Nifty prediction tomorrow 29 April: మార్కెట్లు మంచి గ్యాప్-అప్‌తో ప్రారంభమై సోమవారం మొత్తం అదే జోష్‌ను కొనసాగించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 1,005.84 పాయింట్లు (1.27%) పెరిగి 80,218.37 వద్ద, నిఫ్టీ 289.15 పాయింట్లు (1.20%) పెరిగి 24,328.50 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.3%, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.4% పెరిగాయి. మరి రేపు షేర్ మార్కెట్ ఎలా ఉండనుంది?
Nifty prediction tomorrow 29 April: భారతీయ స్టాక్ మార్కెట్ ఏప్రిల్ 28న బలంగా పుంజుకుంది. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మెరుగైన త్రైమాసిక ఫలితాల వలన భారీగా కొనుగోళ్ల వెల్లువ కనిపించింది. దీని ప్రభావంతో BSE సెన్సెక్స్ 1,005 పాయింట్లు ఎగిసి 80,218 వద్ద ముగిసింది. అలాగే, నిఫ్టీ 50 ఇండెక్స్ 289 పాయింట్లు లాభపడి 24,328 వద్ద స్థిరపడింది.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 29 (మంగళవారం) నిఫ్టీ మార్కెట్ ఎలా ఉండబోతుందనే దానిపై నిపుణుల అభిప్రాయాలు, చార్ట్ ప్యాటర్న్ విశ్లేషణలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిఫ్టీ డైలీ చార్ట్‌లో లాంగ్ బుల్ క్యాండిల్ ఏర్పడటం కనిపిస్తోంది. ఈ చార్ట్ నమూనా ఇండెక్స్‌లో అప్‌ట్రెండ్ పటిష్టంగా ఉందని సూచిస్తుంది. సోమవారం (ఏప్రిల్ 28)న భారత స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ4 బలమైన ఫలితాల నేపథ్యంలో ఆ షేర్లలో భారీ కొనుగోళ్లు జరిగాయి. దీంతో మార్కెట్ ఒక శాతానికి పైగా పెరిగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,005.84 పాయింట్లు లేదా 1.27 శాతం పెరిగి 80,218.37 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ 289.15 పాయింట్లు లేదా 1.20 శాతం లాభపడి 24,328.50 వద్ద స్థిరపడింది.
నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, స్వల్పకాలంలో నిఫ్టీ సెంటిమెంట్ సానుకూలంగానే ఉంది. నిఫ్టీకి తక్షణ నిరోధక స్థాయి 24400 నుండి 24500 పరిధిలో ఉంది, తక్షణ మద్దతు 24150 వద్ద, ఆ తర్వాత 24000 వద్ద ఉంది. ఒకవేళ నిఫ్టీ ఈ స్థాయిలను బ్రేక్అవుట్ (breakout) ఇస్తే, తదుపరి లక్ష్యం 24800 అవుతుంది.
ఏప్రిల్ 29 నిఫ్టీ అంచనాలు
ఎల్‌కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్, రూపాక్ దే మాట్లాడుతూ, నిఫ్టీ ఇంకా ఇటీవల గరిష్ట స్థాయికి దిగువనే ఉందని, ఇది ఇండెక్స్‌లో కన్సాలిడేషన్ (consolidation) అవకాశం ఉందని సూచిస్తుందని అన్నారు.
"నిఫ్టీకి 24,360 వద్ రెసిస్టన్స్ ఉంది. 24,360 స్థాయిని నిర్ణయాత్మకంగా దాటితే తప్ప, ఇండెక్స్ ప్రస్తుత పరిధిలోనే కొంత సమయం వుండవచ్చు. ఒకవేళ నిఫ్టీ 24,360ని దాటితే, అప్పుడు ఇండెక్స్ స్వల్పకాలిక లక్ష్యమైన 24,550 వైపు కదులుతుంది. ఇక్కడ మునుపటి పతనం 26,277 నుండి 21,743 వరకు ఉన్న ఫిబొనాక్సీ రీట్రేస్‌మెంట్ (Fibonacci retracement) స్థాయి 61.80% ఉంది" అని మార్కెట్ నిపుణుడు చెప్పారు.
"లోవర్ ఎండ్ లో నిఫ్టీకి 24,000 వద్ద మద్దతు ఉంది. నిఫ్టీ 24000 దిగువకు పడిపోతే, మరింతగా అమ్మకాలు తిరిగి రావచ్చు. ఇండెక్స్ 23,800 లేదా అంతకంటే తక్కువ 23,350 వైపు పడిపోవచ్చు" అని తెలిపారు.
నిఫ్టీ 50 చార్ట్ ట్రేడింగ్ వ్యూ
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్, నాగరాజ్ శెట్టి మాట్లాడుతూ, నిఫ్టీ డైలీ చార్ట్ ఒక లాంగ్ బుల్ క్యాండిల్ ఏర్పడటాన్ని చూపిస్తుందని, ఇది శుక్రవారం నాటి లాంగ్ నెగటివ్ క్యాండిల్‌ను దాదాపుగా కనిపించకుండా చేస్తుందని అన్నారు.
అలాగే, ఈ నిఫ్టీ చార్ట్ నమూనా శుక్రవారం ఏర్పడిన రివర్సల్ నమూనా తర్వాత ఫాలో-త్రూ అమ్మకాలు లేవని సూచిస్తుందనీ, నిఫ్టీ తక్షణ అడ్డంకి అయిన 24360 స్థాయి వద్ద అప్‌సైడ్ బ్రేక్అవుట్ అంచున కూడా ఉందని చెప్పారు.
అయితే, నిఫ్టీ స్వల్పకాలిక అప్‌ట్రెండ్ పటిష్టంగానే ఉందని మార్కెట్ నిపుణుడు తెలిపారు. "నిఫ్టీ 24400 పైన బలమైన కదలికను ఇస్తే, అది ఇటీవల ఏర్పడిన స్వల్పకాలిక బేరిష్ (bearish) నమూనాను తోసిపుచ్చుతుంది. నిఫ్టీ తదుపరి నిరోధక స్థాయి 24600 నుండి 24800 జోన్‌లో ఉంది, మద్దతు 24050 వద్ద ఉంటుదన్నారు.
నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టన్స్ స్థాయిలు
హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ డెరివేటివ్ & టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్, నందిష్ షా మాట్లాడుతూ, నిఫ్టీ ఇండెక్స్ అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోందనీ, ఇది రన్నింగ్ కరెక్షన్ సమయంలో కూడా తన 8-రోజుల ఇఎంఎ (ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్) స్థాయికి దిగువకు పడిపోలేదని అన్నారు.
నిఫ్టీ నెక్ట్స్ రెసిస్టన్స్ లెవల్ 24545 వద్ద ఉంది, ఇది 26277 నుండి 21743 వరకు కనిపించిన మొత్తం పతనంలో 61.8% రీట్రేస్‌మెంట్ అవుతుంది. దిగువ స్థాయిలో 24150 నిఫ్టీకి తక్షణ మద్దతుగా పనిచేస్తుందని కూడా అన్నారు.
రిలిగేర్ బ్రోకింగ్ ఎస్‌విపి, రీసెర్చ్, అజిత్ మిశ్రా మాట్లాడుతూ, నిఫ్టీ 24,400 పైన బ్రేక్అవుట్ ఇస్తే, అది తాజా ర్యాలీని ప్రేరేపిస్తుందని అన్నారు. నిఫ్టీ స్వల్పకాలిక లక్ష్యం 24,800గా చెప్పారు. ఈ పరిణామాలన్నింటి మధ్య, స్థిరమైన అవుట్‌పెర్ఫార్మెన్స్ చూపుతున్న రంగాలు, థీమ్‌లపై దృష్టి పెట్టాలి, ఏవైనా మధ్యస్థాయి పతనం వచ్చినప్పుడు నాణ్యమైన కౌంటర్లను సేకరించడం లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు.
నిఫ్టీ ఆర్‌ఎస్‌ఐ 60 పైనే
సామ్కో సెక్యూరిటీస్ డెరివేటివ్స్ రీసెర్చ్ అనలిస్ట్, ధూపేష్ ధమేజా మాట్లాడుతూ, సాంకేతిక పరంగా, నిఫ్టీ అప్‌వర్డ్ మొమెంటం క్రమంగా బలం పుంజుకుంటుందని అన్నారు. నిఫ్టీ తన 10-రోజుల ఇఎంఎ వద్ద బలమైన మద్దతును కొనసాగిస్తోంది, ఇది బుల్లిష్ నియంత్రణను తిరిగి ధృవీకరిస్తుందన్నారు. మొమెంటం పరంగా, నిఫ్టీ డైలీ ఆర్‌ఎస్‌ఐ సూచిక 60 పైన కదులుతోంది. ఇది నిఫ్టీ అంతర్గత బలం బుల్స్‌కు అనుకూలంగా ఉందని సూచిస్తుందని మార్కెట్ నిపుణుడు చెప్పారు.
నిఫ్టీ డైలీ చార్ట్‌లో ఒక ముఖ్యమైన బుల్లిష్ క్యాండిల్‌స్టిక్ నమూనా ఆవిర్భవించిందనీ, నిఫ్టీ 23,900–24,000 బ్రేక్అవుట్ జోన్ పైన స్థిరంగా నిలదొక్కుకుంటోంది, ఇది దిగువ స్థాయిల నుండి బలమైన డిమాండ్‌ను సూచిస్తుంది. నిఫ్టీ తక్షణ నిరోధక స్థాయి 24,400 - 24,500 మధ్య సమూహంగా ఉంది. ఈ జోన్ పైన బ్రేక్అవుట్ షార్ట్-కవరింగ్ ర్యాలీలను ప్రేరేపించి, తాజా కొనుగోలు ఆసక్తిని ఆకర్షిస్తుందన్నారు. నిఫ్టీ 24,000 దిగువకు పడిపోతే, అమ్మకాలు కొనసాగవచ్చు.. ఇండెక్స్ 23,800 వైపు కదలవచ్చని పేర్కొన్నారు.
