MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Sports
  • Cricket
  • Ishan Kishan: ఇషాన్ కిషన్ కు మైండ్ దొబ్బింది.. వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్

Ishan Kishan: ఇషాన్ కిషన్ కు మైండ్ దొబ్బింది.. వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్

Ishan Kishan's Brain Fade Dismissal: అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్ లేకపోయినా క్రీజును వదిలి నడుచుకుంటూ వెళ్లిపోయిన ఇషాన్ కిషన్ 'బ్రెయిన్ ఫేడ్' అవుట్‌పై భారత మాజీ ఢాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఘాటుగా స్పందించాడు.  ఇషాన్ కిషన్ నిర్ణయాన్ని సెఅంపైర్ పాత్రను నొక్కి చెప్పారు. మైండ్ దొబ్బిందా అంటూ ఫైర్ అయ్యాడు. 

Mahesh Rajamoni | Published : Apr 24 2025, 07:13 PM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Ishan Kishan

Ishan Kishan

Ishan Kishan's Brain Fade Dismissal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో బుధవారం, ఏప్రిల్ 23న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్ ఇషాన్ కిషన్ 'బ్రెయిన్ ఫేడ్' అవుట్‌ను టీమిండియా మాజీ ఓపెనర్ విరేందర్ సెహ్వాగ్ తీవ్రంగా విమర్శించారు. ఇదేం నిజాయితీ.. ఇషాన్ కిషన్ కు మైండో దొబ్బిందా... డబ్బులు తీసుకుంటున్నందుకైనా అంపైర్లను పనిచేయనియ్యాలి కదా అంటూ ఫైర్ అయ్యాడు.

26
Ishan Kishan

Ishan Kishan

ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టాపార్డర్ చెత్త బ్యాటింగ్ కారణంగా ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో ఈజీగానే విజయాన్ని అందుకుంది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీజన్‌లో ఆరో ఓటమి చవిచూసింది. హెన్రిచ్ క్లాసెన్ 71 పరుగులు, అభినవ్ మనోహర్ 43 పరుగుల ఇన్నింగ్స్ తో వీరిద్దరి మధ్య కీలకమైన 99 పరుగుల భాగస్వామ్యం రావడంతో హైదరాబాద్ టీమ్ 143/8 పరుగులు చేసింది.

ముంబై ఇండియన్స్ మరో 26 బంతులు మిగిలి ఉండగానే 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ 46 బంతుల్లో 70 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 19 బంతుల్లో 40 పరుగులతో అజేయంగా నిలిచాడు.. 

36
Ishan Kishan

Ishan Kishan

మ్యాచ్‌లో ప్రధాన చర్చనీయాంశం ఇషాన్ కిషన్ అవుట్. SRH ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్‌లో అందరినీ ఆశ్చర్యపరిచే ఘటన జరిగింది. దీపక్ చాహర్ వేసిన లెంగ్త్ బాల్‌ను ఇషాన్ గ్లాన్స్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ బ్యాట్‌తో సరిగ్గా కాంటాక్ట్ కాలేదు.

అంపైర్ అవుట్ అయ్యాడో లేదో తెలియక తికమకపడ్డాడు. MI వికెట్ కీపర్ రియాన్ రికెల్టన్ DRS కోసం MI కెప్టెన్ హార్దిక్ పాండ్యాను అడగాలా వద్దా అనే ఆలోచనలో పడ్డాడు. ఎవరు కూడా అప్పీల్ చేయలేదు. అంపైర్ వైడ్ కోసం కాల్ చేద్దామనుకున్నట్టుగా కనిపించిన సమయంలో ఇషాన్ కిషన్ క్రీజును వదిలి ముందుకు నడిచాడు. 

