MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Careers
  • ఓ ఇంజనీరింగ్ విద్యార్థీ, సాప్ట్ వేర్ ఉద్యోగీ... నీ బతుకు జట్కాబండి కాకుండా చూసుకో..!

ఓ ఇంజనీరింగ్ విద్యార్థీ, సాప్ట్ వేర్ ఉద్యోగీ... నీ బతుకు జట్కాబండి కాకుండా చూసుకో..!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంట్రీతో సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ కంపనీలు ఉన్నతస్థాయి ఉద్యోగులను కూడా సాగనంపుతున్నాయి… లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఈ  క్రమంలో ఇంజనీరింగ్ విద్యార్థులు, సాప్ట్వేర్ ఉద్యోగులు జాగ్రత్తపడాలి.

3 Min read
Author : Amarnath Vasireddy
Published : Jul 21 2025, 10:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
హ్యాంగ్ ఓవర్ వద్దు !
Image Credit : Gemini AI

హ్యాంగ్ ఓవర్ వద్దు !

1997 - 2024 : సాఫ్ట్ వేర్ స్వర్ణ యుగం !

ఇంటా బయటా ఉద్యోగాల సునామీ !

బాగా చదువుకున్నవారు... ఐఐటీ, ఎన్ఐటీల్లో...

యావరేజ్ విద్యార్థులు ... సాదా సీదా ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుకున్న వారు కూడా ...

... హైదరాబాద్,  బెంగళూరు, అమెరికా , కెనడా, యూరోప్, ఆస్ట్రేలియా లలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు !

ఈ రంగం లో ఉద్యోగాల వెల్లువ ఎలా ఉండేదంటే పదో తరగతి, ఇంటర్ ఫెయిల్ అయినవారు, ఇంజనీరింగ్ రెండో సంవత్సరం దాటని వారు కూడా కన్సల్టెంట్ లను పట్టుకొని దొంగ సర్టిఫికెట్ లతో, డూప్లికేట్ లతో పరీక్షలు రాయించి.. ఇంటర్వ్యూ లు చేసి... ఉద్యోగాలు సంపాదించి విదేశాల్లో సెటిల్ అయిపోయారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సాప్ట్వేర్ ఉద్యోగులకు గడ్డుకాలం
Image Credit : Meta AI

సాప్ట్వేర్ ఉద్యోగులకు గడ్డుకాలం

సాప్ట్వేర్ స్వర్ణ యుగం ముగిసింది !

కృతిమ మేధ వచ్చేసింది !

సాఫ్త్వేర్ రంగంలో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలను తినేసింది.

ఇక్కడ... అక్కడని లేదు .. ప్రపంచమంతా !

కానీ మనవాళ్ళు ఇంకా హ్యాంగ్ ఓవర్ లోనే ఉన్నారు ..

మజ్జిగ తాగండి ... మత్తు వదలండి !

ఇక సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఉండవని కాదు.

ఉన్నాయి…

వస్తాయి !

36
ఇక వీరికే సాప్ట్ వేర్ ఉద్యోగాలు..
Image Credit : Getty

ఇక వీరికే సాప్ట్ వేర్ ఉద్యోగాలు..

కానీ మోటార్ సైకిళ్ళు .. స్కూటర్లు .. కార్లు ... షేర్ ఆటోలు వచ్చేసాక .. జట్కా బండి యాపారం నడుస్తుందా ?

అదే హ్యాంగోవర్ లో ఉంటే .. బతుకు జట్కాబండి అయిపోదా ?

కృతిమ మేధ చేసే పని... మాత్రమే చేసే ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఉద్యోగాలు వస్తాయా ?

రావు ..

ఎంత గింజుకున్నా రావు !

కృతిమ మేధ చేయలేని పని చేసేవారికే ఇక ఉద్యోగాలు .

క్రియేటివిటీ , క్రిటికల్ థింకింగ్ , కాలాబోరేషన్ స్కిల్స్ లాంటివి ఉన్న వారికే ఉద్యోగాలు .

46
బట్టీ చదువులతో ఇక బ్రతకలేం..
Image Credit : Getty

బట్టీ చదువులతో ఇక బ్రతకలేం..

మనవారేమో ఒకటో తరగతి నుంచి ఇంజనీరింగ్ దాక రోడ్డ కొట్టుడు .. బట్టీ చదువులు !

ఇంజనీరింగ్ లో బ్రాంచ్ ఏదైనా చెప్పేది తమకు వచ్చిన నాలుగు ముక్కలే !

CSE.. DS .. AIML .. బ్రాంచ్ పేరు ఏదైనా ఆవు వ్యాసాలే !

