MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Weather : తెలుగు ప్రజలకు హెచ్చరిక ... ఈ రెండ్రోజులు పగలూ రాత్రి రోడ్లపైకి రాకండి, ఎందుకో తెలుసా?

Weather : తెలుగు ప్రజలకు హెచ్చరిక ... ఈ రెండ్రోజులు పగలూ రాత్రి రోడ్లపైకి రాకండి, ఎందుకో తెలుసా?

తెలుగు రాష్ట్రాల ప్రజలు మరో నెలరోజులపాటు జాగ్రత్తగా ఉండాల్సిందే. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల ప్రమాదం పొంచివుంటుంది. కాబట్టి పగలే కాదు సాయంత్రం, రాత్రి సమయాల్లో కూడా ఇళ్లనుండి బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఈ రెండ్రోజులు కూడా ఎండావాన పరిస్థితులు ఉండనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 22 2025, 03:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Weather

Weather

Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం విచిత్రంగా కనిపిస్తోంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోతున్నాయి... సాయంత్రం అయ్యిందంటే చాలు ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నారు. హైదరాబాద్ తో సహా చాలాజిల్లాల్లో ప్రతిరోజు ఇదే తంతు. మండు వేసవిలో వర్షాలు కాస్త ఊరటనిస్తున్నా వడగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చెదురుమదురు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. మరో రెండ్రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. చిరుజల్లులతో పాటు ఈదురుగాలులు వీయడం, పిడుగులు పడే ప్రమాదం ఉందని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వడగళ్ల వానలు పడే అవకాశాలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Telangana Rains

Telangana Rains

తెలంగాణలో వర్షాలు :  

తెలంగాణలో ఈ రెండ్రోజులు తేలికపాటి నుండి అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 22,23 (మంగళ, బుధవారం) వర్షాలు కొనసాగుతాయి. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈదురుగాలులు మొదలవుతాయని... ఉరుములతో కూడిన చిరుజల్లులు ప్రారంభం అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.  
 

35
Telangana Weather

Telangana Weather

తెలంగాణలో ఎండలు : 

తెలంగాణలో వర్షాలు కురుస్తున్నా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గదని వాతావరణ శాఖ ప్రకటించింది. రోజురోజుకు ఎండలు మరింత మండిపోతూ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి... ఆదిలాబాద్ లో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇలా ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 

ఇప్పుడున్న ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని... ఉక్కపోత కూడా తారాస్థాయికి చేరుతుందని ప్రకటించారు. రానున్న రోజుల్లో మరో 2 నుండి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అంటే ఈ వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నమాట. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 

45
Andhra Pradesh Weather

Andhra Pradesh Weather

ఏపీలో ఎండావాన :  

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని... పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరించారు. ఈ వర్షాలతో పాటు ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. 

ఇప్పటికే ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.  తిరుపతిలో గరిష్టంగా 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక నంద్యాల, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, పల్నాడు, కడప జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండల తీవ్రత మరింత పెరిగి రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు పెరుగుతాయని... తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

55
Summer Rains

Summer Rains

 వేసవిలో వర్షాలెందుకు కురుస్తున్నాయంటే...

తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో మండు వేసవిలో వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ద్రోణి ఈశాన్య మధ్యప్రదేశ్ నుండి విదర్భ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మీదుగా కొనసాగుతోందని... ఇది సముద్ర మట్టానికి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపారు. ఈ ద్రోణి ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved