Apr 25, 2025, 12:04 AM IST
Telugu news live updates: RCB vs RR: రాజస్థాన్ రాయల్స్ పై ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ


జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. ఇక ఉగ్రదాడుల వెనకాల పాకిస్థాన్ ఉందన్న కేంద్రం పాకిస్థాన్ పై ఆంక్షలు విధించింది. దీంతో పాటు ఈరోజు ఐపీఎల్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
12:04 AM
RCB vs RR: రాజస్థాన్ రాయల్స్ పై ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ
IPL 2025 RCB vs RR: విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ సూపర్ బ్యాటింగ్ తో పాటు జోష్ హాజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్ తో ఐపీఎల్ 42వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.
పూర్తి కథనం చదవండి11:19 PM
RCB vs RR: టీ20 క్రికెట్ లో కింగ్ కోహ్లీ మరో రికార్డు
IPL 2025 RCB vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో విరాట్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. వరుస హాఫ్ సెంచరీలతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కోసం కీలక ఇన్నింగ్స్ లను ఆడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 70 పరుగులు సూపర్ నాక్ ఆడి టీ20 క్రికెట్ లో మరో రికార్డు సాధించాడు.
10:32 PM
నేతన్యాహు పహల్గాం దాడిని ఖండించారు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఆయన భారత్ కు పూర్తి మద్దతును ప్రకటించారు.
పూర్తి కథనం చదవండి
10:00 PM
Highest Paid Director: సినిమాకు రూ.200 కోట్లు పారితోషికం తీసుకుంటున్న తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా?
Highest Paid Director: సినిమా హీరోకి భారీ పారితోషికాలు ఇవ్వడం మనం ఇప్పటి వరకు చూశాం. కానీ ట్రెండ్ మారింది. ప్రస్తుతం సినిమా హీరోకి ఎంత ప్రాధాన్యం ఉందో దర్శకుడికి అదే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నేటి నిర్మాతలు. హీరోకి రూ.50, 100, 200 కోట్లు ఇవ్వడం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి జరుగుతున్నదే.. కానీ ఓ తెలుగు డైరెక్టర్ హీరోలకు తక్కువ కాకుండా పారితోషికం తీసుకుంటున్నాడట. అదీ కూడా రూ.200 కోట్లకు తగ్గేదేలే అంటున్నాడట. మరి ఆ డైరెక్టర్ ఎవరో తెలుసుకుందామా?
పూర్తి కథనం చదవండి9:57 PM
India vs Pakistan : భారత్ vs పాకిస్తాన్.. ఎవరి సైన్యం బలంగా ఉంది?
India vs Pakistan Military Comparison 2025: కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మంది గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటన వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని అనుమానాల మధ్య భారత్ తీవ్రంగా స్పందిస్తోంది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. యుద్ధవాతావరణం కనిపిస్తోంది. అయితే, భారత్-పాకిస్తాన్ దేశాల సైన్యం, బలాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
9:54 PM
Pahalgam Terror Attack : ఇక తగ్గేదేలే... మోదీ సర్కార్ కు అన్నిపార్టీల సపోర్ట్
పహల్గాం ఉగ్రదాడి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీల సలహాలు, సూచనలతో ముందుకు వెళ్లేందుకు సిద్దమయ్యింది. ఇందుకోసం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో అన్ని పార్టీలు కేంద్రానికి తమ పూర్తి మద్దతు ప్రకటించాయి.
పూర్తి కథనం చదవండి
9:30 PM
Prabhas Kalki 2: 'కల్కి 2' మ్యాజిక్ కోసం ఎదురుచూస్తున్నానన్న ప్రభాస్.. నాగ్ అశ్విన్ ఫన్నీ రిప్లై!
Prabhas Kalki 2:
పూర్తి కథనం చదవండి9:09 PM
Pahalgam Terrorist Attack : ఈ ఫోటోలోని రాక్షసుల ఆఛూకీ చెబితే... లక్షలకు లక్షలు మీ సొంతం
పహల్గాంలో మారణహోమం సృష్టించిన ముగ్గురు ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరు పాకిస్థానీ, ఒక స్థానిక ఉగ్రవాదిని గుర్తించారు.వీరి ఆఛూకీ తెలిపినవారికి భారీ రివార్డు ప్రకటించారు. ఎంతో తెలుసా?
పూర్తి కథనం చదవండి9:04 PM
NTR Pathala Bhairavi:
NTR Pathala Bhairavi: విశ్వవిఖ్యాత నట సౌర్వభౌమి నందమూరి తారక రామారావు తెలుగు ఇండస్ట్రీ ఇలవేల్పుగా చెబుతుంటారు. తెలుగు సినిమాని దేశంలో నలుమూలలకు విస్తరించిన వారిలో ఆయన ప్రథములు. తెలుగు భాషపై ఎన్టీఆర్‌కు ఎనలేని గౌరవం అభిమానం. ప్రస్తుతం భౌతికంగా లేకపోయినప్పటికీ.. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలను ఎప్పటికీ గుర్తుంటాయి. పౌరాణిక పాత్రలు చేయడంతో ఎన్టీఆర్‌కు ఎవరూ పోటీ లేరన్నది వాస్తవం. అలాంటి సినిమాల్లో ఓ క్లాసిక్ పిక్చర్‌కు రీసెంట్‌గా అరుదైన గౌరవం దక్కింది.
పూర్తి కథనం చదవండి8:00 PM
Zodiac sign: ఈ రాశుల వారు కోపిష్టులు.. నోరి తెరిస్తే కస్సు, బుస్సుమంటారు.
ఒక్కో మనిషి ఒక్కో స్వభావం కలిగి ఉంటారు. కొందరు చాలా సున్నితంగా, మర్యాదగా, ప్రశాంతంగా ఉంటారు. మరికొందరు మాత్రం చాలా కోపిష్టులుగా ఉంటారు. నిత్యం కస్సుబుస్సుమంటారు. అయితే మనిషి వ్యక్తిత్వం అతని రాశిపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కొన్ని రాశుల వారు నిత్యం కోపంతో ఊగిపోతుంటారని అంటారు. ఇంతకీ ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
7:56 PM
Hyderabad High Alert : కేంద్ర నిఘావర్గాల హెచ్చరిక ... తెలంగాణలో హైఅలర్ట్
పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో దేశంలో భద్రతను కట్టుదిట్టం చేసారు. ఈ క్రమంలో తెలంగాణను హైఅలర్ట్ చేసాయి కేంద్ర నిఘా వర్గాలు. ముఖ్యంగా హైదరాబాద్ లో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాష్ట్ర పోలీసులకు సూచించారు.
పూర్తి కథనం చదవండి7:13 PM
Ishan Kishan: ఇషాన్ కిషన్ కు మైండ్ దొబ్బింది.. వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్
Ishan Kishan's Brain Fade Dismissal: అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్ లేకపోయినా క్రీజును వదిలి నడుచుకుంటూ వెళ్లిపోయిన ఇషాన్ కిషన్ 'బ్రెయిన్ ఫేడ్' అవుట్‌పై భారత మాజీ ఢాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఘాటుగా స్పందించాడు. ఇషాన్ కిషన్ నిర్ణయాన్ని సెఅంపైర్ పాత్రను నొక్కి చెప్పారు. మైండ్ దొబ్బిందా అంటూ ఫైర్ అయ్యాడు.
పూర్తి కథనం చదవండి6:53 PM
India Pakistan Conflict : బరితెగించిన పాక్ ... భారత జవాన్ ను బంధించి కవ్వింపు చర్యలు
పహల్గాం ఉగ్రదాడిలో పాక్ హస్తం ఉందని భావిస్తున్న భారత్ ఆ దేశంపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ కవ్వింపు చర్యలు చేపడుతోంది. తాజాగా భారత ఆర్మీకి చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జవానును పాకిస్థాన్ ఆర్మీ అక్రమంగా బంధించింది.
