MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Silver: మీరు కొంటున్న వెండి అస‌లా.? న‌కిలీనా.? ఐస్ క్యూబ్‌తో తెలుసుకోవ‌చ్చు.

Silver: మీరు కొంటున్న వెండి అస‌లా.? న‌కిలీనా.? ఐస్ క్యూబ్‌తో తెలుసుకోవ‌చ్చు.

బంగారం ధ‌ర‌ల‌తో పాటు వెండి ధ‌ర‌లు కూడా పెరుగుతున్నాయి. ఇక భ‌విష్య‌త్తులో వెండికి భారీగా డిమాండ్ పెరిగే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న నేప‌థ్యంలో చాలా మంది వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. ప‌లు రంగాల్లో వెండి వినియోగం పెర‌గ‌నుంద‌న్న వార్త‌ల‌తో వెండిపై పెట్టుబ‌డి పెట్టే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే మీరు కొంటున్న వెండి ఎంత వ‌ర‌కు నాణ్య‌మైంద‌న్న విష‌యం ఎప్పుడైనా ఆలోచించారా.? వెండి నాణ్య‌త‌ను ఐస్ క్యూబ్ స‌హాయంతో తెలుసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా.. అదేలాగంటే.. 
 

Narender Vaitla | Published : Apr 24 2025, 03:50 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

బంగారం వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ప్రజలు పెట్టుబడి కోసం కూడా వీటిని కొనుగోలు చేస్తున్నారు, తద్వారా భవిష్యత్తులో మంచి రాబడి పొందవచ్చు. కానీ నేడు మార్కెట్లో అసలైన వాటి పేరుతో కల్తీ లేదా నకిలీ వెండి కూడా అమ్ముడవుతోంది. అసలైన వెండిలాగే కనిపిస్తుంది. కానీ దీనిలో వెండి శాతం చాలా తక్కువ లేదా అసలే ఉండదు.
 

25
Asianet Image

న‌కిలీ వెండిని గుర్తు ప‌ట్టే ఓ ట్రిక్‌కి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.  ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా వైర‌ల్ అవుతోన్న ఈ వీడియోలో న‌కిలీ వెండిని గుర్తించేందుకు ఈ ట్రిక్‌ను తీసుకొచ్చారు. ఇంట్లోనే కొన్ని ఐస్ ముక్కలను ఉపయోగించి అసలైన వెండిని గుర్తించవచ్చు.  
 

35
Asianet Image

ఇందుకోసం ముందుగా ఒక ప్లేట్‌లో కొన్ని ఐస్ ముక్కలను తీసుకొని దానిపై వెండి ఆభరణం లేదా నాణెం ఉంచండి. వెండి అసలైనదైతే అది ఐస్‌కు అతుక్కుపోతుంది. అదే సమయంలో, నకిలీ వెండి ఐస్‌కు అతుక్కుపోదు. ఈ విధంగా మీరు అసలైన లేదా నకిలీ వెండిని గుర్తించవచ్చు. సోషల్ మీడియాలో ఈ హాక్ వేగంగా వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి. 

45
Asianet Image

ఇక న‌కిలీ వెండి గుర్తించ‌డానికి ఇత‌ర మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

* అసలైన వెండిపై హాల్‌మార్క్‌, స్టాంప్ ఉంటుంది. అసలైన వెండిపై 925, 999 లేదా స్టెర్లింగ్ అని రాసి ఉంటుంది. 925 అంటే 92.5% శుద్ధ వెండి అని అర్థం. 

* అసలైన వెండిపై లైటర్ లేదా అగ్గిపుల్ల వెలిగిస్తే అది నల్లగా మారదు. నకిలీ వెండి వేడికి పసుపు లేదా మచ్చలు వస్తాయి.

* అసలైన వెండిని గుర్తించడానికి మీరు మాగ్నెట్ పరీక్ష కూడా చేయవచ్చు. వెండి అయస్కాంతానికి అతుక్కుపోదు. వెండిలో కల్తీ ఉంటే అది అయస్కాంతానికి అతుక్కుపోతుంది.

55
Asianet Image

* అసలైన వెండిని పరీక్షించడానికి మీరు కొద్దిగా నీటిలో బ్లీచ్ పౌడర్, ఉప్పు కలిపి ఆ ద్రావణంలో వెండిని వేయండి. కొంత సమయం తర్వాత అసలైన వెండిపై తేలికపాటి నల్ల మచ్చ రావచ్చు, అయితే నకిలీ వెండిపై ఎటువంటి ప్రభావం ఉండదు.

* అసలైన వెండిని మృదువైన వస్త్రంతో రుద్దినప్పుడు, అది నెమ్మదిగా మెరుస్తుంది, అయితే నకిలీ వెండి పై పొర ఊడిపోతుంది అలాగే రంగు మారడం ప్రారంభమవుతుంది.

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
బంగారం
జీవనశైలి
 
Recommended Stories
Top Stories