46
Ishan Kishan

Ishan Kishan

ఆన్-ఫీల్డ్ అంపైర్ నిర్ణయం కోసం కూడా వేచి ఉండకుండా, ఇషాన్ కిషన్ 4 బంతుల్లో కేవలం 1 పరుగు చేసి పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. ఆసక్తికరంగా, అంపైర్ దీపక్ చాహర్ బంతిని వైడ్ కాల్ చేసే ప్రయత్నంలో ఉండగా, ఇషాన్ కిషన్ క్రీజును వదిలి బయటకు రావడంతో అంపైర్ తికమకపడుతూనే అవుట్ గా ప్రకటించాడు. అయితే, అల్ట్రాఎడ్జ్ ఎటువంటి స్పైక్‌ను చూపించకపోవడంతో వివాదం రేగింది. బ్యాట్ కు బాల్ తాకకుండానే అవుట్ గా క్రీజును వదిలిరావడమేంటని ఇషాన్ కిషన్ పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ క్రమంలోనే భారత జట్టు మాజీ ఢాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇషాన్ కిషన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదెక్కడి నిజాయితీ అంటూ ప్రశ్నించాడు. బ్యాట్ కు బాల్ తగలకుండా.. ప్రత్యర్థి జట్లు ఎలాంటి అప్పీలు చేయకుండా.. అంపైర్ ఇంకా అవుట్ ఇవ్వకుండానే క్రీజునుంచి వెళ్లడమేంటని ప్రశ్నించాడు. అంపైర్ తన పనిని చేసేందుకు డబ్బులు తీసుకుంటున్నాడు.. ఆ పనిని కూడా చేయనీకుండా ఇషాన్ కిషన్ అవుట్ అయ్యానంటూ క్రీజు వదిలి రావడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అంపైర్ నిర్ణయం తీసుకునే వరకు క్రీజులో ఉండాలనీ, అలాగే, త్వరగా వికెట్లు పడ్డాయి.. డీఆర్ఎస్ తీసుకునే అవకాశాలను కూడా చూడాలని ఎత్తిచూపాడు. రికీ పాంటింగ్ కామెంట్స్ ను కూడా గుర్తు చేశాడు. 

56
Asianet Image

“చాలా సార్లు.. లేదా కొన్ని కీలక సమయాల్లో మనసు పనిచేయదు. అది బ్రెయిన్ ఫేడ్. అలాంటప్పుడు కనీసం అక్కడ ఆగాలి. అంపైర్ తన నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలి. అంపైర్ కూడా ఆ పనిచేస్తున్నందుకు కొంత డబ్బు తీసుకుంటాడు. అతని పనిని కూడా చేయనియకుండా క్రీజును వదిలిరావడమేంటి అని సెహ్వాగ్ ప్రశ్నించాడు.

అలాగే, “ఈ నిజాయితీ నాకు అర్థం కాలేదు.  బాల్, బ్యాటకు తగిలి ఉంటే, అది అర్థమయ్యేది ఎందుకంటే అది ఆట స్ఫూర్తిలో ఉంటుంది. కానీ అది అవుట్ కాదు, అంపైర్‌కు ఖచ్చితంగా తెలియదు, నువ్వు అకస్మాత్తుగా నడుచుకుంటూ వెళ్లిపోయావు. అప్పుడు అంపైర్ కూడా ఇబ్బందుల్లో పడతాడు. పాంటింగ్ చెప్పినట్టు నీ పని బ్యాటింగ్ చేయడం.. అంపైర్ పని అవుట్ ను ప్రకటించడం అంటూ ఇషాన్ కిషన్ తీరును విమర్శించాడు. 

66
Ishan Kishan

Ishan Kishan

ఐపీఎల్ 2025లో ఇషాన్ కిషన్ కు ఏమైంది? 

SRH vs MI మ్యాచ్‌లో దీపక్ చాహర్ బౌలింగ్ లో ఇషాన్ కిషన్‌ అవుట్ అయ్యాడు. దీంతో అతని పేలవమైన ఫామ్ కొనసాగింది. హైదరాబాద్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్‌లో సెంచరీ సాధించిన తర్వాత ఇషాన్ కిషన్ నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. సెంచరీ ఇన్నింగ్స్ తర్వాత ఇషాన్ కిషన్ వరుసగా  2, 2, 17, 9, 2, 1, 8 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ సెంచరీతో 23.17 సగటుతో 139 పరుగులు చేశాడు. అతని తీరుపై సన్ రైజర్స ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
 
Recommended Stories
Top Stories