Asianet News TeluguAsianet News Telugu

బెజవాడకు కోడెల భౌతిక కాయం: బోరుమన్న కుమారుడు, ఓదార్చిన దేవినేని ఉమా

కోడెల శివరాం కెన్యా నుండి మంగళవారం నాడు విజయవాడకు చేరుకొన్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి నేరుగా ఆయన తన తండ్రి పార్థీవ దేహం వద్దకు చేరుకొన్నారు. 

kodela sivaram cries after seen his fathers dead body
Author
Vijayawada, First Published Sep 17, 2019, 4:54 PM IST


విజయవాడ: మాజీ మంత్రి, ఏపీ మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పార్థీవ దేహం మంగళవారంనాడు మధ్యాహ్నం విజయవాడకు చేరుకొంది. విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నంలో చేరుకొంది. కోడెల శివప్రసాదరావు  అంతిమయాత్రలో పాల్గొన్న తనయుడు శివరాం కంటతడి పెట్టుకొన్నారు.

కెన్యా నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు కోడెల శివప్రసాద్ రావు తనయుడు కోడెల శివరాం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా ఇబ్రహీంపట్నం కు చేరుకొన్నారు. ఇబ్రహీంపట్నం వద్ద కోడెల శివరాం ను మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తీసుకెళ్లి అంబులెన్స్‌లో కోడెల శివప్రసాద్ రావు మృతదేహన్ని చూపించారు.

అంబులెన్స్ లో తండ్రి పార్థీవ దేహం వద్దే శివరాం నిశ్చేష్టుడై నిలబడిపోయారు.కోడెల పార్థీవ దేహన్ని తరలిస్తున్న అంబులెన్స్‌ ను  ముందుకు కదలకుండా పరిటాల వద్ద గ్రామస్తులు అడ్డుకొన్నారు.

తాము కోడెల శివప్రసాదరావు బౌతిక కాయాన్ని కడసారి చూడకుండానే గ్రామం నుండి ఎలా తీసుకెళ్తారని వారు ప్రశ్నించారు. అంబులెన్స్ ముందు బైఠాయించడంతో  పోలీసులు వారికి నచ్చజెప్పడంతో సమస్య పరిష్కారమైంది.

మరో వైపు కోడెల మృతదేహం తరలిస్తున్న  అంబులెన్స్ కు ముందుగా విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, కోడెల తనయుడు కోడెల శివరాం నడిచారు. వర్షం పడుతున్నా కూడ లెక్కచేయకుండా టీడీపీ క్యాడర్ కోడెల మృతదేహం తరలిస్తున్న అంబులెన్స్ పై పూలు చల్లుతూ ర్యాలీలో పాల్గొన్నారు.

మరో వైపు అంతిమయాత్రలో పాల్గొన్న కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం కన్నీరు పెట్టుకొన్నారు.శివరాం కన్నీళ్లు పెట్టుకొన్న సమయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆయనకు దైర్యం చెప్పారు.

కోడెల పార్థీవ దేహం అంబులెన్స్ వెనుకే చంద్రబాబునాయుడు, లోకేష్ లు కూడ తమ వాహనాల్లో ర్యాలీగా పాల్గొన్నారు. కొన్ని గ్రామాల్లో అధైర్యపడొద్దని చంద్రబాబు పార్టీ కార్యకర్తలను కోరారు.


సంబంధిత వార్తలు

చేతులెత్తి మెుక్కినా వేధించడం దుర్మార్గం: మంత్రి కొడాలి నానికి డొక్కా కౌంటర్

టీడీపీ అండగా లేకపోవడం వల్లే కోడెల కుంగిపోయారు: శ్రీకాంత్ రెడ్డి

విజయవాడ చేరుకున్న కోడెల శివరాం: గుంటూరు తీసుకెళ్లిన బంధువులు

కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా

అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ ఆదేశం

నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు

కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం

కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ

వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

Follow Us:
Download App:
  • android
  • ios