- Home
- National
- కిలో చికెన్ రూ.800, బియ్యం రూ.340: కష్టాల్లోపాక్.. భారత్ తో యుద్ధం దానికే నష్టం.. ఎందుకంటే?
కిలో చికెన్ రూ.800, బియ్యం రూ.340: కష్టాల్లోపాక్.. భారత్ తో యుద్ధం దానికే నష్టం.. ఎందుకంటే?
Chicken costs Rs. 800 per kg in Pakistan: జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణం కనిపిస్తోంది. ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడైనా యద్ధం మొదలుకావచ్చు అనే రిపోర్టుల మధ్య పాకిస్తాన్ లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ లో కిలో చికెన్ ధరలు రూ.800లకు చేరాయి. కిలో బియ్యం ధరలు 340 రూపాయలుగా ఉంది.

File PhotoChicken costs Rs. 800 per kg, rice costs Rs. 340: Pakistan is in trouble.. War with India is difficult
Chicken costs Rs. 800 per kg in Pakistan: భారత్ తో యుద్ధం అంటే పాకిస్తాన్ లో ఆకలి చావులు తప్పవు. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉంది. ఇలాంటి సమయంలో రెచ్చగొడుతూ భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది పాకిస్తాన్.
పాకిస్తాన్ చరిత్రలో ఎప్పడు లేనంతగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలోని పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆహార ధరలు లక్షలాది మందిని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. చాలా మంది ఆకలి మంటల్లోకి జారుకుంటున్నారు. పాక్ లో చికెన్ ధర కిలోకు దాదాపు రూ.800, బియ్యం రూ.340కి చేరుకున్నాయి. గుడ్లు డజనుకు రూ.332లకు చేరుకుంది. లీటరు పాలు ధరలు రూ.224కి చేరాయి. ఇలా దేశంలోని నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటి ధరల పెరుగుదల దేశంలోని చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయి. భారత్ తో యుద్ధం అంటూ రెచ్చగొట్టే చర్యలతో పరిస్థితిని మరింత దారుణంగా మార్చుకుంటోంది పాకిస్తాన్.
Chicken costs Rs. 800 per kg, rice costs Rs. 340: Pakistan is in trouble.. War with India is difficult
పాకిస్తాన్ లో తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభం
ప్రపంచ బ్యాంకు నివేదికల ప్రకారం.. పాకిస్తాన్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు వరి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల దిగుబడిని దెబ్బతీశాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార భద్రత మరింత ప్రమాదంలో పడింది. దీనికి తోడు ప్రభుత్వ చర్యలు ఆర్థికంగా దేశాన్ని మెరుగైన స్థితిలోకి తీసుకురాలేకపోయాయి. ఈ సంవత్సరం 1 కోటి మందికి పైగా ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని అంచనా. వ్యవసాయ రంగం క్షీణించడంతో పాటు ప్రభుత్వం చర్యలు మెరుగ్గా లేకపోవడం దీనికి ప్రధాన కారణం.
Chicken costs Rs. 800 per kg, rice costs Rs. 340: Pakistan is in trouble.. War with India is difficult
ద్రవ్యోల్బణంతో ప్రజలపై పెరుగుతున్న భారం
సగటు ద్రవ్యోల్బణం రేటు 25 శాతానికి చేరడంతో పాకిస్తాన్ ఆసియాలో అత్యంత దారుణంగా పాకిస్తాన్ పరిస్థితి మారింది. నిత్యావసరాల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. బ్రెడ్, బంగాళాదుంపలు, టమోటాలు, పండ్లు వంటి ప్రాథమిక ఆహారాల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో సాధారణ ఖర్చులు కూడా భరించడం పాక్ ప్రజలకు భారంగా మారింది.
Chicken costs Rs. 800 per kg, rice costs Rs. 340: Pakistan is in trouble.. War with India is difficult
దేశ ఆర్థిక పరిస్థితి మరిచి భారత్ తో యుద్ధం చేస్తామంటున్న పాకిస్తాన్
జమ్మూ కాశ్మీర్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మందికి పైగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల వెనుక పాకిస్తాన్ ఉందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలోనే భారత్ చర్యలకు ఉపక్రమించడంతో.. పాకిస్తాన్ మరింత రెచ్చగొడుతూ యుద్ధమే అంటూ కామెంట్స్ చేస్తోంది. దీంతో భారత-పాక్ సంబంధాలు మరింత దిగజారాయి.
ఏప్రిల్ 2024 నుండి జనవరి 2025 వరకు పాకిస్తాన్ భారతదేశం నుండి రూ. 450 మిలియన్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. అయితే, నిజమైన వాణిజ్య పరిమాణం దుబాయ్, సింగపూర్ వంటి థర్డ్ పార్టీల నుంచి దాదాపు USD 10 బిలియన్లకు చేరింది. ముఖ్యంగా ఔషధాలు, చక్కెర వంటి వస్తువుల కోసం పాకిస్తాన్ ఈ మార్గాన్ని ఆశ్రయిస్తోంది.
Chicken costs Rs. 800 per kg, rice costs Rs. 340: Pakistan is in trouble.. War with India is difficult
భారత్ తో యుద్ధమంటే పాకిస్తాన్ కు కష్టమే
భారీ ఆర్థిక సంక్షోభం, ప్రజల ఆకలి సమస్యల మధ్య, పాకిస్తాన్ సైనిక ఘర్షణను తట్టుకునే స్థితిలో ఉందా? అనేది ఓ ముఖ్యమైన ప్రశ్నగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కూలిపోయే దశలో ఉంది. అంతర్గతంగా ఆహార, వ్యవసాయ రంగాల క్షీణత, బాహ్యంగా ఉద్రిక్తతలు, దౌత్య ఒత్తిళ్లు.. ఇవన్నీ కలసి దేశ భవిష్యత్తుపై నీడలు ముసురుతున్నాయి. భారత్ తో కవ్వింపు చర్యలు మొత్తంగా పాకిస్తాన్ నే నిండా ముంచుతాయి. కానీ, ఆ దేశనాయకులు ఈ విషయాలను ఎందుకు గుర్తించడం లేదని విశ్లేషకులు ఎత్తిచూపుతున్నారు. ప్రపంచ దేశాలు సైతం పాక్ తీరును తప్పుబడుతున్నాయి.