అవసరమైతే ప్రధానిని కలుస్తా, అమరావతి ప్రజారాజధాని: పవన్ కళ్యాణ్

By Nagaraju penumalaFirst Published Aug 30, 2019, 2:37 PM IST
Highlights

రాజధానిపై సీఎం జగన్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి రైతులు ప్రభుత్వానికి మాత్రమే భూములు ఇచ్చారని పార్టీకి కాదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వంలో చలనం రాకపోతే ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుస్తామని హెచ్చరించారు జనసేనాని పవన్ కళ్యాణ్. 
 

అమరావతి: అమరావతిపై అవసరం అయితే ప్రధాని నరేంద్రమోదీని సైతం కలుస్తానని స్పష్టం చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అమరావతి ప్రజారాజధాని కావాలని డిమాండ్ చేశారు. అమరావతిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. 

నిడమర్రు ప్రాంతం నుంచి పవన్ కళ్యాణ్ తన పర్యటన ప్రారంభించారు. నిడమర్రులో రైతుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. అక్కడ నుంచి కురగల్లు, ఐనవోలు, అనంతవరం, దొండపాడు ప్రాంతాల్లో జనసేనాని పర్యటించారు. 

కొండవీటివాగు దగ్గర రైతులతో ప్రత్యేకంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రైతులతో ముఖాముఖి అయ్యారు. అమరావతిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. తమను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని పవన్ కు మెురపెట్టుకున్నారు. 

రాజధానిపై మంత్రులు ఇష్టంవచ్చినట్లు ప్రకటన చేయడంతో తాము ఇబ్బందులు పాలవుతున్నామని తెలిపారు. గ్రామాల్లో తాగునీటి వసతులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. 

అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో తాము గందరగోళానికి గురవుతున్నట్లు పవన్ కళ్యాణ్ కు మెురపెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుతో ఉన్నప్పుడు తమరు ఇచ్చిన హామీలతో రాజధానికి భూములు ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ కు రైతులు స్పష్టం చేశారు.

రాజధానిపై రైతులు ఆందోళన చెందొద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాజధానిపై మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. మంత్రులు సంయమనంతో పాటించాలని సూచించారు. 

మరోవైపు రాజధానిపై సీఎం జగన్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి రైతులు ప్రభుత్వానికి మాత్రమే భూములు ఇచ్చారని పార్టీకి కాదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వంలో చలనం రాకపోతే ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుస్తామని హెచ్చరించారు జనసేనాని పవన్ కళ్యాణ్. 

ఈ వార్తలు కూడా చదవండి

రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన, రైతులతో సమావేశంకానున్న జనసేనాని

అమరావతిలో భూములు లేవు.. ఆధారాలుంటే కేసులు పెట్టుకోండి: సుజనా చౌదరి

అంతా గందరగోళంగా ఉంది.. వెయిట్ అండ్ సీ: అమరావతిపై బొత్స వ్యాఖ్యలు

అమరావతిపై సీఎం సమీక్ష: ఉంచుతారా....?తరలించేస్తారా...? జగన్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

ముంపు చూపిస్తే మూడున్నరెకరాలు రాసిస్తా: బొత్సకు మహిళా రైతు సవాల్

ఒక సెంటు భూమి లేదన్నారు, ఈ 124 ఎకరాల సంగతేంటి : సుజనా చిట్టావిప్పిన బొత్స

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా...
అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్

అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్

మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

 

click me!