27 ఏళ్లు ఎమ్మెల్యేగా, 37 ఏళ్ల రాజకీయ జీవితం గడిపిన కోడెల ప్రాణాలను జగన్‌ ప్రభుత్వం, వైసీపీ నేతలే బలి తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల బలవన్మరణానికి వైసీపీ నేతలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 

అమరావతి: ఏపీ అసెంబ్లీ మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు కారణం వైసీపీ నేతల కుట్రే కారణమని ఆరోపించారు మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. వైసీపీ నేతలు, ప్రభుత్వం, పోలీసులు, సాక్షి మీడియాయే కోడెల ఆత్మహత్యకు ప్రధాన కారమని ఆరోపించారు. 

కోడెల ఆత్మహత్యను రాజకీయం చేసేందుకు వైసీపీ ప్రయత్నించిందని ఆరోపించారు. విదేశాల్లో ఉన్న కొడుకే చంపాడని వైసీపీ నేత సాయితో ఫిర్యాదు చేయించడం దారుణమన్నారు. మంత్రి బొత్స వ్యాఖ్యలు, సాయి ఫిర్యాదు చూస్తే రెండూ ఒకే రకంగా ఉన్నాయని యనమల స్పష్టం చేశారు.  

వైసీపీ నేతల కుట్రలకు ఇవే నిదర్శనమని చెప్పుకొచ్చారు. కోడెలది హత్యేనని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు కోడెలది ఆత్మహత్యే అని ఫోరెన్సిక్‌ నివేదికలో ధ్రువీకరించారని దానిపై ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. 

27 ఏళ్లు ఎమ్మెల్యేగా, 37 ఏళ్ల రాజకీయ జీవితం గడిపిన కోడెల ప్రాణాలను జగన్‌ ప్రభుత్వం, వైసీపీ నేతలే బలి తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల బలవన్మరణానికి వైసీపీ నేతలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 

నరసరావుపేటలో తక్షణమే నిషేధాజ్ఞలు తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  మహానేత కోడెల అంత్యక్రియలకు పెద్దఎత్తున కార్యకర్తలు, పార్టీ నేతలు తరలివచ్చే అవకాశం ఉందని దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయోద్దని ప్రభుత్వాన్ని కోరారు మాజీమంత్రి యనమల రామకృష్ణుడు. 

ఈ వార్తలు కూడా చదవండి

 రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ

వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య