తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

11:59 PM (IST) Apr 28
Nifty prediction tomorrow 29 April: మార్కెట్లు మంచి గ్యాప్-అప్‌తో ప్రారంభమై సోమవారం మొత్తం అదే జోష్‌ను కొనసాగించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 1,005.84 పాయింట్లు (1.27%) పెరిగి 80,218.37 వద్ద, నిఫ్టీ 289.15 పాయింట్లు (1.20%) పెరిగి 24,328.50 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.3%, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.4% పెరిగాయి. మరి రేపు షేర్ మార్కెట్ ఎలా ఉండనుంది?
11:09 PM (IST) Apr 28
RR vs GT: ఐపీఎల్ 2025లో వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ సూపర్ నాక్ తో గుజరాత్ టైటాన్స్ పై రాజస్తాన్ రాయల్స్ సూపర్ విక్టరీ కొట్టింది. కేవలం 15.5 212/2 పరుగులతో విజయాన్ని అందుకుంది.
11:09 PM (IST) Apr 28
Vaibhav Surya Smashes Century: ఐపీఎల్ మ్యాచ్‌లలో రోజుకో సంచలనం నమోదువుతోంది. ఇవాళ జరిగిన మ్యాచ్లో కూడా రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ 14 ఏళ్ల పసివాడు వైభవ్ సూర్య గుజరాత్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. బంతి పడటం ఆలస్యం గ్యాలరీకి పంపడమే తన లక్ష్యం అన్నట్లు చెలరేగిపోయాడు.... అత్యంత పిన్న వయసులో తక్కువ బంతుల్లో సెంచరీ బాది రికార్డులో నిలిచాడు.
10:52 PM (IST) Apr 28
Vaibhav Suryavanshi: గుజరాత్ టైటాన్స్ పై వైభవ్ సూర్యవంశీ బ్యాట్ తో విరుచుకుపడ్డాడు. 35 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఐపీఎల్ లో చాలా రికార్డ్స్ బద్దలు కొట్టాడు.
పూర్తి కథనం చదవండి10:52 PM (IST) Apr 28
Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ, ఆ తర్వాత సెంచరీ కొట్టాడు 14 ఏళ్ల బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ కొట్టిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు.
10:37 PM (IST) Apr 28
10:26 PM (IST) Apr 28
నందమూరి బాలకృష్ణ సోమవారం రోజు ఏప్రిల్ 28న రాష్ట్రపతి భవన్ లో పద్మ భూషణ్ అవార్డుని స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలయ్య పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు.
పూర్తి కథనం చదవండి09:50 PM (IST) Apr 28
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న వారి కోసం విజయ్ ఆంటోనీ మరో ప్రకటన విడుదల చేశారు.
పూర్తి కథనం చదవండి09:38 PM (IST) Apr 28
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపులు బీభత్సం సృష్టించాయి. పంటలు దెబ్బతినడంతో పాటు ఒక రైతు ప్రాణాలు కోల్పోయిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. తక్షణ చర్యలకు ఆదేశించారు.
08:53 PM (IST) Apr 28
Andhra Pradesh Rajya Sabha: ఏపీలో ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు బీజేపీ అభ్యర్థిని అధీష్టానం ఎంపిక చేసింది. భీమవరం ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకుడు పాక వెంకట సత్యనారాయణ పేరును ఎన్డీఏ కూటమి ప్రకటించింది. ఈయన ప్రస్తుతం ఏపీ బీజేపీ డిసిప్లీనరీ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామాతో రాజ్యసభ సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా ఆ సీటు తమకు కావాలని కోరడంతో బీజేపీ కోరడంతో సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఈ సీటు కోసం అనేక మంది ఆశావాహుల పేర్లు వినిపించాయి. ఈక్రమంలో ఎవరూ ఊహించని విధంగా బీజేపీలో సంస్థాగతంగా పనిచేసుకుంటూ వస్తున్న నేత పాక వెంకట సత్యనారాయణను రాజ్యసభ అవకాశం వరించింది.
పూర్తి కథనం చదవండి08:48 PM (IST) Apr 28
పురుషాధిక్య సమాజంలో, సినిమా పరిశ్రమలో మహిళా ప్రధాన చిత్రాల విజయ ప్రస్థానం, వాటి వినూత్న కథాంశాల గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి08:48 PM (IST) Apr 28
Injured BRS working president KTR: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) గాయపడ్డారు.
పూర్తి కథనం చదవండి08:27 PM (IST) Apr 28
Weather Forecast: రెండు తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. ఎండాకాలంలో వానలు దంచికొడుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రాబోయే నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏపీఎస్డీఎంఏ) పలు జిల్లాలలకు హెచ్చరికలు జారీ చేసింది.
పూర్తి కథనం చదవండి08:25 PM (IST) Apr 28
ప్రస్తుతం ఒక్కో సినిమాకి 12 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న నయనతార, 69 ఏళ్ల నటుడి సరసన నటించడానికి భారీ పారితోషికం అడిగి నిర్మాతలకు షాక్ ఇచ్చారట.
పూర్తి కథనం చదవండి07:29 PM (IST) Apr 28
IPL Mumbai Indians Resurgence After Poor Start: ఐపీఎల్ 2025 లో ముంబై ఇండియన్స్ అద్భుతంగా పుంజుకుంది. సీజన్ ప్రారంభంలో తొమ్మిదో స్థానంలో ఉన్న ముంబై జట్టు ఇప్పుడు 12 పాయింట్లతో మూడో స్థానానికి దూసుకెళ్లింది. పూర్ స్టార్ట్ నుంచి బలమైన జట్టుగా ముంబై ఇండియన్స్ ఎలా మారింది? హార్దిక్ పాడ్యా కెప్టెన్సీలోని ముంబై జట్టు బలం ఎలా పొందింది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి06:25 PM (IST) Apr 28
కొత్త పోప్‌ను ఎన్నుకోవడానికి మే 7న కార్డినల్స్ సమావేశం కానున్నారు.
పూర్తి కథనం చదవండి06:13 PM (IST) Apr 28
Virat Kohli and KL Rahul fight: ఐపీఎల్ 2025 లో భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మధ్య వాగ్వాదం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఫైట్ చేశారు?
పూర్తి కథనం చదవండి06:07 PM (IST) Apr 28
bomb blast in Pakistan: పాకిస్తాన్‌లోని దక్షిణ వజీరిస్తాన్‌లో శాంతి సమావేశంలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ పేలుడులో 7 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు.
06:06 PM (IST) Apr 28
Modi Amaravati Tour: ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. ప్రధాని మోదీ మే 2న అమరావతికి రానున్నారు. ఇక సభకు సంబంధించి, మోదీ పర్యటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి05:35 PM (IST) Apr 28
Modi Amaravati Visit: ప్రధాని మోదీ మే 2న ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమాన్ని, పనుల శంకుస్థాపనలను ప్రధాని చేతులమీదుగా చేపట్టనున్నారు. ఆ తర్వాత రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను మోదీ సన్మానించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి చుట్టుపక్కల నుంచి భారీ జనసమీకరణ చేసేందుకు నాయకులు సన్నద్దం అవుతున్నారు.
పూర్తి కథనం చదవండి05:19 PM (IST) Apr 28
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించారు. ఇది మే 8 నుండి మే 11 వరకు కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దీనిపై ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు.
పూర్తి కథనం చదవండి04:49 PM (IST) Apr 28
Chicken costs Rs. 800 per kg in Pakistan: జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణం కనిపిస్తోంది. ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడైనా యద్ధం మొదలుకావచ్చు అనే రిపోర్టుల మధ్య పాకిస్తాన్ లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ లో కిలో చికెన్ ధరలు రూ.800లకు చేరాయి. కిలో బియ్యం ధరలు 340 రూపాయలుగా ఉంది.
04:41 PM (IST) Apr 28
ఢిల్లీ కోర్టు సోమవారం 26/11 ముంబై దాడుల నిందితుడు తహవూర్ హుస్సేన్ రాణా కస్టడీని 12 రోజులు పొడిగించింది. రాణా NIA కస్టడీలో మరో 12 రోజులు ఉంటాడు.
పూర్తి కథనం చదవండి03:50 PM (IST) Apr 28
ప్రభాస్, అనుష్క,రానా వంటి 'బాహుబలి 2' సినిమా తారల చదువుల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు! వాళ్ళ స్కూల్ నుండి కాలేజీ వరకు చదువుల ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి
03:47 PM (IST) Apr 28
తెలుగు రాష్ట్రాలు ఆర్టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నాయి. అయితే తమిళనాడులో ఆడామగ తేడాలేకుండా ఏడాదిపాటు ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే లక్కీ ఛాన్స్ కల్పిస్తోంది.
పూర్తి కథనం చదవండి03:11 PM (IST) Apr 28
కేసీఆర్ వరంగల్ సభలో కాంగ్రెస్ పై చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చించాలని, తెలంగాణను అప్పులపాలు చేసింది కేసీఆరే అని ఆరోపించారు. పథకాల అమలులో కమిట్మెంట్ తో ఉంటామన్నారు. ఈ క్రమంలో సొంతపార్టీ ఎమ్మెల్యేలకు సీఎం స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
పూర్తి కథనం చదవండి03:02 PM (IST) Apr 28
Horrific Road Accident in Tirupati: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అయిదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. చనిపోయారు.
02:59 PM (IST) Apr 28
భారత్, ఫ్రాన్స్ దేశాలు 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్‌ల కొనుగోలు కోసం రూ.63,000 కోట్ల భారీ రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడ్డాయి.
పూర్తి కథనం చదవండి02:50 PM (IST) Apr 28
CM Revanth: కేసీఆర్ గత ప్రభుత్వంలో పేరుకి అనేక పథకాలు తీసుకొచ్చి.. వాటిని వెంటనే క్లోజ్ చేశారని సీఎం రేవంత్ మండిపడ్డారు. తాను అలాంటి పనులు చేయనని, చెప్పిందే చెస్తానని.. ఈ నమ్మకం ప్రజల్లో కలిగేలా పనిచేస్తా అని ఆయన అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకల్లో ఆ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సీఎం రేవంత్ స్పందించారు.
02:15 PM (IST) Apr 28
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య నటించిన రెట్రో సినిమా మే 1న విడుదల కానుంది. దాని ప్రీ బుకింగ్ వసూళ్లను ఇక్కడ చూడండి.
పూర్తి కథనం చదవండి02:14 PM (IST) Apr 28
Chandrababu with NDA Leaders: ఏపీలోని విశాఖపట్టణాన్ని రాష్ట్ర ఆర్థిక రాజధానిగా తీర్చుదిద్దుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తయారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభానికి మే 2న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలకడంతోపాటు సభను విజయవంతం చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయే నేతలకు పిలుపునిచ్చారు.
పూర్తి కథనం చదవండి02:11 PM (IST) Apr 28
పహల్గాం దాడి నేపథ్యంలో భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య పాక్ సైన్యంలో రాజీనామాల ఊహాగానాలు వ్యాపించాయి. ఐఎస్‌పిఆర్ ద్వారా క్రమశిక్షణ, ఐక్యతను పాటించాలని, రాజీనామా చేస్తే చర్యలు తప్పవని సైన్యానికి హెచ్చరిక జారీ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల ప్రామాణికత ఇంకా నిర్ధారణ కాలేదు.
పూర్తి కథనం చదవండి02:10 PM (IST) Apr 28
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన టాలీవుడ్ పాన్ ఇండియా సినిమా బాహుబలి 2 . ఈ సినిమా రిలీజ్ అయ్యి 8 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా బాహుబలి సినిమా కోసం ప్రభాస్ తో పాటు అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, రమ్య కృష్ణ లాంటి స్టార్లు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో చూద్దాం.
పూర్తి కథనం చదవండి01:49 PM (IST) Apr 28
AP Govt Regularizes 870 Old Layouts: ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎప్పటి నుంచో పట్టణాభివృద్ది సంస్థ నుంచి అనుమతులకు నోచుకోక లేవట్లు అడవులుగా మారాయి. ఈక్రమంలో ఆ పాత లేఅవుట్లు అన్నింటినీ క్రమబద్దీకరణకు కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని 85 వేల కుటుంబాలకు లబ్ది చేకూర్చినట్లైంది.
పూర్తి కథనం చదవండి01:35 PM (IST) Apr 28
పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంతో పాకిస్తాన్ సైన్యం వణికిపోతోంది. ఆర్మీ ఉన్నతాధికారులు, సైనికుల రాజీనామాలే ఇందుకు నిదర్శనం. ఇప్పటివరకు ఎంతమంది రాజీనామా చేసారంటే...
పూర్తి కథనం చదవండి12:41 PM (IST) Apr 28
TS Police: కశ్మీర్‌లోని పహల్గాంలో తీవ్రవాదుల ఘటన నేపథ్యంలో పాకిస్తానీయకులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. 48 గంటల్లో వెళ్లిపోవాలని ఆదేశించింది. ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసినా కొన్ని ప్రాంతాల్లో పాక్ జాతీయులు స్వదేశానికి వెళ్లిపోకుండా ఇక్కడే ఉన్నారు. అలా హైదరాబాద్‌లో కూడా పాకిస్తానోళ్లు వెళ్లకుండా ఉండిపోయారు. ఈక్రమంలో తెలంగాణ పోలీసులు వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు.
పూర్తి కథనం చదవండి12:34 PM (IST) Apr 28
పహల్గాం దాడి తర్వాత భారత్ కఠిన చర్యలు తీసుకోవడంతో పాకిస్తాన్ లో టెన్షన్ నెలకొంది. సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ కుటుంబంతో సహా మిస్సింగ్ అయినట్లు తెలుస్తోంది.
పూర్తి కథనం చదవండి12:18 PM (IST) Apr 28
ఇండియా-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరుదేశాల మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్న వేళ పాక్ కు చైనా భారీ ఆయుధ సామాగ్రిని అందించింది.
పూర్తి కథనం చదవండి
12:15 PM (IST) Apr 28
Telangana 10th Results: తెలంగాణ ఫలితాల విడుదలలో కీలక మార్పులు చేశారు. గతంలో గ్రేడ్‌ల విధానంలో ఫలితాలు విడుదల కావడంతో ఎవరికి అధికంగా మార్కులు వచ్చాయో తెలిసేది కాదు.. ఈ నేపథ్యంలో ఈ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. గ్రేడ్‌లతోపాటు మార్కులను విడుదల చేయనున్నారు. దీంతోపాటు ఫలితాల విడుదల తేదీలను ప్రకటించారు.
పూర్తి కథనం చదవండి11:34 AM (IST) Apr 28
హైదరాబాద్ శివారులో వందల ఎకరాల భూధాన్ భూముల కబ్జా వ్యవహారం బట్టబయలైంది. కోట్ల విలువైన ఈ భూముల అక్రమ విక్రయాలపై ఈడీ దర్యాప్తు చేపడుతోంది... తాజాగా స్పీడ్ పెంచిన ఈడి ఇళ్లపై దాడులకు దిగింది.
పూర్తి కథనం చదవండి