తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: అమెరికా ఉపాధ్యక్షుడు జీడీ వాన్స్ భారత దేశ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఆయన జైపూర్ లో పర్యటించనున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ఈరోజుతో ముగియనుంది. అలాగే విదేశాల నుంచి తిరిగొచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

11:54 PM (IST) Apr 22
IPL 2025 LSG vs DC: ఐపీఎల్ 2025 లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో ఓడించింది. లక్నో ఓపెనర్లు ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్ తప్ప మిగతా ప్లేయర్లు రాణించలేదు. రూ.27 కోట్ల రిషబ్ పంత్ మరోసారి విఫలమయ్యాడు. కేఎల్ రాహుల్, అభిషేక్ పొరేల్, అక్షర్ పటేల్ సూపర్ నాక్ లతో లక్నో హోం గ్రౌండ్ లో ఢిల్లీ విక్టరీ కొట్టింది.
11:53 PM (IST) Apr 22
Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశం ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా స్పందించారు. దాడి తమను కలిచివేసిందని అన్నారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న మోదీ ఉగ్రమూకల దాడి గురించి తెలిసిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే శ్రీనగర్ వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. దీంతో షా ఇప్పటికే శ్రీనగర్ చేరుకుని అధికారులతో సమావేశమయ్యారు.
11:35 PM (IST) Apr 22
Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశం ఉలిక్కిపడేలా చేసింది. అమర్నాథ్‌యాత్రకు టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు వచ్చిన పర్యాటకులపై ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. అతి దగ్గరి నుంచి కాల్పులు జరపడంతో అనేక మంది మృతి చెందారు. ఇప్పటికైతే మృతుల సంఖ్య లెక్కకు రాలేదు. అనేక మందికి గాయాలు అయ్యాయి. ఇప్పుడిప్పుడే ఒక్కో ఘటన వెలుగులోకి వస్తుండటంతో ఆ దృశ్యాలు చూసిన వారు అయ్యో ఎంత ఘోరం జరిగిందోనని బాధపడుతున్నారు.
11:16 PM (IST) Apr 22
భారత పర్యటనలో ఉన్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ జె.డి. వాన్స్ పహల్గాం ఉగ్రదాడిపై స్పదించారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. ఈ ఇద్దరు నేతల ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన టూరిస్ట్ లకు సంతాపం తెలిపారు.
పూర్తి కథనం చదవండి11:06 PM (IST) Apr 22
5 Brain exercises to improve your memory: మెదడు వ్యాయామాలు బ్రెయిన్ పనితీరును మెరుగుపరుస్తాయి.. జ్ఞాపకశక్తిని మరింతగా పెంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంచి మీ మెదడు పనితీరును మెరుగుపరిచే విషయాలు చాలానే ఉన్నాయి. మీ జ్ఞాపకశక్తిని పదును పెట్టే కొన్ని పనులు ఇప్పుడు తెలుసుకుందాం.
10:55 PM (IST) Apr 22
భారత్ బాట: ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ అంటే వెంటనే గుర్తొచ్చేది చైనానే. ప్రపంచ దిగ్గజ కంపెనీల మాన్యఫాక్చరింగ్ కంపెనీల్లో అత్యధికం అక్కడే ఉన్నాయి. సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల గురించి ఇంక చెప్పనే అక్కర్లేదు. కానీ కొన్నాళ్లుగా ఆ దిగ్గజ కంపెనీలు చైనాకు బదులుగా భారత దేశం బాట పడుతున్నాయి. మన దగ్గరే ల్యాప్‌టాప్ తయారీ యూనిట్లు తెరుస్తున్నాయి. దానికి కారణమేంటో మీరు తెలుసుకోవాల్సిందే.
పూర్తి కథనం చదవండి10:54 PM (IST) Apr 22
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకుడు మరణించగా, అనేకమంది గాయపడ్డారు. ఈ దాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది. ఈ సంస్థ చరిత్ర ఏమిటి, దాని వెనుక ఉన్న శక్తులు ఏమిటి? తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి10:28 PM (IST) Apr 22
jeera water: జీలకర్రను మనం రోజువారీ వంటలలో ఉపయోగించే ఒక సాధారణ పదార్థం కానీ, దీంతో అనేక లాభాలు ఉన్నాయి. ప్రత్యేక రుచిని కలిగిన జీరాతో జీర్ణక్రియ మెరుగుపడటం, బరువు తగ్గడం, జీవక్రియ కీలకంగా పనిచేయడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. చర్మం, జుట్టుకు కూడా ఎంతో మేలుచేస్తుంది. ఉదయం జీలకర్ర నీరు (జీరా వాటర్) తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
10:27 PM (IST) Apr 22
ఇంటర్నల్ కమిటీ మీటింగ్‌లో షైన్ విన్సీకి క్షమాపణ చెప్పాడు. ఇకపై ఇలాంటివి జరగవని హామీ ఇచ్చాడు.
పూర్తి కథనం చదవండి10:19 PM (IST) Apr 22
జలియన్ వాలాబాగ్ దురంతం నేపథ్యంలో మలయాళీ న్యాయవాది వీరగాథను అక్షయ్ కుమార్ నటించిన 'కేసరి' చిత్రం చూపిస్తుంది. దీని OTT విడుదల, బాక్సాఫీస్ విజయం, చరిత్రలో పాతుకుపోయిన శక్తివంతమైన కథనం గురించి ఇక్కడ తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి10:10 PM (IST) Apr 22
అజయ్ దేవగన్ తన రాబోయే చిత్రం రెయిడ్ 2 తో వార్తల్లో నిలిచారు. ఆయన సినిమా మే 1న విడుదల కానుంది. దీనికి ముందు, అజయ్ దక్షిణాది సినిమాల రీమేక్‌లుగా ఉన్న కొన్ని చిత్రాల గురించి మీకు చెప్పబోతున్నాం.
పూర్తి కథనం చదవండి10:06 PM (IST) Apr 22
కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడితో యావత్ దేశం దిగ్బ్రాంతికి గురయ్యింది. ఈ క్రమంలో కాశ్మీర్ పర్యటనకు వెళ్లినవారి కుటుంబాలు, స్నేహితులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే టూరిస్టులు, బాధితుల సమాాచారం కోసం ఈ హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయండి.
పూర్తి కథనం చదవండి09:36 PM (IST) Apr 22
జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు మృతి చెందారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ ప్రధాని వెంటనే స్పందించి సీరియస్ కామెంట్స్ చేసారు.
పూర్తి కథనం చదవండి08:54 PM (IST) Apr 22
దక్షిణ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని బైసరన్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడిలో కనీసం 24 మంది హిందూ పర్యాటకులు మరణించగా, 13 మంది గాయపడ్డారు. బాధితుల మత గుర్తింపును నిర్ధారించుకున్న తర్వాత ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సమాచారం.
పూర్తి కథనం చదవండి
08:42 PM (IST) Apr 22
రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళుతుంటేనే వాహనాల హారన్ శబ్దాలు చెవులు చిల్లుపడేలా వినిపిస్తాయి. ఇక హైవేలపై వాహనం నడుపుకుంటూ వెళుతున్నా... ట్రాఫిక్ లో చిక్కుకున్నా ఆ హారన్ల మోతకు చిర్రెత్తుకువస్తుంది. అయితే ఇకపై ఇలాంటి అనుభవం కాకుండా హాయిగా హారన్ శబ్దాలను కూడా ఆస్వాదించేలా కేంద్రం కొత్త చట్టం తీసుకువచ్చేందుకు ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
పూర్తి కథనం చదవండి08:09 PM (IST) Apr 22
Most Player of the Match awards in IPL: ముంబై ఇండియన్స్ (MI) స్టార్ బ్యాటర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఐపీఎల్ లో మరో రికార్డు సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) దిగ్గజ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీని అధిగమించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' (POTM) అవార్డులను అందుకున్న భారత ప్లేయర్ గా నిలిచాడు. అయితే, ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు గెలుచుకున్న టాప్-5 ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి07:22 PM (IST) Apr 22
మీ పిల్లలను IAS గానో లేక IPS గానో చూడాలని కలగంటున్నారా? అందుకోసం ఎలా సన్నద్దం చేయాలో తెలియడం లేదా? అయితే యూపిఎస్సి 2024 ఫలితాల్లో ఆలిండియా టాపర్ గా నిలిచిన ఆడబిడ్డ శక్తి దూబే సక్సెస్ స్టోరీని తెలుసుకోండి. ఆమెను ఆదర్శంగా తీసుకుని సివిల్స్ కు ప్రిపేర్ అయితే మంచి ఫలితాలు సాధించవచ్చు.
