MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • India Pakistan war : భారత్ vs పాకిస్తాన్.. ఎవరి దగ్గర బలమైన సైన్యం ఉంది?

India Pakistan war : భారత్ vs పాకిస్తాన్.. ఎవరి దగ్గర బలమైన సైన్యం ఉంది?

India vs Pakistan Military Comparison 2025: కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మంది గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటన వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని అనుమానాల మధ్య భారత్ తీవ్రంగా స్పందిస్తోంది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. యుద్ధవాతావరణం కనిపిస్తోంది. అయితే, భారత్-పాకిస్తాన్ దేశాల సైన్యం, బలాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

3 Min read
Mahesh Rajamoni
Published : Apr 24 2025, 09:57 PM IST| Updated : Apr 25 2025, 10:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
India vs Pakistan Military Power 2025: Who Would Win a Full Scale War?

India vs Pakistan Military Power 2025: Who Would Win a Full-Scale War?

India vs Pakistan Military Comparison 2025: ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ సైనిక శక్తుల మధ్య తేడా చాలానే ఉంది.  కశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది పుల్వామా తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడిగా చెప్పవచ్చు. ఈ దాడుల వెనుక పాక్ హస్తం ఉందనే అనుమాన మధ్య పాక్ చర్యలు భారత్ కు మరింత ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

ఈ పరిణామాల మధ్య సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ వైమానిక దళం జెట్లు, యుద్ధ ట్యాంకులు భారత సరిహద్దులకు చేరుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు దేశాల సైనిక శక్తి సామర్థ్యాలు, బలాలు ఎలా ఉన్నాయనే విషయాలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. ఆ వివరాలు గమనిస్తే.. 

25
India vs Pakistan Army, Air Force & Nuclear Strength Compared (2025 Update)

India vs Pakistan Army, Air Force & Nuclear Strength Compared (2025 Update)

భారత్ vs పాకిస్తాన్: జనాభా-ఆర్థిక శక్తిలో ఎవరి బలం ఎంత? 

భారత్ జనాభా దాదాపు 1.4 బిలియన్ కు పైగా ఉంది. పాకిస్తాన్ జనాభా దాదాపు 240 మిలియన్ గా ఉంది. భారత సైనిక శక్తికి మానవ వనరుల పరంగా తిరుగులేని శక్తిగా ఉంది. భారత రక్షణ బడ్జెట్ (2023-24) – రూ. 5.94 లక్షల కోట్ల రూపాయలు (సుమారు $73.8 బిలియన్). పాకిస్తాన్ బడ్జెట్ – కేవలం $6.34 బిలియన్లు.

భారత్ vs పాకిస్తాన్: సైనిక బలాలు

భారత్: ప్రపంచంలోని అత్యధిక సైనిక బలం కలిగిన దేశాల్లో భారత్ ఒకటి. 14.4 లక్షలు యాక్టివ్ సైనికులు ఉన్నారు. అలాగే, రిజర్వ్ లో 11.5 లక్షల మంది సైనికులు ఉన్నారు. ఇక పరామిలిటరీలో 25 లక్షలకుపైగా సైనికులు ఉన్నారు. 

పాకిస్తాన్: పాకిస్తాన్ యాక్టివ్ సైనికులు సుమారు 6.5 లక్షలుగా ఉన్నారు. పారామిలిటరీతో కలిపి మొత్తం సైనిక బలం భారత్ కంటే చాలా తక్కువగా ఉంది.

35
India vs Pakistan Defence Comparison 2025: Military Size, Weapons & War Strategy

India vs Pakistan Defence Comparison 2025: Military Size, Weapons & War Strategy

భారత్ vs పాకిస్తాన్: భూమి పై బలాలు, యుద్ధ ట్యాంకులు 

భారత సైన్యం ఆధునిక సాంకేతికతతో శక్తివంతంగా ఉంది. భారత ఆయుధాలు, యుద్ధ ట్యాంకులలో చాలా అస్త్రాలు ఉన్నాయి. అర్జున్ ట్యాంకులు, టీ-90 భీమ్, బ్రహ్మోస్ క్షిపణులు, పినాకా రాకెట్ లాంచర్లు, అత్యాధునిక హోవిట్జర్లు ఉన్నాయి. 

ఇక పాకిస్తాన్ వద్ద అల్-ఖాలిద్ ట్యాంకులతో పాటు చైనా, పాశ్చాత్య దేశాలు అందిస్తున్న ఆయుధాలపై ఆధారపడుతోంది.  

భారత్ vs పాకిస్తాన్: వైమానిక దళం బలాలు  

భారత వైమానిక దళంలో 2,229కు పైగా విమానాలు ఉన్నాయి. యుద్ధ విమానాలు 600+, సహాయక విమానాలు 831, హెలికాప్టర్లు 899 ఉన్నాయి. రాఫెల్, సుఖోయ్ Su-30MKI, మిరాజ్ 2000, తేజస్ వంటి అత్యాధునిక టెక్నాలజీ కలిగిన యుద్ధ విమానాలు ఉన్నాయి. 

పాకిస్తాన్ వైమానిక దళంలో చైనా సహకారం అందించిన JF-17 థండర్, F-16లు, మిరాజ్ III/V యుద్ధ విమానాలు ఉన్నాయి. అయితే, పాకిస్తాన్ దగ్గర ఉన్న యుద్ధ విమానాల్లో చాలా వరకు పాతకాలం టెక్నాలజీని కలిగి ఉన్నవే ఉన్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అవి కూడా చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. 

45
Pakistan vs India Military Strength 2025: Army, Air Force, Navy & Nukes

Pakistan vs India Military Strength 2025: Army, Air Force, Navy & Nukes

భారత్ vs పాకిస్తాన్: నౌకా దళ బలాలు 

ఇండియన్ నేవీ అత్యాధునిక టెక్నాలజీ కలిగిన యుద్ధ నౌకలను కలిగి ఉంది. 130+ నౌకలు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు 2 (విక్రమాదిత్య, విక్రాంత్), అణు సబ్‌మెరిన్లు ఉన్నాయి. సముద్రం మీద భారత్ సత్తా ప్రపంచ అగ్రదేశాలకు సైతం సవాలు విసిరింది.

పాకిస్తాన్ నేవీలో ఓవరాల్ నౌకలు 75, సబ్‌మెరిన్లు 13 హంగోర్, అగోస్టా తరహావి ఉన్నాయి. పాక్ వద్ద ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ లేదు. 

భారత్ vs పాకిస్తాన్: సాంకేతికత, వ్యూహాత్మక బలాలు 

భారత్ DRDO, HAL వంటి సంస్థల ద్వారా స్వదేశీ తయారీపై దృష్టి పెట్టింది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ దేశాలతో మిలిటరీ భాగస్వామ్యాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఆయుధాల కోసం ఎక్కువగా  చైనాపై ఆధారపడుతోంది. 

55
Which Country Has the Stronger Military in 2025 – India or Pakistan?

Which Country Has the Stronger Military in 2025 – India or Pakistan?

భారత్ vs పాకిస్తాన్:  అణుశక్తి సామర్థ్యాలు 

రెండు దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. అయితే,  భారత్‌కు ‘సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ’ ఉంది. అంటే అణు సబ్‌మెరిన్లు ఉన్నాయి. వాటి నుంచి కూడా దాడి చేయగల సత్తా కలిగి ఉంది. పాకిస్తాన్, మిస్సైల్ ఆధారిత నిరోధకతపై ఆధారపడుతోంది. 

మొత్తంగా చూస్తే భారత్ శక్తి ముందు పాకిస్తాన్ నిలబడలేదని చెప్పవచ్చు. ఎందుకంటే పెద్ద ఆర్థిక వ్యవస్థ, అధిక మానవ వనరులు, అత్యాధునిక ఆయుధాలు భారత సైన్యాన్ని శక్తివంతంగా మార్చాయి. యుద్ధానికి దిగితే పాకిస్తాన్ ఎక్కువ కాలం భారత్ ముందు నిలబడలేదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
పాకిస్తాన్
నరేంద్ర మోదీ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved