Tata Tiago EV : సూపర్ ఆఫర్ గురూ... టాటా టియాగో EV పై ఇంత తగ్గింపా..!
టాటా టియాగో EV సమర్థవంతమైన బ్యాటరీ, అందమైన డిజైన్‌తో పెట్రోల్ కార్లకు స్మార్ట్ ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఇది భారీ ఆఫర్లతో లభిస్తోంది… అవేంటో ఇక్కడ చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us

టాటా టియాగో EV
మీరు ఎలక్ట్రిక్ వెహికల్‌కి మారాలని ప్లాన్ చేస్తున్నారా? బడ్జెట్ సమస్యల కారణంగా వెనకాడుతున్నారా? అయితే చింతించకండి… ఈ EV ని పొందేందుకు ఇదే సరైన అవకాశం. టాటా మోటార్స్ తన ప్రముఖ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగో EVపై మంచి డిస్కౌంట్లు అందిస్తోంది.
అందమైన డిజైన్, సమర్థవంతమైన బ్యాటరీ కలిగిన ఈ టియాగో నగర ప్రయాణానికి చాలా అనువైనది. ఈ EV ఇప్పుడు రోజువారీ ఉపయోగం కోసం, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం మంచి ఎంపిక. స్టైలిష్ ఎక్స్‌టీరియర్, ఖర్చు ఆదా ప్రయోజనాలతో, పెట్రోల్ కార్లకు స్మార్ట్ ప్రత్యామ్నాయం కోరుకునే నగర ప్రయాణికులకు టియాగో EV సరైనది.
Tata Tiago EV పై భారీ డిస్కౌంట్లు
టాటా టియాగో EV ధర రూ.7.99 లక్షల నుండి రూ.11.14 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. జులై 2025లో కొనుగోలుదారులకు నగదు ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌తో సహా రూ.40,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ మొదటిసారి EV కొనుగోలుదారులకు లేదా పెట్రోల్ వాహనాల నుండి అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి గణనీయమైన విలువను జోడిస్తుంది.
ఈ టియాగో మోడల్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది - XE MR, XT MR, XT LR, XZ Plus Tech LUX LR - మీరు తక్కువ దూరం నగరంలో ప్రయాణించేవారు అయినా, ఎక్కువదూరం హైవేలపై ప్రయాణిించేవారు అయినా మీకు సౌకర్యవంతమైన ప్రయాణం టియాగో EV తో సాధ్యమని కంపెనీ హామీ ఇస్తోంది.
Tata Tiago EV ఆధునిక ఫీచర్లు
10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే, 8-స్పీకర్ ఆడియో, ఆటో క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, పుష్-బటన్ స్టార్ట్ వంటి హై-ఎండ్ ఫీచర్లతో టియాగో EV ప్రత్యేకంగా నిలుస్తుంది. LED DRLలు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, షార్క్ ఫిన్ యాంటెన్నా, 240 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉన్నాయి. ఈ ఫీచర్లు టియాగో EVని దాని విభాగంలో అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా నిలుపుతున్నాయి.`
రోజువారీ ఉపయోగంలో సురక్షితం
4-స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, డిజిటల్ రివర్స్ కెమెరాతో భద్రత ప్రధాన హైలైట్. IP67-రేటెడ్ బ్యాటరీ నీరు, దుమ్ము నిరోధకతను కలిగి ఉంటుంది, నష్టాన్ని నివారించడానికి ఆటోమేటిక్ కట్-ఆఫ్ ఉంటుంది. మొత్తంమీద టాటా టియాగో EV విలువ, భద్రత, పనితీరును అందిస్తుంది. ఈ సీజన్‌లో స్మార్ట్ EV ఎంపికగా నిలుస్తుంది.
Tata Tiago EV బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలు
టాటా టియాగో EV రెండు బ్యాటరీ ఆప్షన్లలో వస్తుంది. 223–250 కి.మీ. రేంజ్ ఇచ్చే 19.2 kWh యూనిట్, 293–315 కి.మీ. ఇచ్చే 24 kWh వెర్షన్ (ARAI సర్టిఫైడ్). నగర ప్రయాణాలకు చిన్న బ్యాటరీ సరిపోతుంది, లాంగ్ రేంజ్ వేరియంట్ హైవే ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.
DC ఫాస్ట్ ఛార్జర్‌తో బ్యాటరీ 10% నుండి 80% వరకు కేవలం 58 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. 7.2 kW AC ఛార్జర్‌తో పూర్తి ఛార్జ్‌కి దాదాపు 3.6 గంటలు పడుతుంది. పవర్ ఔట్‌పుట్ 60.34 bhp నుండి 73.75 bhp వరకు ఉంటుంది, ఇది వేరియంట్‌ను బట్టి స్థిరమైన పనితీరును నిర్ధారిస్తుంది.