Morning Walk ఉదయం నడక.. చర్మాన్నీ మెరిపిస్తుంది!
Morning walk: ఉదయం నడక వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది అని అందరికీ తెలిసిన తెలిసిందే. గుండె సంబంధిత సమస్యలు రావు. ఫిట్ నెస్ తో ఉంటారు. ఇంకెన్నో ప్రయోజనాలు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే.. ఉదయం నడక వల్ల చర్మానికి కూడా మేలు ప్రయోజనాలు కలుగుతాయి.

ఉదయం నడక చర్మ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది?
ఉదయం నడక శరీరానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుందని మనకు తెలుసు. మొత్తం శారీరక ఆరోగ్యానికి నడక చాలా మంచిది. ఉదయం ఎండలో నడవడం వల్ల విటమిన్ డి లభిస్తుంది. వేసవిలో ఎక్కువ నీరు తాగడం వల్ల వచ్చే ఇబ్బందులను నివారించడానికి తెల్లవారుజామున నడక మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కానీ నడక వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని మీకు తెలుసా?
ఉదయం నడక ప్రయోజనాలు
చర్మ ఆరోగ్యం:
ఉదయం నడక వల్ల చర్మంపై గణనీయమైన ప్రయోజనాలు కనిపిస్తాయి. ప్రతిరోజూ నడక శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సక్రమంగా ప్రవహించడం వల్ల చర్మంలో మార్పులు వస్తాయి. ఉదయం నడకలో ఎంత చెమట పడుతుందో, అంత విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. విష పదార్థాలు బయటకు వెళ్లిపోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
మంచి నిద్ర
ఉదయాన్నే లేవగానే కొంతసేపు నడవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోజంతా చురుగ్గా ఉంటారు. పగటిపూట చురుగ్గా ఉండటం వల్ల రాత్రి శరీరానికి విశ్రాంతి అవసరం. రాత్రి త్వరగా నిద్రపోతారు. మంచి నిద్ర చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన అంశం.
చర్మ ఆరోగ్యానికి ఉదయం నడక ప్రయోజనాలు
జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లకపోవడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. మీ జీర్ణవ్యవస్థ బాగా పనిచేసి వ్యర్థాలను సరిగ్గా బయటకు పంపడానికి నడక సహాయపడుతుంది. నడక శరీరంలోని మధ్య, ఉదర కండరాలను బాగా పనిచేయిస్తుంది, దీని వల్ల ప్రేగుల కదలిక మెరుగుపడుతుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
మానసిక ఆరోగ్యం:
మీరు ఒత్తిడికి గురైనప్పుడు చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. అలసిపోయినట్లు కనిపిస్తారు. ప్రతిరోజూ నడక మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. దీని వల్ల రాత్రి బాగా నిద్రపోతారు, సంతోషంగా ఉంటారు. మీ చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.