బాహుబలి 2 కోసం ప్రభాస్, అనుష్క, రానా రెమ్యునరేషన్లు ఎంత తీసుకున్నారో తెలుసా?
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన టాలీవుడ్ పాన్ ఇండియా సినిమా బాహుబలి 2 . ఈ సినిమా రిలీజ్ అయ్యి 8 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా బాహుబలి సినిమా కోసం ప్రభాస్ తో పాటు అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, రమ్య కృష్ణ లాంటి స్టార్లు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో చూద్దాం.

బాహుబలి 2 విడుదలై 8 ఏళ్ళు
ప్రభాస్ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా బాహుబలి 2. ఈసినిమా రిలీజ్ అయ్యి 8 సంవత్సరాలు పూర్తయ్యాయి.బాహుబలికి రెండో భాగంగా 2017లో ఈసినిమా విడుదలైన వెంటనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమాను తండోపతండాలుగా జనాలు వచ్చి చూశారు.
Also Read: బాహుబలి 2 లో ప్రభాస్, అనుష్క, రానా చెప్పిన అదిరిపోయే టాప్ 10 డైలాగ్స్
బాహుబలి 2 బాక్సాఫీస్ కలెక్షన్స్
రాజమౌళి 250 కోట్ల బడ్జెట్‌తో బాహుబలి 2ని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1780.60 కోట్లు వసూలు చేసింది. ఈ బ్లాక్‌బస్టర్ చిత్రంలో నటించిన ప్రభాస్ లాంటి మరికొందరు స్టార్లు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసుకుందాం?
ప్రభాస్ పారితోషికం
1. ప్రభాస్ బాహుబలి 2లో అమరేంద్ర బాహుబలి పాత్ర పోషించారు. ఈ పాత్రకు ఆయనకు 25 కోట్ల పారితోషికం తీసుకున్నారు.
అనుష్క శెట్టి పారితోషికం
2. అనుష్క శెట్టి బాహుబలి 2లో దేవసేన పాత్ర పోషించారు. ఆమెకు 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది
రానా దగ్గుబాటి పారితోషికం
3. రానా దగ్గుబాటి బాహుబలి 2లో భల్లాలదేవ పాత్ర పోషించారు. ఈ పాత్రకు ఆయనకు 15 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారు.
తమన్నా పారితోషికం
4. తమన్నా భాటియా బాహుబలి 2లో అవంతిక పాత్ర పోషించారు. ఈ పాత్రకు ఆమెకు 5 కోట్ల రూపాయల పారితోషికం లభించింది.
రమ్యకృష్ణ పారితోషికం
5. రమ్యకృష్ణ బాహుబలి 2లో శివగామి పాత్ర పోషించారు. ఈ పాత్రకు ఆమెకు 2.5 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది.
సత్యరాజ్ పారితోషికం
6. సత్యరాజ్ బాహుబలి 2లో కట్టప్ప గా అద్భుతమైన పాత్ర పోషించారు. ఈ చిత్రంలో నటించినందుకు ఆయనకు 2 కోట్ల రూపాయల పారితోషికం లభించింది.
రాజమౌళి పారితోషికం
బాహుబలి 2 చిత్రానికి దర్శకత్వం వహించినందుకు ఎస్ఎస్ రాజమౌళికి 28 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంది రాజమౌళినే.