పూర్తి కథనం చదవండి
5:43 PM
రెచ్చగొట్టేలా పాక్ చర్యలు ...భారత్ పై విధించిన ఆంక్షలివే
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇరుదేశాలు ఒకరిపై ఒకరు ఆంక్షలు విధించుకున్నాయి. తాజాగా భారత్ పై పాక్ ఆంక్షలు విధించింది... వాటిగురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
5:33 PM
Water Melon: డయాబెటిస్ ఉన్న వారు పుచ్చకాయ తినొచ్చా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవి కాలం వచ్చిందంటే మనం గుర్తుచేసుకునే మొదటి పండు పుచ్చకాయే. రోడ్డుపై ఎక్కడ చూసినా పుచ్చకాయ దర్శనమిస్తాయి. రుచికి తియ్యగా ఉండడంతో పాటు శరీరాన్ని చల్లబరుస్తుంది. అయితే పుచ్చకాయ విషయంలో మనలో కొంత మందికి అనుమానాలు ఉంటాయి. అందులో ఒక అనుమానం గురించి, అందులో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
4:43 PM
పాక్ పౌరుల వీసాలన్ని రద్దు... డెెడ్ లైన్ విధించిన భారత్... మరి పాక్ విద్యార్థుల పరిస్థితేంటి?
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ ఉద్రిక్తత పెరగడంతో భారతీయ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న పాకిస్థానీ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వీసా నిబంధనలు కఠినతరం కావడంతో ఇప్పటికే అడ్మిషన్ పొందిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాకిస్థానీలకు వీసాల రద్దు నిర్ణయం విద్యార్థులపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది.
పూర్తి కథనం చదవండి3:50 PM
Silver: మీరు కొంటున్న వెండి అసలా.? నకిలీనా.? ఐస్ క్యూబ్‌తో తెలుసుకోవచ్చు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇక భవిష్యత్తులో వెండికి భారీగా డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో చాలా మంది వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. పలు రంగాల్లో వెండి వినియోగం పెరగనుందన్న వార్తలతో వెండిపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే మీరు కొంటున్న వెండి ఎంత వరకు నాణ్యమైందన్న విషయం ఎప్పుడైనా ఆలోచించారా.? వెండి నాణ్యతను ఐస్ క్యూబ్ సహాయంతో తెలుసుకోవచ్చని మీకు తెలుసా.. అదేలాగంటే..
3:48 PM
NC Classic 2025: నీరజ్ చోప్రా ఆహ్వానం తిరస్కరించిన అర్షద్ నదీమ్
Arshad Nadeem declines Neeraj Chopra's invitation: పాకిస్తాన్ జావెలిన్ స్టార్ అర్షద్ నదీమ్ బెంగళూరులో జరగనున్న NC క్లాసిక్ 2025 అథ్లెటిక్స్ ఈవెంట్‌కు హాజరు కావడం లేదు. భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ఆహ్వానికి నో చెప్పాడు. ఎందుకు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
3:38 PM
ఉగ్రమూకలపై వేగంగా ప్రతీకారం తీర్చుకునే టాప్ 5 దేశాలు... భారత్ స్థానమెంత?
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ఉగ్రవాదులను పెంచిపోషిస్తూ భారత్ పై ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ కు తగిన బుద్ది చెప్పేందుకు సిద్దమయ్యింది. ఇలా తమదేశంలో హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ అలజడికి కారణమవుతున్న శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడంలో చాలా దేశాలు కఠినంగా వ్యవహరిస్తుంటారు... చాలా వేగంగా కౌంటర్ అటాక్ కు దిగుతుంటాయి. ఇలా వెంటనే రియాక్ట్ అయ్యే దేశాలేవి? భారతదేశం ఏ స్ధానంలో ఉంది? ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
3:13 PM
IND vs PAK: ద్వైపాక్షిక సిరీస్‌లు వుండవు.. పాకిస్తాన్ కు షాకిచ్చిన భారత్.. బీసీసీఐ సంచలన నిర్ణయం
No Bilateral Series With Pakistan: చివరిసారిగా భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ 2012-2013 జరిగింది. పాక్ భారత్ వచ్చి ఆడింది. టీమిండియా చివరిసారిగా 2008లో పాకిస్తాన్ లో పర్యటించింది. ప్రస్తుతం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ లో మాత్రమే తలపడుతున్నాయి.
3:01 PM
బ్యాంకులో రూ.50 వేలు మించి డిపాజిట్ చేస్తే మీకు నోటీసు తప్పదు. ఎందుకంటే..
Bank Deposit Rules: మీ దగ్గర ఉన్న డబ్బంతా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారా? అయితే మీకు బ్యాంకుల నుంచి నోటీసులు రావడం ఖాయం. ఇప్పుడు డిపాజిట్ రూల్స్ మారిపోయాయి. మీరు జస్ట్ రూ.50 వేలు డిపాజిట్ చేసినా ఆధారాలు చూపించాలి. మారిన డిపాజిట్ రూల్స్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి2:54 PM
India-Pakistan: పాక్‌కు ఊహించని షాక్ ఇవ్వబోతున్న భారత్.. సింధూ జాలాలు లలు అడ్డుకుని భారీ స్కెచ్!
India-Pakistan: ఇండియా ఎప్పుడూ యుద్దం కోరుకోదు.. చాలా సహనంగా వ్యవహరిస్తుంటుంది. పాకిస్థాన్ గతంలో కవ్వింపు చర్యలకు పాల్పడి, పలువురు జవాన్లను చంపినా చూసీచూడనట్లుగా వదిలేసింది. కానీ జమ్మూలో పర్యాటకులను ఉగ్రవాదులు హతమార్చిన తర్వాత పాక్‌పై ప్రతికారానికి సిద్దమైంది. అయితే.. అందరూ ఊహించినట్లు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేయడం వంటి చర్యలు కాదు..! అంతకుమించిన ప్లాన్ భారత్ వేస్తోంది. ఈ దెబ్బతో పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సింధూ జలాల పంపిణీ ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం.
2:46 PM
అజిత్, షాలిని 25వ వివాహ వార్షికోత్సవం.. ఆమె చేతికి గాయం కావడంతో, ఇద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైందంటే
నటుడు అజిత్ కుమార్, నటి షాలినిల వివాహం జరిగి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈరోజు వారి 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
పూర్తి కథనం చదవండి2:38 PM
Pm Modi: ఎప్పుడూ హిందీ మాట్లాడే మోదీ.. ఇంగ్లిష్‌లో ఎందుకు మాట్లాడారు? పీఎం మాస్ వార్నింగ్
బిహార్ లోని మధుబనిలో నిర్వహించిన పబ్లిక్ మీటింగ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడిపై మోదీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఇంగ్లిష్ లో మాట్లాడుతూ. ఒక హెచ్చరిక చేశారు. మోదీ ఏం మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి2:31 PM
Viral Video : పహల్గాం ఉగ్రదాాడి ... దేశ రాజధాని డిల్లీలో పాక్ సంబరాలు జరుపుకుందా?
పాకిస్తాన్ హైకమిషన్‌కి కేక్ తీసుకెళ్తున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపింది. పహల్గాం దాడి తర్వాత బయటకు వచ్చిన ఈ వీడియో దేశ రాజధాని డిల్లీలోనే పాక్ సంబరాలు జరుపుకుందనే ఆరోపణలకు దారితీసింది.
పూర్తి కథనం చదవండి2:05 PM
Modi Amaravati Visit: రాజధాని అమరావతి కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా? మోదీ ఆశ్చర్యపోయేలా!
Modi Amaravati Visit: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ దశలో ఉంది. ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభం కాగా.. మరికొన్న ప్రధాని మోదీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే.. అమరావతి రాజధాని ప్రతిపాదన 2014లోనే టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. దాదాపు పదేళ్లపాటు అసలు అమరావతి అభివృద్ది కోసం ఎంత నిధులు కేటాయించారు. ఏ ఏ పనులు చేపట్టారు అనేది తెలుసుకుందాం.
1:32 PM
PM Modi: కలలో ఊహించని శిక్ష తప్పదు.. ఉగ్రదాడిపై స్పందించిన మోదీ
పహల్గాం దాడి తర్వాత మోదీ మధుబనిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ మోదీ ఏమన్నారంటే..