కాలం చెల్లిన చదువులు చెప్పి ... కాపీ లు కొట్టించి... డిగ్రీ లు ఇచ్చి బయటకే తోలేస్తే.. 

ఉద్యోగాలు వచ్చేయడానికి ఇదేమైనా సోఫ్త్వేర్ స్వర్ణ యుగమా?

మనం వున్నది 2025 లో.. కృతిమ మేధ యుగం మొదలై పోయింది .

ఇప్పటి దాక చదివిన బట్టీ చదువులు వేస్ట్ !

కాపీ కొట్టి తెచ్చుకొన్న డిగ్రీ లు వేస్ట్!

మళ్ళీ బేసిక్స్ నుంచి మొదలెట్టాల్సిందే !

బట్టీ చదువుల మోడ్ లో.. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్... మెషిన్ లెర్నింగ్ లాంటి కోర్స్ లు చదివినా ఉద్యోగాలు రావు .

ఎందుకంటే బట్టీ రాయిళ్ళు ... మహా అంటే రోబో లు చేసే పనే చేయగలుగుతారు .

అదేమో వీరి కంటే లక్ష రెట్లు ఎక్కువ పని సామర్త్యం కనబరుస్తుంది.

56
రోబో యుగంలో రోజులు మారాయి
Image Credit : iSTOCK

రోబో యుగంలో రోజులు మారాయి

కింద బోసారు గా ..

.. ఇప్పుడు ఏరుకోండి !

సృజన, నాయకత్వ లక్షణాలు , సమిష్టి తత్త్వం , కుశాగ్ర బుద్ధి , మెరుగైన భావ వ్యక్తీకరణ శక్తి , భావోద్వేగ .. సామాజిక తెలివి తేటలు .. ఇవీ ఒక నాటి చదువులు .

సాఫ్ట్ వేర్ స్వర్ణ యుగం లో వీటిని పట్టించుకొన్నవాడు లేడు.

ఒక మాదిరి కళాశాలలో ఇంజనీరింగ్ చేసినా లక్షల్లో జీతం వస్తుండే.

కాలం అలాగే ఆగిపోతే బాగుండేదేమో ..

కానీ .. రోబో యుగం వచ్చేసింది .

ఫండమెంటల్స్ మరిచిన వారికి అశనిపాతం అయ్యింది .

66
మత్తు వదలరా .. తెలుగోడా !
Image Credit : Getty

మత్తు వదలరా .. తెలుగోడా !

కార్పొరేట్ స్కూల్స్ .. ఐదో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ లు .. కోళ్ల ఫారాల ఇంజనీరింగ్ కళాశాలలు .. విదేశీ చదువుల ఉద్యోగాల కన్సల్టెంట్స్ .. వీరి మాయ నుంచి .. తెలుగు జాతి బయట పడేది ఎప్పుడు?

డాల్లర్ల సంపాదన.. ఇండియా లో ప్లాట్స్ కొనుగోలు.. సంవత్సరానికి ఒక్క సారి అమెరికా ప్రయాణాలు .. అక్కడ వాకింగ్ లో కబుర్లు .. తిరిగొచ్చాక అమెరికా గొప్పదనం గురించి డాంబికాలు.. ఈ హ్యాంగ్ ఓవర్ పోయేదెలా ?

రాత్రి తాగినప్పుడు మస్తు మజా... ఇప్పుడు పొద్దు పుట్టింది.

తలనొప్పి…నాలుక డ్రై..

ఈ హ్యాంగ్ ఓవర్ పోయేదెలా ?

ముదర పెట్టుకొంటే కిడ్నీలు పోతాయి..

ఫాటీ లివర్ వచ్చేస్తుంది .

మత్తు వదలరా .. తెలుగోడా !

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
విద్య
ఉద్యోగాలు, కెరీర్
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే
Recommended image2
Free Education: ఉచిత విద్యను అందించే దేశాలు.. ఇక్కడ ఫ్రీగా చదువుకోవచ్చని మీకు తెలుసా?
Recommended image3
Indian IT jobs Australia vs Switzerland: మనోళ్లకు జాబ్స్, లైఫ్ సెటిల్‌మెంట్ కోసం ఏ దేశం బెస్ట్?
Related Stories
Recommended image1
Tech Lay Offs: 6 నెలల్లో లక్ష మందిని ఇంటికి పంపేసిన సంస్థలు...ఆగని ఉద్యోగ కోతలు!
Recommended image2
Meta Layoff: 6 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు ఫేస్ బుక్ సిద్ధం..తొలగని అమెరికా ఉద్యోగ సంక్షోభం..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved