Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Sports
  • Cricket
  • RCB vs RR: రాజస్థాన్ రాయల్స్ పై ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ

RCB vs RR: రాజస్థాన్ రాయల్స్ పై ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ

IPL 2025 RCB vs RR: విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ సూపర్ బ్యాటింగ్ తో పాటు జోష్ హాజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా అద్భుత‌మైన బౌలింగ్ తో ఐపీఎల్ 42వ మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై  రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు థ్రిల్లింగ్ విక్ట‌రీ సాధించింది. 

Mahesh Rajamoni | Published : Apr 25 2025, 12:04 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

IPL 2025 RCB vs RR: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా గెలుపు ముంగిట బోల్తా పడుతోంది. ఆరంభం నుంచి అద్భుతంగా బ్యాటింగ్ చేసి విజయానికి సింగిల్ డిజిట్ పరుగులు అవసరమైన సమయంలో బోల్తా పడుతున్నారు. చివరి ఓవర్లలో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్.. మరో మ్యాచ్ ను కూడా కోల్పోయింది. ఇప్పుడు ఆర్సీబీలో చేతిలో ఆర్ఆర్ 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

25
Asianet Image

ఐపీఎల్ 2025 41వ మ్యాచ్ లో  రాజస్థాన్ రాయల్స్ - రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొద‌ట బ్యాటింగ్ కు దిగింది ఆర్సీబీ. ఓపెన‌ర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీలు మంచి ఆరంభం అందించారు. 

35
Asianet Image

ఫిల్ సాల్ట్ 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కలు అద్భుతమైన బ్యాటింగ్ తో హాఫ్ సెచరీ కొట్టాడు. తన ఇన్నింగ్స్ లో అతను 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.  విరాట్ కోహ్లీ 70 పరుగుల ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. టిమ్ డేవిడ్ 23, జితేష్ శర్మ 20 పరుగులు చేయడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లు  కోల్పోయి 205 పరుగులు చేసింది. 

45
Asianet Image

206 పరుగుల భారీ టార్గెట్ తో సెకండ్ బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీలు మంచి ఆరంభం అందించారు. 16 పరుగులు చేసి వైభవ్ అవుట్ అయ్యాడు. మరో ఎండ్ లో ఉన్న జైస్వాల్ సునామీ రేపాడు. సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. కేవలం 19 బంతుల్లోనే 49 పరుగులు తన ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. నితీస్ రానా 28, రియాన్ పరాగ్ 22, ధ్రువ్ జురేల్ 47 పరుగులు ఇన్నింగ్స్ ఆడారు. 

 

55
Asianet Image

ఆర్ఆర్ బ్యాటింగ్ సమయంలో 19 ఓవర్ బౌలింగ్ చేసిన జోస్ హాజిల్ వుడ్ వరుసగా రెండు వికెట్లు తీసుకుని మ్యాచ్ ను బెంగళూరు వైపు మార్చాడు. 18.3 బంతికి ధ్రువ్ జురేల్, 18.4 బంతికి జోఫ్రా ఆర్చర్ అవుట్ చేశాడు. 2 వికెట్లతో పాటు కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చి జోస్ హాజిల్ వుడ్ మ్యాచ్ ను మలుపు తిప్పాడు. ఆర్సీబీ అద్భుతమైన బౌలింగ్ తో ఆర్ఆర్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
విరాట్ కోహ్లీ
ఏషియానెట్ న్యూస్
 
Recommended Stories
Top Stories