి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. ఈరోజు నుండి కాలనీల్లో సందడి నెలకొంటుంది.
ఆదివారం సెలవు :
వరుస సెలవుల తర్వాత ఆగస్ట్ లో చివరగా ఆదివారం వస్తోంది.. ఆగస్ట్ 31 సాధారణ సెలవు. ఇక నెల ఆరంభంలో అంటే ఆగస్ట్ 3న ఆదివారం సెలవే. ఇలా ఆగస్ట్ లో సెలవులే సెలవులు వస్తున్నాయి.