NC Classic 2025: నీరజ్ చోప్రా ఆహ్వానం తిరస్కరించిన ఒలింపిక్ ఛాంపియన్..
Arshad Nadeem declines Neeraj Chopra's invitation: పాకిస్తాన్ జావెలిన్ స్టార్ అర్షద్ నదీమ్ బెంగళూరులో జరగనున్న NC క్లాసిక్ 2025 అథ్లెటిక్స్ ఈవెంట్‌కు హాజరు కావడం లేదు. భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ఆహ్వానికి నో చెప్పాడు. ఎందుకు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

NC Classic 2025: Arshad Nadeem rejects Neeraj Chopra's invitation, why
Arshad Nadeem declines Neeraj Chopra's invitation: పారిస్ 2024 ఒలింపిక్స్‌లో రికార్డుల మోత మోగిస్తూ చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ జావెలిన్ త్రో చాంపియన్ అర్షద్ నదీమ్, భారత స్టార్ నీరజ్ చోప్రా ఆహ్వానానికి నో చెప్పాడు. NC క్లాసిక్ 2025 పాల్గొనడం లేదని స్పష్టం చేశాడు. ఈ అథ్లెటిక్స్ మెగా ఈవెంట్ మే 24న కర్నాటకలోని బెంగళూరులో జరగనుంది.
NC Classic 2025: Arshad Nadeem rejects Neeraj Chopra's invitation
NC క్లాసిక్ 2025 లో పాల్గొనాలని నీరజ్ చోప్రా పంపిన ఆహ్వానం గురించి నదీమ్ మాట్లాడుతూ.. 'NC క్లాసిక్ మే 24న జరుగుతుంది. కానీ నేను మే 22న కొరియాకు వెళ్లాల్సి ఉంది. మే 27 నుంచి 31 వరకు గుమిలో జరగనున్న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ కోసం నేను శిక్షణ తీసుకుంటున్నాను అందుకే నేను ఎన్సీ క్లాసిక్ 2025 ఈవెంట్ లో పాల్గొనడం లేదు' అని తెలిపాడు.
28 ఏళ్ల నదీమ్, టోక్యో 2020 గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపాడు. చోప్రా ఆహ్వానించినందుకు నేను కృతజ్ఞుడి అంటూ పేర్కొన్నాడు.
Arshad Nadeem rejects Neeraj Chopra's invitation, why
NC క్లాసిక్‌ను నీరజ్ చోప్రా, JSW స్పోర్ట్స్, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI), వరల్డ్ అథ్లెటిక్స్ సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి. ఈ ఈవెంట్‌ను మొదట హర్యానాలోని పంచకులా టావ్ దేవీ లాల్ స్టేడియంలో నిర్వహించాలనుకున్నారు. అయితే, లైటింగ్ సమస్యల కారణంగా ఇప్పుడు దీనిని బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో నిర్వహించనున్నారు.
ఈ టోర్నీ, వరల్డ్ అథ్లెటిక్స్ కేటగిరీలో ‘Continental Tour Gold-level’గా గుర్తింపు పొందింది. ఇది భారత్‌లో ఇప్పటి వరకు నిర్వహించే అత్యున్నత స్థాయి అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఈవెంట్ కావడం విశేషం.
Paris Olympics - neeraj chopra
నీరజ్, తన మంచి మిత్రుడైన నదీమ్‌ను స్వయంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే నదీమ్ గైర్హాజరీతో వారి మధ్య మళ్లీ పోటీ ఆశించిన అభిమానులకు నిరాశే అని చెప్పాలి. కానీ, ఈ ఈవెంట్‌లో పాల్గొనబోయే అంతర్జాతీయ ప్లేయర్లు చాలా మందే ఉన్నారు. గ్రెనెడాకు చెందిన డబుల్ వరల్డ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్, రియో 2016 గోల్డ్ మెడలిస్ట్ థామస్ రోహ్లర్ (జర్మనీ), రియో 2016 సిల్వర్ మెడలిస్ట్ జూలియస్ యెగో (కెన్యా), ప్రస్తుత వరల్డ్ లీడర్ కర్టిస్ థాంప్సన్ (అమెరికా) పాల్గొననున్నారు. నీరజ్ కూడా ఈ పోటీలో పాల్గొంటాడు.
Javelin Throw, Arshad Nadeem, Neeraj Chopra
చోప్రా, మే 16న దోహా డైమండ్ లీగ్‌లో పోటీల తర్వాత భారత్‌కు చేరుకుంటాడు. 2025 సీజన్‌ను దక్షిణాఫ్రికాలోని పోచ్ఫ్ ఇన్విటేషనల్‌లో విజయంతో ప్రారంభించాడు. ఇది ఆయనకు 2024 భువనేశ్వర్ ఫెడరేషన్ కప్ తర్వాత తొలిసారి హోం గ్రౌండ్‌లో పోటీ అవుతుంది.
నదీమ్ తిరస్కరణ వెనుక కేవలం షెడ్యూల్ మాత్రమే కాకుండా, భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న దౌత్య సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. నదీమ్, పారిస్ ఒలింపిక్స్‌లో 92.97 మీటర్ల అద్భుత త్రోతో ఒలింపిక్ రికార్డ్ బద్దలు కొట్టి, చోప్రాకు గోల్డ్ మెడల్ దూరం చేస్తూ తాను గెలుచుకున్నాడు. ఇది పాకిస్తాన్‌కు మొదటి వ్యక్తిగత ఒలింపిక్ గోల్డ్ మెడల్ కావడం విశేషం.