- Home
- Business
- House Sale Tips : మీ ఇంటి ధరను మీరే పెంచుకోండిలా... ఈ సింపుల్ చిట్కాలతో బోలెడు లాభాలు ఖాయం
House Sale Tips : మీ ఇంటి ధరను మీరే పెంచుకోండిలా... ఈ సింపుల్ చిట్కాలతో బోలెడు లాభాలు ఖాయం
మీ ఇంటిని అమ్మాలనుకుంటున్నారా? అయితే ఈ చిన్న చిన్న చాట్కాలు పాటించడం ద్వారా మంచి ధరను పొందవచ్చు... తద్వారా మంచి లాభాలను సాధించవచ్చు. ఆ టిప్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

మీ ఇంటి ధరను పెంచుకోండిలా
Old House Sale Tips : మీకు ఏదైనా అవసరముండో లేక కొత్త ఇల్లు కట్టుకునో పాత ఇంటిని అమ్మాలనుకుంటే వెంటనే సరైన ధర రాదు. ఆ ఇంటికి ఏదో లోపముందని భావించి... బాగా పాతబడి ఉండటం చూసి కొనడానికి వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి ఎన్నో అడ్డంకులుంటాయి... కాబట్టి పాత ఇళ్లని అమ్మడం చాలా మందికి కష్టమైన పని.
అయితే సరైన ప్లానింగ్, కొంచెం పెట్టుబడితో పాత ఇంటిని ఆకర్షణీయంగా మార్చి మంచి లాభసాటిగా అమ్మొచ్చు. పాత ఇల్లు అమ్మాలనుకుంటే ముందుగా దాని రూపురేఖలు, విలువ పెంచడానికి కొన్ని మార్పులు చేయాలి. ఇలా ఇంటిని అమ్మేవాళ్ళు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ధర ఖాయం.
1. ఇంటిని బాగుచేసుకొండి
కాంపౌండ్ వాల్ కట్టడం
ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ కడితే భద్రతకు భద్రత, అందానికి అందం పెరుగుతుంది. ఇంటిని చూడగానే మంచి భద్రత ఉందనే భావన కొనుగోలుదారులకి కలుగుతుంది. ఇలా మొదటి చూపులోనే ఇంటిపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.
చిన్న చిన్న రిపేర్లు
పాత ఇండ్లకు చిన్నచిన్న రిపేర్లు ఉండటం ఖాయం. ఇందులో ముఖ్యమైనవి పగుళ్లు... ఇంటి లోపల, బయట పగుళ్లు వచ్చివుంటాయి. అలాగే నీటి లీకేజీ సమస్య కూడా కొన్ని ఇళ్లకు వస్తుంది. ఇవే కాకుండా ఇతర రిపేర్లేమైనా ఉంటే చేయించడం ముఖ్యం. ఇది ఇంటి నిర్మాణం, విలువ పెంచుతుంది.
ఇంటిని ఆకర్షనీయంగా మార్చండిలా..
చెట్లు, మొక్కలు నాటడం
ఇంటి ముందు పచ్చని మొక్కలు నాటాలి... ఇప్పటికే చెట్లు ఉంటే వాటిచుట్టు శుభ్రం చేయాలి. ఇలా ఇంటి ఆవరణలో చెట్లుంటే పచ్చగా ఉంటుంది… ఇది ఎంతో , ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తుంది. ఈ ప్రకృతి అందాలు, వాతావరణం కొనుగోలుదారులని ఆకర్షిస్తాయి.
ఆకట్టుకునే రంగులతో పెయింటింగ్ వేయించడం
ఇల్లు రంగు వెలిసిపోయి ఉంటే ఎవరికీ నచ్చదు. అందుకే మీ పాత ఇల్లు అమ్మే సమయంలో లోపల, బయట మంచి కలర్ వేయించండి...దీనివల్ల ఇంటికి కొత్త లుక్ వస్తుంది. కొత్త కలర్స్ ఎంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ మార్పులతో తక్కువ ఖర్చుతో ఇంటి విలువ పెరుగుతుంది.