పూర్తి కథనం చదవండి1:07 PM
పాకిస్తానీ నటుడితో రొమాన్స్, వాణి కపూర్ సినిమాపై నిషేధం
పహల్గాం దాడి నేపథ్యంలో ఫవాద్ ఖాన్, వాణీ కపూర్ నటించిన 'అబీర్ గులాల్' సినిమా భారత్‌లో నిషేధానికి గురైంది. ఈ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత, చిత్ర పరిశ్రమ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి కథనం చదవండి
1:07 PM
Telangana Inter: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ తేదీల విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే!
Telangana Inter: తెలంగాణ ఇంటర్ బోర్డ్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించింది. మే 22 నుంచి 29 వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
12:18 PM
హీరోయిన్ త్రిషతో పాటు రెండు నెలలు పహల్గాంలోనే ఉన్న స్టార్ హీరో.. ఎందుకో తెలుసా ?
కాశ్మీర్‌లోని ప్రధాన పర్యాటక ప్రదేశం పహల్గాంలో విజయ్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం చిత్రీకరించబడింది. ఆ సినిమా ఏంటో చూద్దాం.
పూర్తి కథనం చదవండి11:56 AM
Pahalgam Attack: పాక్ సైన్యాధిపతిని లాడెన్‌తో పోల్చిన అమెరికా..
జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని యావత్ ప్రపంచం ఖండిస్తోంది. అమెరికా, చైనా, యూకేతో పాటు మరికొన్ని దేశాలు ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా తప్పుబట్టాయి. భారత్ కు తమ మద్ధతు ఉంటుందని ప్రకటించాయి. కాగా తాజాగా అమెరికాకు చెందిన ఓ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు..
పూర్తి కథనం చదవండి11:55 AM
India US trade: అమెరికాతో భారత్ వ్యాపార సంబంధాలు.. సుంకాలు తగ్గించేందుకు రెడీ.. ట్రంప్ వెల్లడి!
India US trade: ఇండియా తమ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన.. భారత్ పలు వస్తువులపై సుంకాలు తగ్గించనున్నట్లు చెప్పారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. అయితే.. ఎలాంటి వస్తువులపై సుంకాలు తగ్గిస్తున్నారు అన్నది మాత్రం ఇప్పటికీ స్పష్టత రాలేదన్నారు.
పూర్తి కథనం చదవండి11:16 AM
నటి పావని రెడ్డి పెళ్లి చెల్లదు అంటూ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
అమీర్ - పావని జంట వివాహం చెల్లదని వార్తలు వ్యాపించడంతో, దానిపై తమిళనాడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
పూర్తి కథనం చదవండి11:11 AM
Pahalgam Attack: పాకిస్థాన్‌ను వెలివేస్తున్న భారత్ మరో కీలక నిర్ణయం.. ఆ దేశ ఎక్స్ అకౌంట్‌పై
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి వెనకాల పాకిస్థాన్ హస్తం ఉందని బలంగా విశ్వసిస్తున్న భారత్.. పాక్ పై ప్రతికార చర్యలకు దిగుతోంది. ఇప్పటికే ఆ దేశంపై పలు నిషేధాలు విధిస్తు నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ ను వెలివేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
పూర్తి కథనం చదవండి10:59 AM
Morning Walk ఉదయం నడక.. చర్మాన్నీ మెరిపిస్తుంది!
Morning walk: ఉదయం నడక వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది అని అందరికీ తెలిసిన తెలిసిందే. గుండె సంబంధిత సమస్యలు రావు. ఫిట్ నెస్ తో ఉంటారు. ఇంకెన్నో ప్రయోజనాలు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే.. ఉదయం నడక వల్ల చర్మానికి కూడా మేలు ప్రయోజనాలు కలుగుతాయి.
పూర్తి కథనం చదవండి10:52 AM
FD Interest Rates ఈ బ్యాంకుల్లో ఎఫ్‌డిలపై అత్యధిక వడ్డీ.. మరి ఇంకెందుకు ఆలస్యం?
అత్యధిక వడ్డీ రేట్లు: రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గించడంతో అన్ని బ్యాంకులు వినియోగదారులకు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా కొన్ని చిన్న బ్యాంకులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు ఇస్తున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.
పూర్తి కథనం చదవండి10:46 AM
Pahalgam Terror Attack: ఉగ్రదాడిపై స్పందించిన బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్.. ఏమన్నారంటే.
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
పూర్తి కథనం చదవండి10:41 AM
Kitchen Hacks ఇలా చేస్తే పాలు పొంగనే పొంగవు, అన్నం అడుగంటదు!
వంటింటి చిట్కాలు: ప్రతి ఇల్లాలు వంటింట్లో ఎదుర్కొనే సమస్య పాలు పొంగిపోవడం, అన్నం అడుగంటుకోవడం. చూడటానికి ఇవి చిన్న సమస్యల్లాగే అనిపించినా.. చాాలా చిరాకు తెప్పిస్తాయి. ఇకపై వీటి గురించి చింతించాల్సిన పని లేదు. చిన్న చిన్న చిట్కాలతోనే ఈ సమస్య నుంచి తేలికగా గట్టెక్కవచ్చు.
పూర్తి కథనం చదవండి10:37 AM
Gautam gambhir: గౌతమ్ గంభీర్‌ను చంపేస్తాం.. ఉగ్రవాదుల హెచ్చరిక.
భారత క్రికెట్ ప్రధాన కోచ్, మాజీ పార్లమెంటు సభ్యుడు గౌతమ్ గంభీర్‌ని చంపేస్తామని హెచ్చరికలు వచ్చాయి. "ఐసిస్ కశ్మీర్" బెదిరింపులకు దిగారు. కశ్మీర్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇలాంటి హెచ్చరికలు రావడం అందరినీ షాక్ కి గరయ్యేలా చేసింది..
పూర్తి కథనం చదవండి10:36 AM
వేసవిలో కరెంటు బిల్లులు మోతెక్కుతున్నాయా? ఇలా చేస్తూ తగ్గించుకోవచ్చు!
బిల్లులు తగ్గించే మార్గాలు: వేసవిలో ఏసీ, కూలర్లు, ఫ్యాన్లు అదేపనిగా పని చేస్తుంటాయి. దీంతో కరెంటు బిల్లు మోత మోగిపోతుంటుంది. ఎండ నుంచి ఉపశమనానికి వాటి వాడకం ఎలాగూ తప్పదు. ఇక మనం చేయాల్సింది కరెంటు బిల్లు తగ్గించుకునే మార్గాలు వెతుక్కోవడం. ఇంకెందుకు ఆలస్యం? పదండి అవేంటో చూద్దాం.
పూర్తి కథనం చదవండి10:19 AM
Pahalgam terror attack: ఏం చేద్దాం.? ఉగ్రదాడిపై అఖిలపక్ష సమావేశం. పాక్‌కు సినిమా చూపించడం ఖాయమేనా.?
Pahalgam terror attack: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని యావత్ దేశం ఖండిస్తోంది. ఇది ముమ్మాటికీ పాకిస్థాన్ ప్రభుత్వ ప్రేపేరిత చర్యగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో అస్థిరత సృష్టించాలన్న ఉద్దేశంతో ఈ చర్యకు దిగినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ కు తగిన బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఏం చేద్దామన్న అంశాలపై గురువారం అన్ని పార్టీలతో సమావేశం కానున్నారు.
పూర్తి కథనం చదవండి9:47 AM
Rahul Gandhi: అమెరికా పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకున్న రాహుల్ గాంధీ.. ఆ సమావేశంలో పాల్గొనేందుకే
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పలువురు నాయకులు తమ కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న పలువురు కీలక నేతలు మధ్యలోనే ముగించుకొని వస్తున్నారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ సైతం తన అమెరికా పర్యటనను మధ్యలోనే ముగించుకొని భారత్ కు వచ్చారు.
పూర్తి కథనం చదవండి9:28 AM
Telangana: ఇంటి నుంచి అడుగు బయటపెట్టే ముందు ఆలోచించుకోండి.. ఓవైపు ఎండలు, మరోవైపు ఉరుములు
రోజురోజుకీ భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఏప్రిల్ నెల మొదట్లో కాస్త తక్కువగా ఉన్న ఎండలు నెల చివరికి వచ్చే సరికి మండిపోతున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. అయితే ఎండ తీవ్రత గురువారం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.