పూర్తి కథనం చదవండి07:15 PM (IST) Apr 22
IPL 2025 Match Fixing: ఐపీఎల్ 2025 ఉత్కంఠగా సాగుతోంది. సగానికి చేరిన ఈ మెగా క్రికెట్ లీగ్ మధ్యలో ఒక జట్టుపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు సంచలనంగా మారాయి. ఎందుకంటే దాదాపు గెలిచే మ్యాచ్ లో ఓడిపోవడమే దీనికి ప్రధాన కారణం. నిజంగానే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా? ఎందుకు ఈ ఆరోపణలు వస్తున్నాయి? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి07:04 PM (IST) Apr 22
UPSC 2025 Results: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈసారి ఫలితాలల్లో మొదటి 25 ర్యాంకుల్లో అమ్మాయిలు ప్రతిభ కనబరిచారు. మొదటి 25 ర్యాంకుల్లో 11 మంది అమ్మాయిలే ఉండటం విశేషం. ఇక తొలి అయిదు ర్యాంకుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. తొలి ర్యాంకు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శక్తి దూబే సాధించారు. రెండో ర్యాంకు హర్షిత గోయల్ కి వచ్చింది. డోంగ్రే అర్చిత్ పరాగ్ 3వ ర్యాంక్, షా మార్గి చిరాగ్ నాలుగో ర్యాంకు, ఆకాష్ గార్గ్ 5వ ర్యాంకుల్లో నిలిచారు. అయితే.. రెండో ర్యాంకు సాధించిన గుజరాత్‌కు చెందిన హర్షిత గోయల్ కి తల్లిలేరు తండ్రి ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రిపరేషన్‌లో తన తండ్రి అన్ని విధాలుగా తనను ప్రోత్సహించినట్లు పేర్కొన్నారు. కుటుంబం నుంచి సివిల్ సర్వెంట్ కాబోతుంది తొలి వ్యక్తి తనేనని చెబుతున్నారు. ఈ విజయానికి తండ్రితోపాటు స్నేహితులూ మద్దతుగా నిలిచారని గోయల్ అంటున్నారు. మహిళల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అన్నాను.
06:58 PM (IST) Apr 22
Railway Rules: ఇప్పుడు పెగ్గు పడందే ఏ పనీ చేయలేనంతగా కొంత మంది జనం తయారవుతున్నారు. మరి రైళ్లలో మద్యం తాగి ప్రయాణిస్తే ఎలాంటి శిక్ష విధిస్తారో తెలుసా? ఈ విషయంపై రైల్వే నిబంధనలు, శిక్షలు ఎలా ఉన్నాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
06:47 PM (IST) Apr 22
దేశంలో నగరాలను అభివృద్ధి చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ పేరుతో పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ప్రవేశపెట్టి 10 ఏళ్లు పూర్తి అవుతోన్న తరుణంలో దీంతో దేశంలో ఎలాంటి మార్పులు వచ్చాయన్న దానిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రీసెర్చ్ నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
06:14 PM (IST) Apr 22
జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 7 మంది పర్యాటకులు గాయపడ్డారు. కాల్పుల్లో ఒకరు మరణించినట్లు సమాచారం.
పూర్తి కథనం చదవండి06:13 PM (IST) Apr 22
ఎల్ అండ్ టీ, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న 125 కిలోమీటర్ల రిషికేశ్-కర్ణప్రయాగ్ బ్రాడ్ గేజ్ రైలు మార్గం నిర్మాణంలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. భారతదేశంలోనే అతిపొడవైన 14.57 కిలోమీటర్ల సొరంగం (సొరంగం నం. 8) నిర్మాణంలో కీలక ముందడుగు పడింది.
05:53 PM (IST) Apr 22
Rohit sharma: శిఖర్ ధావన్ 6,769 పరుగుల రికార్డును బద్దలుకొడుతూ ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ నిలిచాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ. అతను ప్రస్తుతం 8326 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
పూర్తి కథనం చదవండి05:48 PM (IST) Apr 22
ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆస్పత్రి వైద్యులు అసాధారణ శస్త్రచికిత్స చేసి, పశ్చిమబెంగాల్‌కు చెందిన వృద్ధుడి ప్రాణాలు కాపాడారు. అతడి సొంత మూత్రపిండాన్నే శరీరంలో ఒకచోటు నుంచి మరోచోటుకు మార్చడంతోపాటు... పూర్తిగా పాడైపోయిన మూత్రనాళం స్థానంలో అపెండిక్స్ ఉపయోగించి అతడి కిడ్నీల పనితీరును సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
05:38 PM (IST) Apr 22
సౌదీ అరేబియా పర్యటనలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఏ దేశాధినేతకు దక్కని గౌరవం మన ప్రధానికి లభించింది. సౌదీ గగనతలంలోకి మోదీ ప్రయాణించే విమానం ప్రవేశించగానే అరుదైన ఘటన చోటుచేసుకుంది.
పూర్తి కథనం చదవండి
05:26 PM (IST) Apr 22
Smiling Depression: మీ మనసులో ఎంత బాధ ఉన్నా దాన్ని ఇతరులకు కనబడకుండా నవ్వుతో కప్పేస్తున్నారా? ఇది ఒక ఆరోగ్య సమస్య అని మీకు తెలుసా? భవిష్యత్తులో ఇది మీ ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కోసారి ఆత్మహత్యకు కూడా ప్రేరేపిస్తుంది. ఈ ఆరోగ్య సమస్యను ఎలా అధిగమించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి04:52 PM (IST) Apr 22
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి బిగ్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఏపీ ఫార్ములాను ఫాలో అవుతోంది... ప్రతిపక్షాలన్నింటిని ఏకంచేసి అధికార డిఎంకేను గద్దెదించాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మరో ప్లాన్ చేసింది... ఏపీ నుండి మరో ఎంపీకి కేంద్రమంత్రివర్గంలో తీసుకునే యోచనలో ఉందంట. ఏపీ ఎంపీకి కేంద్ర మంత్రిపదవి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కనెక్షన్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి04:13 PM (IST) Apr 22
Clay Pot: వేసవిలో మట్టికుండలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. నీళ్లు తీసుకొనేటప్పుడు గాని, శుభ్రం చేసేటప్పుడు కాని కుండలో చేయి పెట్టకూడదని మీకు తెలుసా? దీని వెనుక శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
03:34 PM (IST) Apr 22
తెలుగు రాష్ట్రాల ప్రజలు మరో నెలరోజులపాటు జాగ్రత్తగా ఉండాల్సిందే. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు వర్షాలు, ఈదురుగాలులు, పిడుగల ప్రమాదం పొంచివుంటుంది. కాబట్టి పగలే కాదు సాయంత్రం, రాత్రి సమయాల్లో కూడా ఇళ్లనుండి బయటకు వెళ్లలేని పరిస్థితి. ఈ రెండ్రోజులు కూడా ఎండావాన పరిస్థితులు ఉండనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పూర్తి కథనం చదవండి03:15 PM (IST) Apr 22
01:53 PM (IST) Apr 22
Telangana Inter Results: తెలంగాణ ఇంటర్‌మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. తొలి ఏడాది విద్యార్థుల ఉత్తీర్ణత 66.89 శాతం, రెండో ఏడాది 71.37 శాతం మంది పాసైనట్లు భట్టి విక్రమార్క తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది పెరిందన్నారు. దీంతోపాటు ఈ ఏడాది ఫలితాల్లో అమ్మాయిదే హవా కొనగిందని అన్నారు.
01:46 PM (IST) Apr 22
అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ నాలుగు రోజుల భారత పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో కీలక భేటీ నిర్వహించిన జేడీ వాన్స్ రెండో రోజు పర్యటనలో భాగంగా జైపూర్ ను సందర్శించారు. భార్య ఉషా వాన్స్, పిల్లలతో కలిసి జైపూర్‌లోని ఆమెర్ కోటను సందర్శించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి..
పూర్తి కథనం చదవండి01:18 PM (IST) Apr 22
ఇంట్లో సాలె పురుగులు ఉండటం చాలా కామన్. ఇవి ఎక్కడపడితే అక్కడ ఈజీగా పెరుగుతాయి. ముఖ్యంగా అపరిశుభ్రంగా ఉన్న చోట విపరీతంగా గూళ్లు కడతాయి. ఇంట్లో సాలె పురుగులు ఉంటే విష కీటకాలు ఇంట్లోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని ఇంట్లోంచి బయటకు పంపించడానికి, కొత్తవి రాకుండా ఉండటానికి కొన్ని సింపుల్ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి12:54 PM (IST) Apr 22
Virat Kohli and Anushka Sharma dance video goes viral: దుబాయ్‌లో షూటింగ్ సమయంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట అభిమానులను అలరించారు. ఈ స్టార్ కపుల్ డాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత, కెమిస్ట్రీ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
పూర్తి కథనం చదవండి12:34 PM (IST) Apr 22
Shubman Gill breaks Virat Kohli's record: ఐపీఎల్ లో గిల్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. 25 ఏళ్ల వయస్సులో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సెంచరీలు, హాఫ్ సెంచరీలు కొట్టిన ప్లేయర్ గా శుభ్‌మన్ గిల్ రికార్డు సాధించాడు. 25 సంవత్సరాల 225 రోజులు వయస్సులో గిల్ 4 ఐపీఎల్ సెంచరీలు, 27కు పైగా హాఫ్ సెంచరీలు సాధించాడు. అలాగే, విరాట్ కోహ్లీ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.
12:33 PM (IST) Apr 22
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక చర్చలకు తొలిసారి అంగీకరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చల తర్వాత 30 రోజుల పాక్షిక యుద్ధ విరమణకు కూడా ఆయన అంగీకరించారు. దీంతో గత మూడేళ్లుగా కొనసాగుతోన్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడనుందా అన్న వార్త ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది..
పూర్తి కథనం చదవండి12:10 PM (IST) Apr 22
Jagapathi Babu: హీరో, విలన్ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడు జగపతిబాబు.. ఆయన అందరికీ సూపరిచితులే. లెజెండ్ సినిమా దగ్గరి నుంచి రంగస్థలం... నిన్న మొన్న విడుదలైన పుష్ప-2 వంటి సినిమాల్లో విలన్‌గా నటించి అందరినీ మెప్పిస్తున్నారు. ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగి.. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో వెంటనే ప్రతినాయకుడి సక్సెస్‌ను అందుకుని తన జర్నీని విజయవంతంగా కొనసాగిస్తున్నారు జగపతిబాబు. ఇక ఆయన నటన, సినిమాల ప్రస్తావన పక్కనపెడితే.. నిజ జీవితంలో ముక్కుసూటి మనిషి, ఎవడేమనుకున్నా ఉన్నది ఉన్నట్లు చెప్పేయడం అలావాటు. ఆయన రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తన పెద్ద కూతురికి పెళ్లిచేసి తప్పుచేశానని సంచలన కామెంట్లు చేశారు. రెండో అమ్మాయికి పెళ్లి చేయనని అంటున్నారు. ఆయన అలా ఎందుకన్నారంటే..
11:49 AM (IST) Apr 22
మే నెలలో గురు గ్రహ సంచారం జరగనుంది. దీంతో కొన్ని రాశుల వారికి రాజయోగం రానుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా 4 రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. నవపంచమ రాజయోగం, శని-రాహు కలయిక, కుజ సంచారం, షష్ట రాజయోగం ప్రభావంతో మరికొన్ని రాశుల వారి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంతకీ ఏంటా రాశులు.? వారి జీవితాల్లో జరగనున్న మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
11:30 AM (IST) Apr 22
Shubman Gill: ఐపీఎల్ 2025లో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ 90 పరుగులు, సాయి సుదర్శన్ 52 పరుగులు, జోస్ బట్లర్ అజేయంగా 41 పరుగుల ఇన్నింగ్స్ లతో గుజరాత్ టైటాన్స్ మరో సూపర్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో అద్భుతమైన రికార్డుతో ప్రపంచంలోనే తొలి ప్లేయర్ గా ఘనత సాధించాడు.