పాత ఇల్లు అమ్మడానికి చిట్కాలు
ఏ వస్తువు అమ్మినా కొనుగోలుదారుల మనసు దోచుకునేలా ఉండాలి. అప్పుడే మంచి ధర వస్తుంది. ఇలా పాత ఇల్లు అమ్మడానికి ఈ ఉపాయాలు ఉపయోగపడతాయి.
మొదటి చూపులోనే ఆకట్టుకునేలా :
పాతఇల్లు అమ్మకానికి పెట్టినప్పుడు ఏ కొనుగోలుదారులు ముందుగా ఇంటి బయట భాగాన్ని చూస్తారు. ముంగిలి శుభ్రంగా ఉంచడం, కొత్త కలర్, అందమైన చెట్లు, మొక్కలు ఇంటిని ఆకర్షణీయంగా మారుస్తాయి.
అలాగే పైపులు, కరెంట్, కిటికీలు, తలుపులు సరిగ్గా పనిచేయాలి. ఇది కొనుగోలుదారులకి ఇంటి నాణ్యతపై నమ్మకం కలిగిస్తుంది.
ఆధునికీకరణ (Modernization)
కిచెన్, బాత్రూమ్ లాంటి ముఖ్యమైన ప్రదేశాలని ఆధునికంగా మార్చడం వల్ల కొనుగోలుదారులు ఆకర్షితులవుతారు. కొత్త టైల్స్, లైటింగ్, లేదా సామాగ్రి ఇంటి విలువ పెంచుతాయి.
మీ ఇంటి ధరను ఇలా పెంచుకొండి
మంచి ఫోటోలతో మార్కెటింగ్
ఇంటి అందాలు చూపించే మంచి ఫోటోలు తీసి, ఆన్‌లైన్‌లో పెట్టాలి. సోషల్ మీడియా, రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్స్, ప్రకటనల ద్వారా ఇంటిని ప్రచారం చేయాలి.
ధర నిర్ణయం (Pricing Strategy):
మార్కెట్లో ఉన్న ఇతర ఇళ్ల ధరలు చూసి, పోటీగా ధర నిర్ణయించాలి. ఎక్కువ ధర, తక్కువ ధర రెండూ అమ్మకంపై ప్రభావం చూపుతాయి.
స్టేజింగ్ (Staging)
అమ్మకానికి ముందు, ఇంట్లో అందమైన ఫర్నిచర్, అలంకరణ వస్తువులు పెట్టి స్టేజింగ్ చేయొచ్చు. ఇది కొనుగోలుదారులకి ఇంటిని ఊహించుకోవడానికి సహాయపడుతుంది.
పారదర్శకత
ఇంటి స్థితి, చట్టపరమైన పత్రాలు, ఇతర వివరాలు కొనుగోలుదారులకి స్పష్టంగా తెలియజేయాలి. ఇది నమ్మకాన్ని పెంచి, అమ్మకాన్ని సులభతరం చేస్తుంది.
పక్కా ప్లానింగ్ తో డబ్బు వస్తుంది
పాత ఇల్లు అమ్మడం కష్టమే అయినా సరైన ప్లానింగ్, పెట్టుబడితో లాభాలు పొందొచ్చు. ఇంటి రూపురేఖలు మార్చడం, రిపేర్లు చేయించడం, ఆధునికీకరణ, మార్కెటింగ్ స్ట్రాటజీలతో పాత ఇంటిని ఆకర్షణీయంగా మార్చి అనుకున్నదానికంటే ఎక్కువ లాభం పొందొచ్చు. ఈ ఉపాయాలు రియల్ ఎస్టేట్‌లోనే కాదు, ఏ వ్యాపారంలోనైనా కొనుగోలుదారులని ఆకర్షించడానికి ఉపయోగపడతాయి.