- Home
- Travel
- Railway Rules: రైల్లో మద్యం తాగితే జైలులో ఎన్నాళ్లు ఉండాలో తెలుసా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..
Railway Rules: రైల్లో మద్యం తాగితే జైలులో ఎన్నాళ్లు ఉండాలో తెలుసా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..
Railway Rules: ఇప్పుడు పెగ్గు పడందే ఏ పనీ చేయలేనంతగా కొంత మంది జనం తయారవుతున్నారు. మరి రైళ్లలో మద్యం తాగి ప్రయాణిస్తే ఎలాంటి శిక్ష విధిస్తారో తెలుసా? ఈ విషయంపై రైల్వే నిబంధనలు, శిక్షలు ఎలా ఉన్నాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో భారతీయ రైల్వే నాల్గవ స్థానంలో ఉంది. ప్రయాణీకులకు సౌకర్యాలు కల్పించడంలో భారతీయ రైల్వే ఎప్పుడూ ముందుంటుంది. అయితే ట్రైన్స్ లో ప్రయాణించాలంటే రైల్వే శాఖ కూడా ప్రయాణికులకు కొన్ని నిబంధనలు పెట్టింది. వాటిని ఫాలో అవ్వని ఏ ప్రయాణికులైనా రైల్వే శాఖ నిబంధనల ప్రకారం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మద్యం తాగి ప్రయాణించినా, రైలులోనే మద్యం తాగినా ఎలాంటి శిక్ష పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రైల్లో నిషేధిత వస్తువులు
ఇండియన్ రైల్వేస్ రూల్స్ ప్రకారం స్టౌస్టవ్‌లు, గ్యాస్ సిలిండర్లు, మండే రసాయనాలు, బాణసంచా, యాసిడ్స్, జంతు చర్మాలు, గ్రీజు, సిగరెట్లు, పేలుడు పదార్థాలను రైళ్లలో తీసుకెళ్లకూడదు. రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణీకులెవ్వరూ మద్యం తాగి లేదా మత్తు పదార్థాలు తీసుకొని రైలులో ప్రయాణించకూడదు.
రైల్వే చట్టం ఏం చెబుతోంది?
1989 రైల్వే చట్టం సెక్షన్ 165 కింద మద్యం తాగి ప్రయాణించే వారిపై కఠినమైన చట్టాలు ఉన్నాయి. ప్రయాణికులు ఎవరైనా మద్యం తాగి ఇతర ప్రయాణీకులను ఇబ్బంది పెట్టినా, రైలులో గాని, రైల్వే ఆవరణలో గాని ఇతరులను వేధించడానికి ప్రయత్నించినా వారి టికెట్‌ను అధికారులు వెంటనే రద్దు చేస్తారు. సదరు ప్రయాణీకుడు రైల్వే పాస్ కలిగి ఉంటే వారి పాస్‌ను కూడా రద్దు చేస్తారు. అతను దోషిగా తేలితే ఆ వ్యక్తికి 6 నెలల వరకు జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా కూడా విధిస్తారు.
ఇతర మత్తు పదార్థాలు తీసుకెళితే శిక్ష ఏంటి?
ప్రయాణికులు ఎవరైనా రైలులో నిషేధిత వస్తువులతో ప్రయాణిస్తూ పట్టుబడితే 1,000 రూపాయల జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఒక్కోసారి రెండూ కలిపి విధించే అవకాశం కూడా ఉంటుంది.
నిషేధిత వస్తువుల వల్ల రైల్వే ఆస్తికి ఏదైనా నష్టం జరిగితే ఆ ప్రయాణీకుడే ఆ నష్టానికి చెల్లించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి చాలామందికి తెలియని 5 అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఇవిగో