TS Police: కశ్మీర్‌లోని పహల్గాంలో తీవ్రవాదుల ఘటన నేపథ్యంలో పాకిస్తానీయకులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. 48 గంటల్లో వెళ్లిపోవాలని ఆదేశించింది. ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసినా కొన్ని ప్రాంతాల్లో పాక్ జాతీయులు స్వదేశానికి వెళ్లిపోకుండా ఇక్కడే ఉన్నారు. అలా హైదరాబాద్‌లో కూడా పాకిస్తానోళ్లు వెళ్లకుండా ఉండిపోయారు. ఈక్రమంలో తెలంగాణ పోలీసులు వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు.
తెలంగాణ పోలీసులు ఆదివారం నలుగురు పాకిస్తాన్ జాతీయులకు దేశం విడిచిపోవాలని బహిష్కరణ పత్రాలను అందజేశారు. వీరితోపాటు మరో 36 మందికి ఏప్రిల్ 29లోపు రాష్ట్రం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఈమేరకు నివేదిక పంపారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత పాకిస్తాన్ జాతీయులు నగరం విడిచి వెళ్లిపోయారని అధికార వర్గాలు తెలిపాయి. వైద్య చికిత్స కోసం ఇక్కడకు వచ్చిన పాకిస్తాన్ జాతీయుల మిగిలిన స్వల్పకాలిక వీసాలను కూడా పోలీసులు ధృవీకరించి, ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని కోరారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొన్న జాబితాలో పేర్లు లేని వారు.. పాకిస్తాన్ నుంచి దీర్ఘకాలిక వీసాలపై హైదరాబాద్‌లో ఉంటున్న వారిపై పోలీసులు నిఘా ఉంచారు. మరోవైపు తాత్కాలిక వీసా, వివిధ వీసాలపై వచ్చిన వారు 48 గంటల్లో వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. హెల్త్ వీసాపై భారత్‌కు వచ్చిన వారికి మాత్రం ఏప్రిల్ 29 వరకు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం వీరిపై అధికారులు దృష్టి సారించారు. ఒక్కరోజే గడువు ఉండటంతో పాకిస్తానీయకులు ప్రయాణికి సిద్దం చేసుకోవాలని నోటీసులు జారీ చేసింది. గడువ ముగిసిన తర్వాత కూడా ఉంటే.. చర్యలు తీసుకుంటామని, జైలుకి పంపిస్తామని పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు.
సీమాంతర ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ.. పాకిస్తాన్‌తో సంబంధాలు తెంచుకునేందుకు భారత్ సిద్దమైంది. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ జాతీయుల వీసాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక మహారాష్ట్రకు సంబంధించి.. భారత పౌరులను పెళ్లి చేసుకున్నన్న పాకిస్తానీయులు, లాంగ్ టర్మ్, రెన్యూవల్ వీసాలు, ఇతర వీసాలపై మొత్తం 5,023 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. వారిలో అధికారిక లెక్కల ప్రకారం.. 250 మందిని వెనక్కి పంపారు అధికారులు.
ఇక షార్ట్ టర్మ్ వీసాలపై వచ్చిన వారిని దేశం నుంచి బహిష్కరించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలా సుమారు మహారాష్ట్రలో 250 మంది షార్ట్ టర్మ్ వీసాలపై ఉన్నట్లు గుర్తించి వారిని ఇప్పటికే పంపించేశారు. మహారాష్ట్రలోనే సుమారు 107 పాకిస్తానీయులు భారత్‌కు వచ్చి ఎటు వెళ్లారన్నది తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. వారందరూ మిస్సయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు.
