- Home
- Business
- Saving scheme: రూ. 50 వేల జీతంతో, 15 ఏళ్లలో రూ. కోటి ఎలా సంపాదించాలి.? చాట్ జీపీటీ చెప్పిన సమాధానం ఏంటంటే.
Saving scheme: రూ. 50 వేల జీతంతో, 15 ఏళ్లలో రూ. కోటి ఎలా సంపాదించాలి.? చాట్ జీపీటీ చెప్పిన సమాధానం ఏంటంటే.
జీవితంలో కోటి రూపాయలు సంపాదించాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే ఆదాయం ఉన్నా సరైన ఆర్థిక ప్రణాళికలు లేని కారణంగా అది సాధ్యం కాకపోతుండొచ్చు. మరి 15 ఏళ్లలో కోటి ఎలా సంపాదించాలన్న ప్రశ్నకు చాట్‌జీపీటీ ఎలాంటి సమాధానం ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం.

నెలకు రూ. 50 వేల జీతం
ఉదాహరణకు ఒక వ్యక్తికి నెలకు రూ. 50,000 జీతం వస్తోంది. అతడు వచ్చే 15 సంవత్సరాల్లో రూ. 1 కోటి సంపాదించాలనుకుంటే, కచ్చితమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. సంపాదన, ఖర్చులు, పెట్టుబడులు, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలి.?
వచ్చే 15 ఏళ్లలో కోటి రూపాయలు సంపాదించాలంటే నెలకు కనీసం రూ. 20,000 పొదుపు చేయాల్సి ఉంటుంది. వీటిని ఎస్ఐపీ (Systematic Investment Plan) రూపంలో పెట్టుబడి చేస్తూ పోతే ఇది సాధ్యమవుతుంది. మ్యూచ్‌వల్ ఫండ్స్‌జ/ఇక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే కనీసం 12 శాతం వార్షిక రిటర్న్స్ వస్తుంది. నెలకు రూ. 20 వేల చొప్పును పెట్టుబడి పెడితే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్‌తో 15 ఏళ్లలో రూ. కోటికిపైగా పొందొచ్చు.
ఖర్చుల నియంత్రణ – బడ్జెట్ ప్లానింగ్ అవసరం
రూ. 50 వేల జీతం వస్తున్న వ్యక్తి కోటి రూపాయలు సంపాదించాలంటే నెలకు కనీసం 40 శాతం పొదుపు చేయాలి. ఆ తర్వాత మిగిలిన రూ. 30 వేలను ఖర్చులకు పరిమితం చేసుకోవాలి. ఇందుకోసం నెలవారీ బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవాలి. ఇందులో ఇంటి అద్దె రూ. 8 నుంచి 10 వేలు కేటాయించాలి. కిరాణం, ప్రయాణం వాటికి సంబంధించి రూ. 8 వేలు కేటాయించాలి. అలాగే ఆరోగ్యం, స్కూలు ఫీజులు ఇతర ఖర్చులకు నెలకు రూ. 12 వేల వరకు కేటాయించాలి. అనవసర ఖర్చులు తగ్గిస్తే ఇదే సాధ్యమే.
ఎక్కడ పెట్టుబడి చేయాలి?
ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ధీర్ఘకాలిక పెట్టుబడులకు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఇతర మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చాలా అవసరం. సురక్షితమైన పెట్టుబడికి 60% మ్యూచువల్ ఫండ్స్ (SIP ద్వారా), 20% స్టాక్స్ (కంపెనీల అధ్యయనం తర్వాత), 10% PPF/EPF/SSY లాంటి గవర్నమెంట్ స్కీమ్‌లు, 10% ఎమర్జెన్సీ ఫండ్ (FD లేదా లిక్విడ్ ఫండ్) కేటాయించుకోవచ్చు.
ఎమర్జెన్సీ ఫండ్ కచ్చితంగా ఉండాలి
ఫైనాన్షియల్ గోల్స్‌ను సాధించాలంటే, మధ్యలో వచ్చే ఆటంకాలను ఎదుర్కొనే సత్తా ఉండాలి. అందుకే.. ఎమర్జెన్సీ ఫండ్ కోసం కనీసం 6 నెలల ఖర్చులకు సరిపోయే డబ్బు FD లేదా లిక్విడ్ ఫండ్‌లో ఉంచాలి. కనీసం రూ. 5 లక్షల విలువైన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. వీటితో పాటు జీవిత భద్రత కోసం టర్మ్ ప్లాన్ కూడా తీసుకోవాలి.
గమనిక: పైన తెలిపిన వివరాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఎస్ఐపీ ఎంచుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం ఆర్థిక నిపుణుల సూచనలు తీసుకోవాలి.