MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • LSG vs DC: 27 కోట్ల దెబ్బ‌.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ చేతిలో ల‌క్నో అందుకే ఓడిపోయింది !

LSG vs DC: 27 కోట్ల దెబ్బ‌.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ చేతిలో ల‌క్నో అందుకే ఓడిపోయింది !

IPL 2025 LSG vs DC: ఐపీఎల్ 2025 లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో ఓడించింది. ల‌క్నో ఓపెన‌ర్లు ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్ తప్ప మిగ‌తా ప్లేయ‌ర్లు రాణించ‌లేదు. రూ.27 కోట్ల రిష‌బ్ పంత్ మ‌రోసారి విఫ‌ల‌మ‌య్యాడు. కేఎల్ రాహుల్, అభిషేక్ పొరేల్, అక్ష‌ర్ ప‌టేల్ సూప‌ర్ నాక్ ల‌తో ల‌క్నో హోం గ్రౌండ్ లో ఢిల్లీ విక్ట‌రీ కొట్టింది. 

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 22 2025, 11:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

IPL 2025 LSG vs DC: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2025లో భాగంగా 40వ మ్యాచ్ లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో అద‌ర‌గొడుతూ ఢిల్లీ క్యాపిట‌ల్స్ ల‌క్నో టీమ్ కు షాకిచ్చింది. త‌న‌ను వ‌ద్ద‌నుకున్న ఫ్రాంఛైజీ టీమ్ పై కేఎల్ రాహుల్ అద్భుమైన ఆట‌తో ఢిల్లీ జ‌ట్టు కోసం విన్నింగ్ ప‌రుగులు కొట్టాడు. త‌న‌ను అవ‌మానించిన గ్రౌండ్ లోనే బ్యాట్ తో స‌మాధానమిచ్చాడు. 

ల‌క్నోలోని  భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌పై 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే ఢిల్లీ అందుకుంది. ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన అభిషేక్ పోరెల్ 51 పరుగులు, కేఎల్ రాహుల్ 57 పరుగులు, అక్షర్ పటేల్ నాటౌట్‌గా నిలిచి ఢిల్లీకి విజ‌యాన్ని అందించారు. 

25

పవర్ ప్లేలో ఢిల్లీకి మంచి ఆరంభం ల‌భించింది. 6 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 54 పరుగులకు చేరుకుంది. కరుణ్ నాయర్ 9 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన కేఎల్ రాహుల్ నెమ్మ‌దిగా ప్రారంభించి దూకుడు పెంచాడు. అభిషేక్ పోరెల్ తో క‌లిసి ఢిల్లీ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు.

అభిషేక్ పోరెల్ 36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ తో 51 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో దృఢంగా నిలిచిన రాహుల్ ఓపికగా ఆడుతూ చివ‌రి వ‌ర‌కు క్రీజులో ఉండి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. కేఎల్ రాహుల్ 3 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 57 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు. కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ 20 బంతుల్లో 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

35

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కు ఓపెన‌ర్లు మంచి ఆరంభం అందించారు. ఐడెన్ మార్క్రామ్ 2 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 52 ప‌రుగులు ఇన్నింగ్స్ ను ఆడాడు. మ‌రో ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ 3 ఫోర్లు, 1 సిక్స‌ర్ తో 45 ప‌రుగులు చేసి అవుట్ అయ్యాడు. వీరిద్ద‌రూ అవుట్ అయిన త‌ర్వాత మిగ‌తా ప్లేయ‌ర్లు పెద్ద‌గా రాణించ‌లేక‌పోయారు.

27 కోట్ల రూపాయ‌ల ప్లేయ‌ర్ అయిన రిష‌బ్ పంత్ ఒక్క ప‌రుగు కూడా చేయ‌లేదు. చివ‌ర‌లో ఆయూష్ బ‌దోని దూకుడుగా ఆడి 36 ప‌రుగులు చేయ‌డంతో 20 ఓవ‌ర్ల‌లో ల‌క్నో జ‌ట్టు 6 వికెట్లు కోల్పోయి 159 ప‌రుగులు చేసింది. 

45

ఐపీఎల్ లో అత్యంత ఖ‌రీదైన ప్లేయ‌ర్ గా, కెప్టెన్ గా ఉన్న రిష‌బ్ పంత్ ఈ మ్యాచ్ లో స‌హ‌నం కోల్పోయిన‌ట్టు క‌నిపించాడు. టీమ్ లోని ప్లేయ‌ర్ల‌పై గ్రౌండ్ లో అరుస్తూ క‌నిపించాడు. అలాగే, ల‌క్నో ఓట‌మికి కార‌ణం అయ్యేలా మారింది పంత్ తీసుకున్న ఒక‌ బిగ్ డిసెష‌న్. ల‌క్నో టీమ్ కు మిచెల్ మార్ష్‌, మార్క్రామ్ లు అద్భ‌త‌మైన ఆంరంభం అందించారు.

కానీ, మార్క్రామ్ అవుట్ అయిన త‌ర్వాత రిష‌బ్ పంత్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు రాకుండా అబ్దుల్ స‌మ‌ద్, ఆ త‌ర్వాత డేవిడ్ మిల్ల‌ర్ల‌ను ముందుగా  బ్యాటింగ్ కు పంపాడు. చివ‌రి ఓవ‌ర్ లో క్రీజులోకి వ‌చ్చిన రిష‌బ్ పంత్  ఒక్క ప‌రుగు కూడా చేయ‌కుండానే పెవిలియ‌న్ కు చేరాడు. దీంతో పంత్ పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 

55
KL Rahul (Photo- IPL)

KL Rahul (Photo- IPL)

ల‌క్నో పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానికి చేరుకుంది. డీసీ 8 మ్యాచ్ లు ఆడి వీటిలో 6 మ్యాచ్ ల‌ను గెలుచుకుని 12 పాయింట్లు సాధించింది. మ‌రో రెండు మ్యాచ్ ల‌ను కోల్పోయింది.

టాప్ లో ఉన్న గుజ‌రాత్ టైటాన్స్ కు కూడా 12 పాయింట్లు ఉన్నాయి కానీ, నెట్ ర‌న్ రేటు మెరుగ్గా ఉండ‌టంతో టాప్ ప్లేస్ ను ద‌క్కించుకుంది. మూడో నాలుగు స్థానాల్లో వ‌రుస‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు ఉన్నాయి. ల‌క్నో టీమ్ 10 పాయింట్ల‌తో 5వ స్థానంలో ఉంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Tim David : ఇది కదా ఊరమాస్ అంటే! ఒకే ఓవర్‌లో 30 రన్స్.. 8 సిక్సర్లతో చెన్నై బెంబేలు !
Recommended image2
Tim David : టిమ్ డేవిడ్ సిక్సర్ల సునామీకి బెంగళూరు షేక్ ! కొడితే స్టేడియం బయటపడ్డ బంతి
Recommended image3
Rishabh Pant : లక్నో కెప్టెన్ లగ్జరీ లైఫ్.. రిషబ్ పంత్ నెట్ వర్త్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved