IPL 2025: వరుస ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్ ఎలా బలమైన టీమ్ గా మారింది?
IPL Mumbai Indians Resurgence After Poor Start: ఐపీఎల్ 2025 లో ముంబై ఇండియన్స్ అద్భుతంగా పుంజుకుంది. సీజన్ ప్రారంభంలో తొమ్మిదో స్థానంలో ఉన్న ముంబై జట్టు ఇప్పుడు 12 పాయింట్లతో మూడో స్థానానికి దూసుకెళ్లింది. పూర్ స్టార్ట్ నుంచి బలమైన జట్టుగా ముంబై ఇండియన్స్ ఎలా మారింది? హార్దిక్ పాడ్యా కెప్టెన్సీలోని ముంబై జట్టు బలం ఎలా పొందింది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

IPL Mumbai Indians Resurgence After PoorStart
IPL Mumbai Indians Resurgence After PoorStart: ఐపీఎల్ 2025లో నిరాశాజనక ప్రారంభం తర్వాత ముంబై ఇండియన్స్ అద్భుతంగా పుంజుకుంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్లు ప్రస్తుత సీజన్‌లోని తొలి 5 మ్యాచ్‌లలో కేవలం 2 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. టోర్నమెంట్ నుండి ప్రారంభ ఎగ్జిట్ అంచున ఉన్నారు.
అయితే, హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ వరుసగా తదుపరి ఐదు మ్యాచ్‌లను గెలిచి అద్భుతంగా తిరిగి రేసులోకి వచ్చింది. పాయింట్ల పట్టికలో టాప్ 4లోకి ప్రవేశించింది, ప్రస్తుతం 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఏప్రిల్ 27 ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరుగుల తేడాతో గెలిచింది. సీజన్‌కు పేలవమైన ప్రారంభం తర్వాత ప్లేఆఫ్‌లకు అర్హత సాధించి, రికార్డు స్థాయిలో ఆరో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకునే దిశగా ముందుకు సాగుతోంది.
ముంబై ఇండియన్స్ అద్భుతమైన పునరాగమనం చేయడం ఐపీఎల్ సీజన్‌లో హాట్ టాపిగ్ గా ఉంది. పూర్ స్టార్ నుంచి ప్రత్యర్థి జట్లకు దడపుట్టించే టీమ్ గా ముంబై ఎలా మారింది?
రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడంతో మొదలైన ముంబై విజయాలు
పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న తర్వాత ముంబై ఇండియన్స్ అద్భుతమైన పునరాగమనం చేయడానికి ప్రధాన కారణాల్లో ఒకటి రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం. సీజన్‌లోని తొలి ఆరు మ్యాచ్‌లలో రోహిత్ ప్రభావం చూపడానికి చాలా ఇబ్బంది పడ్డాడు, అతని స్కోర్లు 0, 8, 13, 17, 18, 26 పరుగులు మాత్రమే. 13.66 సగటుతో కేవలం 82 పరుగులు చేశాడు. టాప్-ఆర్డర్‌లో రోహిత్ దారుణ ప్రదర్శన ముంబై ఇండియన్స్‌ను దెబ్బకొట్టింది.
అయితే, రోహిత్ శర్మ చివరకు 45 బంతుల్లో 76 పరుగులతో అజేయంగా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో తన ఫామ్ ను అందుకున్నాడు. దీని తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 46 బంతుల్లో 70 పరుగులతో మరో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ ఈ రెండు ఇన్నింగ్స్‌లు టాప్-ఆర్డర్‌లో స్థిరత్వాన్ని తెచ్చిపెట్టాయి. ర్యాన్ రికెల్టన్ తో కలిసి ముంబై జట్టుకు బలమైన ఆరంభం అందిస్తున్నాడు.
కుదురుకున్న ముంబై మిడిల్ ఆర్డర్
మిడిల్-ఆర్డర్ బ్యాటర్ల అస్థిర ప్రదర్శనలు సీజన్ ప్రారంభంలో ముంబై ఇండియన్స్‌ను ఇబ్బంది పెట్టాయి. దీంతో ఆరు మ్యాచ్‌లలో ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయారు. అయితే, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ లు మంచి ఫామ్ ను అందుకుని అవసరమైన సమయంలో సూపర్ నాక్స్ ఆడటం ముంబైకి కలిసివస్తోంది.
సూర్యకుమార్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతున్నాడు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడంతో పాటు వికెట్లు పడిన సమయంలో స్థిరంగా నిలబడి అవసరమైన ఇన్నింగ్స్ లను ఆడుతున్నాడు. ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ ఐపీఎల్ 2025లో రెండవ అత్యధిక పరుగుల చేసిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. 10 మ్యాచ్‌లలో 61 సగటుతో 3 అర్ధ సెంచరీలతో సహా 427 పరుగులు చేశాడు. ఇక నమన్ ధీర్ చాలా నమ్మదగిన దిగువ-ఆర్డర్ బ్యాటర్. అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు.
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అదరిపోయింది
ముంబై ఇండియన్స్ తిరిగి పుంచుకోవడంతో ప్రధాన కారణాల్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కూడా ఒకటి. పాండ్యా చురుకైన, వ్యూహాత్మక కెప్టెన్సీ ముంబై విజయాల్లో కీలక పాత్రపోషించింది. ముంబై వరుస పరాజయాల తర్వాత పాండ్యా వ్యూహాత్మక మార్పులు చాలా చేశాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో విల్ జాక్స్‌ను నంబర్ 3కి తీసుకువచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ ను మార్చగల సత్తాను ఉపయోగించుకోవడానికి నంబర్ 4లోకి మార్చాడు. ఈ మార్పులు సత్ఫలితాలు ఇచ్చాయి.
అలాగే, హార్దిక్ పాండ్యా మిడిల్, డెత్ ఓవర్లలో బౌలర్లను వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్నాడు. స్పిన్నర్ మిచెల్ శాంట్నర్, కర్ణ్ శర్మ, విల్ జాక్స్‌లను స్కోరింగ్ రేటుపై బ్రేక్‌లు వేయడానికి తీసుకువచ్చాడు. ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాను డెత్ ఓవర్లలో ఉపయోగించుకుని విజయం సాధించాడు. గాయం నుండి బుమ్రా తిరిగి వచ్చినప్పటికీ, హార్దిక్ ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్‌లతో కొత్త బంతి బౌలర్లుగా కొనసాగించాడు, ఎందుకంటే వారు బుమ్రా లేనప్పుడు MI కోసం పవర్‌ప్లేలో కీలక పాత్ర పోషించారు. తన కెప్టెన్సీతో పాటు, హార్దిక్ పాండ్యా తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 10 మ్యాచ్‌లలో ఐదు వికెట్లతో సహా 109 పరుగులు, 12 వికెట్లు తీసుకున్నాడు.
MI బౌలర్లు అందరూ బాగా రాణించారు
ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకోవడంతో బౌలింగ్ కీలకంగా మారింది. జస్ప్రీత్ బుమ్రా తిరిగి రావడంతో పేస్ బౌలింగ్ దాడి మరింత బలపడింది. బౌల్ట్, చాహర్ పవర్‌ప్లేలో చాలా ప్రభావం చూపిస్తున్నారు. అలాగే, డెత్ ఓవర్లలో బాధ్యతను తీసుకుంటున్నారు. బుమ్రా తిరిగి వచ్చిన తర్వాత పేస్ బౌలింగ్ విభాగం మొత్తంగా బలంగా మారింది. గత ఐదు మ్యాచ్‌లలో పేస్ బౌలర్లు 22 వికెట్లు తీసుకున్నారు. 4 వికెట్లతో అద్భుతమైన అరంగేట్రం చేసిన అశ్విని కూడా ముంబై బౌలింగ్ లో కీలకంగా మారాడు.
పవర్‌ప్లేలో వికెట్లు తీసుకునే పేస్ బౌలింగ్ త్రయం సామర్థ్యం స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ మిడిల్ ఓవర్లలో నియంత్రణను తీసుకురావడానికి, ప్రత్యర్థి పరుగుల ప్రవాహాన్ని పరిమితం చేయడానికి వీలు కల్పించింది. MIకి ప్రధాన స్పిన్నర్‌గా, శాంట్నర్ ప్రత్యర్థి బ్యాటర్లను, ముఖ్యంగా కీలకమైన సందర్భాలలో అడ్డుకోవడానికి పరిస్థితులను సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు.
ముంబై ఇండియన్స్ ముందు టార్గెట్ ఏంటి?
ముంబై ఇండియన్స్ ఐదు విజయాలతో ఫుల్ జోష్ లో ఉంది. పాయింట్ల పట్టికలో 9వ స్థానం నుండి మూడో స్థానానికి ఎగబాకింది, కానీ ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్లు తమ స్థిరత్వాన్ని కొనసాగించడం, మిగిలిన మ్యాచ్‌లలో ఒత్తిడిని అధిగమించడం ముఖ్యం. ముంబై ఇప్పటికీ ప్లేఆఫ్‌ల రేసులో ఉంది. ఇంకా అర్హత సాధించలేదు. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ కూడా పోటీలో ఉన్నాయి. మిగిలిన మ్యాచ్ లను గెలవడం చాలా కీలకం.
ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌తో రెండు ఎవే మ్యాచ్‌లు, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో హోమ్ గేమ్‌లు ఆడనుంది. ముంబై తమ మిగిలిన నాలుగు లీగ్ మ్యాచ్‌లలో కనీసం రెండు విజయాలు సాధిస్తే ప్లేఆఫ్ బెర్త్‌ను సాధించడం పక్కా.